తెంచుకున్న స్నేహం… ST కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

పాపం! వాళ్ళు చిన్నప్పటినుండీ స్నేహితులు, కానీ,

పుకార్లు పుట్టించే నాలుకలు సత్యాన్ని విషపూరితం చేస్తాయి:

స్వర్గంలో తప్ప భూమ్మీద శాశ్వతత్వం దేనికీ లేదు.

జీవితం కంటకప్రాయం; యవ్వనం నిరుపయోగం;

మనం ప్రేమించిన వాళ్లమీద రగులుతున్న కోపం

పిచ్చెత్తించేలా, బుర్రలో పనిచేస్తూనే ఉంటుంది.

రోలండ్ కీ సర్ లియొలైన్ కీ, ఇది నా ఊహ,

అది తీరే ఒక సందర్భం తటస్థించింది.

ఇద్దరూ తమ ఆరోప్రాణంలా ఉండే రెండో వారిని

చెప్పరాని అవమానకరమైన దూషణలు చేసుకున్నారు.

ఇద్దరూ మరెన్నడూ కలవలేకుండా … విడిపోయారు.

కానీ,ఇద్దరూ,బాధిస్తున్న తమ గుండెలోని వెలితిని

పూడ్చగల మరో మిత్రుణ్ణి సంపాదించలేకపోయారు.

రెండుగా విడగిట్టిన పర్వత శిఖరాగ్రాల్లా

ఇద్దరూ దూరంగా ఉండిపోయారు, మధ్యలో నిస్సారమైన

సముద్రం; మచ్చమాత్రం మిగిలిపోయింది,

ఇప్పుడిక ఎంత ఎండైనా, ఎంత హిమమైనా, ఎంతటి ఉరుమైనా

ఒకప్పుడక్కడ మంచిస్నేహం ఉండేదన్న ఆనవాళ్ళని

పూర్తిగా దాన్ని రూపుమాపలేవని నే ననుకుంటాను.

.

సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్

(21 October 1772 – 25 July 1834)

ఇంగ్లీషు కవి

.

.

Severed Friendship

.

Alas! They had been friends in youth,

But whispering tongues can poison truth:

And constancy lives in realms above;

And life is thorny; and youth is vain;

And to be wroth with one we love,

Doth work like madness in the brain.

And thus it chanced, as I divine,

With Roland and Sir Leoline.

Each spake words of high disdain

And insult to his heart’s best brother:

They parted- never to meet again!

But never either found another

To free the hollow heart from paining—

They stood aloof, the scars remaining,

Like cliffs which had been rent asunder;

A dreary sea now flows between;

But neither heat, nor frost, nor thunder,

Shall wholly do away, I ween,

The marks of that which once hath been.

(From Christabel)

.

Samuel Taylor Coleridge.

(21 October 1772 – 25 July 1834)

English Poet  

Poem Courtesy:  https://archive.org/details/WithThePoets/page/n196

“తెంచుకున్న స్నేహం… ST కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి”‌కి ఒక స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: