నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి
ఇప్పుడు నే నెటుచూసినా
నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా
నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు.
ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు
ప్రతిరోజూ నేను సంభాషించేది వాళ్లతోనే.
నా ఆనందం వాళ్లతో పంచుకోవడం ఇష్టం,
నా బాధలకి ఉపశాంతి కోరేదీ వాళ్ళ దగ్గరే;
నేను వాళ్లకి ఎంత ఋణపడి ఉన్నానో
నాకు అర్థమై, అనుభూతి చెందుతున్న కొద్దీ
కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్ళతో
నా చెంపలు తరచు తడిసిపోతుంటాయి.
నా ఆలోచనలన్నీ ఆ మృతజీవులతోనే,
వాళ్లతో నేను భూతకాలంలో జీవిస్తుంటాను
వాళ్ళ మంచి ఇష్టపడతాను, చెడు నిరసిస్తాను
వాళ్ల ఆశనిరాశలలో భాగస్వామినౌతాను,
వాళ్ళు ఇచ్చిన సందేశాలను విని, జ్ఞానార్థినై
వినమ్రతతో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాను.
ఇక నా ఆశలన్నీ వాళ్లమీదే. ఎందుకంటే
త్వరలోనే నేను వాళ్ళ చెంత చేరబోతున్నాను.
వాళ్లతో పాటే నేనుకూడా ప్రయాణం చెయ్యాలి
అంతులేని భవిష్యత్కాలమంతా.
కాకపోతే, ఇక్కడ నా పేరు విడిచిపెట్టగలననీ
అది నాతో పాటు మట్టిపాలవదనీ నా నమ్మకం.
.
రాబర్ట్ సదే
12 August 1774 – 21 March 1843
ఇంగ్లీషు కవి

http://www.greatthoughtstreasury.com/author/robert-southey
స్పందించండి