మరణం అనివార్యమైతే… క్లాడ్ మెకే, జమైకన్ కవి మరణం అనివార్యమైనపుడు, మనం పందుల్లా చావొద్దు. వాళ్ళు మనల్ని హేళనచేస్తూ, పిచ్చికుక్కల్లా, ఆకలిగొన్న వేటకుక్కల్లా నాల్గుపక్కలా చుట్టుముట్టి ఏ లజ్జాకరమైన చోటుకో, పందులదొడ్లోకో వెంటతరుమినపుడు, శాపగ్రస్తుల్లా మనం చావొద్దు. మరణం అనివార్యం అయినపుడు, మనం చిందించిన పవిత్రరక్తం వృధాపోనివ్వకుండా, ఉదాత్తంగా మరణిద్దాం; అపుడు, మనం మరణించినా, మనం ఎదిరించిన దుర్మార్గులు తప్పనిసరిగా మనల్ని గౌరవించవలసి వస్తుంది. ఓ నా బంధులారా! మనం మన శతృవుని సమిష్ఠిగా ఎదుర్కోవాలి! సంఖ్యాబలంలో సాటి రాకున్నా ధైర్యంలో వాళ్లకి దీటని చూపించాలి, ఎదురుగా మృత్యువు చేతులుచాచి మనకై ఎదురుచూస్తే చూడనీండి, వాళ్ళు కొట్టే వెయ్యిదెబ్బలకు ప్రతిగా మనం ఒక్క చావుదెబ్బ తియ్యాలి! పౌరుషమున్న మనుషులుగా ఆ పిరికిపందల్ని, కిరాతకులని ఎదిరిద్దాం, మరణం అనివార్యమై, ప్రాణాలు పోతున్నా, తిరగబడి పోరాటం సాగిద్దాం. . క్లాడ్ మెకే (September 15, 1889 – May 22, 1948) జమైకన్ కవి . . If We Must Die . If we must die, let it not be like hogs, Hunted and penned in an inglorious spot, While round us bark the mad and hungry dogs, Making their mock at out accursed lot. If we must die, O let us nobly die, So that our precious blood may not be shed In vain; then even the monsters we defy Shall be constrained to honor us though dead! O kinsmen! We must meet the common foe! Though far outnumbered let us show us brave, And for their thousand blows deal one deathblow! What though before us lies the open grave? Like men we’ll face the murderous, cowardly pack, Pressed to the wall, dying, but fighting back! . Claude McKay (September 15, 1889 – May 22, 1948) Jamaican Poet Poem courtesy: https://archive.org/details/blackpoetrysuppl00rand/page/4 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జనవరి 1, 2020
వర్గాలుఅనువాదాలు ట్యాగులు20th CenturyClaude McKayJamaican Poet కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రిసంతృప్తి… రాబర్ట్ గ్రీన్, ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.