మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు!

నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా,

చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు.

నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం

నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్కాలి.

చెడ్డపేరుకంటే ఏ గుర్తింపూ లేకపోవడం మెరుగు

పుకార్లు మరణానికి దారిచూపిస్తాయి.

నాకు మనుషుల పరిచయాలు ప్రసాదించు, అది కేవలం సంఖ్య మీద

ఆధారపడకుండా, నా స్నేహితులను నే నెంచుకునేట్టుగా ఉండాలి.

నా వ్యాపారం కాకుండా, పుస్తకాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించాలి

అలాగే, రాత్రివేళ మృత్యువంత కలతలేని నిద్ర పట్టాలి

నా నివాసం విశాలమైన భవంతి కాకుండా

చిన్న పూరిగుడిశ అయినా, నా విలాసాలకు కాకుండా

అవసరాలకు తీరేటట్టు ఉండాలి.

నా పూతోట కళాత్మకంగా మనుషులు చేత కాకుండా

ప్రకృతిచేత సహజసిద్ధంగా అలంకరించబడాలి.

అక్కడ లభించే ఆనందం తన

సబైన్ భవంతిలో కూడా దొరకదని హొరేస్ ఈర్ష్యపడాలి.

ఆ విధంగా తరిగిపోతున్న నా జీవిత కాలాన్ని

రెట్టింపు చేసుకోగలను; అలా నిజంగా ఎవరు జీవితాన్ని నడపగలరో

వాళ్ళు జీవితాన్ని రెండురెట్లు అనుభవించగలరు.

ఇటువంటి ఆనంద క్షణాల్ని, వాటిలోని నిజమైన

ఆనందానిభూతినీ ఖరీదులేని ఈ క్రీడలివ్వగలవు.

అపుడు నా భవిష్యత్తుగూర్చి ఆలోచించను, చింతించను.

ప్రతిరోజూ రాత్రి పదుకునేటపుడు ధైర్యంగా అనుకోగలను:

రేపు సూర్యుడు తన కిరణాల్ని ప్రసరిస్తే ప్రసరించనీ,

లేక మబ్బులు వాటిని కమ్మితే కమ్మనీ, ఈ రోజు నేను హాయిగా జీవించేను!

.

అబ్రహామ్ కౌలీ

(1618 – 28 July 1667)

ఇంగ్లీషు కవి

.

The Wish

.

This only grant me, that my means may lay

Too low for envy, for contempt too high.

Some honour I would have

Not from great deeds, but good alone.

The unknown are better than ill known;

Rumour can ope the grave.

Acquaintance I would have, but when’t depends

Not on the number, but the choice of friends:

Books should, not business, entertain the light,

And sleep, as undisturbed as death, the night.

My house a cottage, more

Than place, and should fitting be,

For all my use, not luxury.

My garden painted over

With nature’s hand not art’s; and pleasures yield

Horace might envy in his Sabine  field.   

Thus would I double my life’s fading space,

For he that runs it well, twice runs his race.

And in his true delight,

These unbought sports, this happy state,

I would not fear nor wish my fate,

But boldly say each night,

Tomorrow let my sun his beams display,

Or in clouds hide them; I have lived today.

.

Abraham Cowley 

(1618 – 28 July 1667)

English Poet

Poem Courtesy: https://archive.org/details/WithThePoets/page/n109

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: