మితభాషికి నిర్లక్ష్యం అంటగడతారు… భర్తృహరి, సంస్కృతకవి
మితభాషికి నిర్లక్ష్యాన్నీ,
భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ
నిర్మల మనస్కునికి వంచననీ
వీరునికి క్రూరత్వాన్నీ
లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ
సరససంభాషికి నక్కవినయాలనీ
హుందాగా ఉండేవ్యక్తికి అహంకారాన్నీ,
మంచి వక్తకి వాచాలత్వాన్నీ
విశ్వాసంగా ఉండేవారికి వ్యక్తిత్వలేమినీ
లోకం ఆపాదిస్తూనే ఉంటుంది.
దుర్బుద్ధితో ఆలోచించే వారి
దూషణని తప్పించుకోగల
సుగుణం లోకంలో, అసలు, ఉందా?
.
భర్తృహరి
సంస్కృత కవి
Apathy is Ascribed to the Modest Man
.
Apathy is ascribed to the modest man
Fraud to the devout
Hypocrisy to the pure
Cruelty to the hero
Hostility to the anchorite
Fawning to the courteous man
Arrogance to the majestic
Garrulity to the eloquent
Impotence to the faithful.
Does there exist any virtue
Which escapes
The slander of wicked men?
.
Bhartrihari
(CE 650)
Sanskrit Poet
Tr. Barbara Stoler Miller
https://archive.org/details/worldpoetryantho0000wash/page/220/mode/1up
తనివి … లూ చీ, చీనీ కవి
రచయిత అనుభూతించే ఆనందం పూర్వం ఋషు లనుభవించినదే.
నిరాకారంనుండి ఆకార మావిర్భవిస్తుంది;
నిశ్శబ్దం నుండి కవి పాట పుట్టిస్తాడు.
ఒక గజం పొడవు పట్టుదారంలో అనంతమైన రోదసి దాగి ఉంది;
భాష గుండె మూలలనుండి పెల్లుబికే వరద ప్రవాహం.
ప్రతీకల వలల వలయాలు యథేచ్ఛగా విశాలంగా విరజిమ్మి ఉన్నవి.
ఆలోచనలు మరింతలోతుగా అధ్యయనంచేస్తున్నవి.
లెక్కలేనన్ని పూల, అరవిరిసినమొగ్గల నెత్తావులు కవి వెదజల్లుతున్నాడు
పిల్లగాలులు నవ్వుతూ ఉత్ప్రేక్షిస్తున్నాయి:
వ్రాయు కుంచియల వనభూమినుండి మేఘాలు మింటిదారి నధిరోహిస్తున్నాయి.
.
లూ చీ
(261 -303) CE
చీనీ కవి
From The Art of Writing
Satisfaction
.
The pleasure a writer knows is the pleasure all sages enjoy.
Out of non-being, being is born; out of silence, the writer produces a song.
In a single yard of silk, infinite space is found; language is a deluge from one corner of the heart.
The net of images is cast wider and wider; thoughts search more and more deeply.
The writer spreads the fragrance of new flowers, an abundance of sprouting buds.
Laughing winds lift up the metaphor; clouds rise from a forest of writing brushes.
.
Lu Chi
(261 -303) CE
Tr: Sam Hamill
Poem Courtesy:
https://archive.org/details/worldpoetryantho0000wash/page/228/mode/1up
పదాలపొందిక… లూ చీ, చీనీ కవి
కవి తన ఆలోచనలని
సొగసైన పదాలలోకి ఒడుపుగా ఒదిగిస్తున్నప్పుడు
ప్రకృతిలో కనిపించే అనేకానేక ఆకారాలవలె
సాహిత్యంకూడ అనేక రూపాలు, శైలులు సంతరించుకుంటుంది.
కనుక కనులకింపైన చిత్రంలోని ఐదు రంగుల వలె
ఐదు ధ్వని* స్థాయిలను అంచెలంచెలుగా వాడుకోవాలి.
వాటి రాకపోకలు ఒక నిర్దిష్టక్రమంలో లేకపోయినా
తారస్థాయిని అందుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా
మీకు స్థాయీభేదాల క్రమం, తేడాల మౌలిక లక్షణాలు పట్టుబడితే
పంటకాలువల్లో పరిగెత్తే నదిలా మీ ఆలోచనలూ పరిగెడతాయి.
కానీ, మీరు ఉపయోగించే పదాల గతి తప్పిందా
తలను నడిపించడానికి తోకపట్టుకున్నట్టు అవుతుంది.
నల్లరంగు నేపధ్యంమీద పసుపువేస్తే ఏమవుతుందో, అలా
మీరు వ్రాసిన అంతస్పష్టమైన రచనా బురదమయం అవుతుంది.
.
లూ చీ
(261- 303) CE
చీనీ కవి
Note:
* (వయో, లింగ, మానసిక భేదాలనుబట్టి వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు, సాంస్కృతిక వారసత్వాలు, సందర్భోచితమైన వ్యాఖ్యలు, కవి చూసే కోణంలో కనిపించే దృశ్యాదృశ్యాలు, చివరగా, లౌకికమైన లేదా ఆ సమయానికి అందిన అలంకారాలూ, విశేషణాలూ మొదలైనవి. ) .
The Music of Words
.
Like shifting forms in the world
Literature takes on many shapes and styles
As the poet crafts ideas
Into elegant language.
Let the five tones be used in turn
Like five colours in harmony,
And though they vanish and reappear inconstantly
And though it seems a hard path to climb
If you know the basic laws of order and change
Your thoughts like a river will flow in channels.
But if your words misfire
It’s like grabbing the tail to lead the head:
Clear writing turns to mud
Like painting yellow on base of black.
.
Lu Chi
(261- 303) CE
Chinese Poet and Critic
Note:
Harmony of Colours:
Wherein color harmony is a function (f) of the interaction between color/s (Col 1, 2, 3, …, n) and the factors that influence positive aesthetic response to color: individual differences (ID) such as age, gender, personality and affective state; cultural experiences (CE); contextual effects (CX) which include setting and ambient lighting; intervening perceptual effects (P); and temporal effects (T) in terms of prevailing social trends.
Poem Courtesy:
https://archive.org/details/worldpoetryantho0000wash/page/228/mode/1up
Translation:
Tony Barnstone and Chou Ping
Read the Poetical Theories of Lu Chi (in his Wen Fu) and its comparison with Horace’s Ars Poetica at:
https://www.jstor.org/stable/429384?read-now=1&refreqid=excelsior%3A91a890973da07820152eea79b01c1e3b&seq=1#page_scan_tab_contents
by Sister Mary Gregory Knoerle.
పనలమీద ప్రయాణం … లూ చీ, చీనీ కవి
ఒక్కోసారి మీ రచన రసభరితమైన ఆలోచనల సమాహారమైనప్పటికీ
అవి ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ ఇతివృత్తాన్ని మరుగుపరచవచ్చు.
మీరు శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అధిరోహించగల వేరు చోటు ఉండదు.
మీరు రాసినదాన్ని ఇంకా మెరుగుపరచాలని ప్రయత్నిస్తే అది తరుగుతుంది.
సరియైన సందర్భంలో వాడిన అద్భుతమైన పదబంధం,
రచనపై కొరడాఝళిపించి గుఱ్ఱంలా దౌడుతీయిస్తుంది.
తక్కిన పదాలన్నీ ఉండవలసిన చోట ఉన్నప్పటికీ
పాలుపోసుకున్న చేను రాజనాలకై ఎదురుచూసినట్టు ఎదురుచూస్తాయి.
కొరడా ఎప్పుడైనా చెడుకంటే మంచే ఎక్కువ చేస్తుంది.
ఒకసారి సరిగా దిద్దిన తర్వాత, ఇక దిద్దుబాట్లు చెయ్యవద్దు.
.
లూ చీ
(261 – 303)
చీనీ కవి.
.
The Riding Crop
.
Sometimes your writing is a lush web of fine thoughts
That undercut each other and muffle the theme;
When you reach the pole there’s nowhere else to go,
More becomes less if you try to improve what’s done.
A powerful phrase at the crucial point
Will whip the writing like a horse and make it gallop;
Though all the other words are in place
They wait for the crop to run a good race.
A whip is always more help than harm;
Stop revising when you’ve got it right.
.
Lu Chi
(261 – 303)
Cinese Poet and Critic
Tr. Tony Barnstone and Chou Ping
Poem courtesy:
https://archive.org/details/worldpoetryantho0000wash/page/229/mode/1up
An Anthology of Verse From Antiquity to Our Time
Katharine Washburn and John S Major, Editors; Clifton Fadiman (General Editor)
Published by W. W. Norton & Company ISBN 0-393-04130-1
Part III: Post Classical World
2. China: The Three Kingdoms Period Through the T’ang Dynasty; Korea: Early Poetry in the Chinese Style.
ఉదాత్త స్వభావము… బెన్ జాన్సన్ , ఇంగ్లీషు కవి
చెట్టులా ఏపుగా బలంగా పెరగడం
మనిషిని మెరుగైనవాడిగా చెయ్యదు;
ఓక్ చెట్టులా మూడు వందల ఏళ్ళు బ్రతికినా అంతే.
చివరకి ఎండి, నిస్సారమై, బోడి మానై, రాలి ముక్కలవాల్సిందే.
లిల్లీపువ్వు జీవితం ఒకరోజే
వేసవిలో బహుసుందరంగా ఉంటుంది.
పగలుపూచినది రాత్రికి వాడి, రాలిపోవచ్చు. ఐతేనేం,
మన రోజంతటినీ దేదీప్యమానం చేసే పువ్వు అది.
మనం సౌందర్యాన్ని చిన్నచిన్న మోతాదుల్లోనే చూస్తాం.
చిన్న చిన్న ప్రమాణాల్లోనే జీవితం పరిపూర్ణమై ఉంటుంది.
.
బెన్ జాన్సన్
(11 June 1572 – 6 August 1637)
ఇంగ్లీషు కవి.
.
Ben Johnson
.
The Noble Nature
.
It is not growing like a tree
In bulk, doth make man better be;
Or standing long an oak three hundred year,
To fall a log at last, dry, bald, and sere;
A lily of a day
Is fairer far in May,
Although it fall and die that night-
It was the plant and flower of Light.
In small poportions we just beauty see;
And in short measures life may perfect be.
.
Ben Johnson
English poet
Poem Courtesy:
https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n362
విధి ఒక దయలేని కుమ్మరి… భర్తృహరి, సంస్కృత కవి
నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన విషయం భర్తృహరిని (ఇంకా, అమర సింహుడు మొదలుగా సంస్కృత కవుల్ని, చాలమంది చీనీ కవుల్ని) ఇంగ్లీషులోకి ఎంతో అందంగా అనువాదం చెయ్యడం.
.
విధి ఒక నిపుణుడైన,
దయలేని కుమ్మరి.
మిత్రమా! ఆరాటాల సారెను
బలంగా తిప్పి వదలి
దురదృష్టమనే పనిముట్టు
అందుకుంటుంది ఆకారాన్ని దిద్దడానికి.
నా హృదయమనే రేగడిమట్టిని
ఇపుడది పిసికి మర్దించి సాగదీసి
తన సారెమీద ఉంచి
గట్టిగా ఒక తిప్పు తిప్పింది.
న న్నేవిధి మలచ సంకల్పించిందో
నేను చెప్పలేను.
.
భర్తృహరి
సంస్కృత కవి
5వ శతాబ్దం
.
Fate is a cruel and Proficient Potter
.
Fate is cruel
And proficient potter,
My friend! Forcibly
Spinning the wheel
Of anxiety, he lifts misfortune
Like a cutting tool. Now,
Having kneaded my heart
Like a lump of clay,
He lays it on his
Wheel and gives a spin.
What he intends to produce
I cannot tell.
.
Bhartrihari
Sanskrit Poet
Tr. Andrew Schelling
https://archive.org/details/worldpoetryantho0000wash/page/222/mode/1up
An Anthology of Verse From Antiquity to Our Time
Katharine Washburn and John S Major, Editors; Clifton Fadiman (General Editor)
Published by W. W. Norton & Company ISBN 0-393-04130-1
Part III: Post Classical World
1. India: The Golden Age of Court Poetry