బహిష్కృతుడు… క్లాడ్ మెకే, జమైకన్ కవి
మా తాతముత్తాతలు పుట్టిన … చీకటి, అనామకపు ప్రదేశాలకి
ఎలాగైనా వెళ్ళాలని తనువులోఇరుక్కున్న నా ఆత్మ ఉవ్విళ్ళూరుతోంది.
పెదాలు పేనుతున్న మాటల్ని, ఎప్పుడూ వినకున్నా, అనుభూతిస్తున్నాను.
నా మనసు ఎన్నడో మరిచిపోయిన అడవి పాటలు పాడుతోంది.
నేను మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళకపోతే నాకు ప్రశాంతత లేదు,
కానీ, ఈ పడమటి దేశాలు నాకో వెల నిర్ణయించాయి,
పరిచయంలేని వాళ్ల దేవుళ్ళకు నేను మొక్కినా
నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశ లేదు.
“నా”దన్నదాన్ని దేన్నో నేను కోల్పోయాను, పూర్తిగా
నా గుండెలోనుండి అతి ముఖ్యమైనదేదో జారిపోయింది.
ఇక నేను నా బ్రతుకుని, ఈ నేలదొరల నడుమ,
వారికి ఎడంగా, జీవచ్ఛవంలా ఈడవవలసిందే.
ఎందుకంటే, నా సహజ వాతావరణానికి దూరమై, తెల్లవాడి
అజమాయిషీలకు లోబడి, పుట్టకూడని యుగంలో పుట్టాను.
.
క్లాడ్ మెకే
(September 15, 1889 – May 22, 1948)
జమైకన్ కవి.
.
Outcast
.
For the dim regions whence my fathers came
My spirit, bondaged by the body, longs.
Words felt, but never heard, my lips would frame;
My soul would sing forgotten jungle songs.
I would go back to darkness and no peace,
But the great western world holds me in fee,
And I may never hope for full release
While to its alien gods I bend my knee.
Something in me is lost, forever lost,
Some vital thing has gone out of my heart,
And I must walk the way of life a ghost
Among the sons of earth, a thing apart.
For I was born, far from my native clime,
Under the white man’s menace, out of time.
.
Claude Mckay
(September 15, 1889 – May 22, 1948)
Jamaican Writer and Poet
Poem Courtesy: Black Poetry – A supplement to Anthologies which exclude Black Poets Edited by Dudley Randall, Broadside Press, 12651 Old Mill Place, Detroit, Michigan 48238
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి