అనువాదలహరి

రాత్రి తలెత్తే ప్రశ్నలు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

అసలు

ఈ ఆకాశం ఎందుకు?

నెత్తిమీద ఉరుములు ఎవరు రేపెడతారు?

ఆ ఫెళఫెళమనే శబ్దం ఎవరు చేస్తారు?

దేవతలు నిద్రలో పక్కమిదనుండి క్రిందకి దొర్లిపోతారా?

వాళ్ళ ఆటబొమ్మలన్నిటినీ పగలగొడుతున్నారా?

సూర్యుడు ఎందుకు అంత త్వరగా క్రిందకి దిగిపోతాడు?

రాత్రిపూట మేఘాలెందుకు ఆకలితో

అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణీ,

చంద్రుడిచుట్టూ ఉన్న గుడినీ మింగడానికి

అన్నట్టుగా నెమ్మదిగా పాకురుతుంటాయి?

అందరూ చెప్పుకుంటున్నట్టు

చుక్కలమధ్య ఎలుగుబంటి ఉంటుందా?

అలాగైతే, అది పచ్చికబయళ్ళ కడ్డంగా కట్టిన

దళ్ళు దూకి పాలపుంతని తాగెయ్యదా?

రాలిన ప్రతి నక్షత్రమూ

మిణుగురుపురుగుగా మారుతుందా?

మళ్ళీ తిరిగి అది ఎన్నడూ స్వర్గం చేరుకోదా?

అసలు ఇంతకీ

ఈ ఆకాశం ఎందుకున్నట్టు?

.

లూయీ అంటర్ మేయర్

అమెరికను కవి

(October 1, 1885 – December 18, 1977)

.

.

Questions at Night

.

Why

Is the sky?

What starts the thunder overhead?

Who makes the crashing noise?

Are the angels falling out of bed?

Are they breaking all their toys?

Why does the sun go down so soon?

Why do the night-clouds crawl

Hungrily up to the new-laid moon

And swallow it, shell and all?

If there’s a Bear among the stars,

As all the people say,

Won’t he jump over those Pasture-bars

And drink up the Milky Way?

Does every star that happens to fall

Turn into a fire-fly?

Can’t it ever get back to Heaven at all?

And why

Is the sky?

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/questions-at-night/

బహిష్కృతుడు… క్లాడ్ మెకే, జమైకన్ కవి

మా తాతముత్తాతలు పుట్టిన … చీకటి,  అనామకపు ప్రదేశాలకి

ఎలాగైనా వెళ్ళాలని తనువులోఇరుక్కున్న నా ఆత్మ ఉవ్విళ్ళూరుతోంది.

పెదాలు పేనుతున్న మాటల్ని, ఎప్పుడూ వినకున్నా, అనుభూతిస్తున్నాను.

నా మనసు ఎన్నడో మరిచిపోయిన అడవి పాటలు పాడుతోంది.

నేను మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళకపోతే నాకు ప్రశాంతత లేదు,

కానీ, ఈ పడమటి దేశాలు నాకో వెల నిర్ణయించాయి,

పరిచయంలేని వాళ్ల దేవుళ్ళకు నేను మొక్కినా

నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశ లేదు.

“నా”దన్నదాన్ని దేన్నో నేను కోల్పోయాను, పూర్తిగా

నా గుండెలోనుండి అతి ముఖ్యమైనదేదో జారిపోయింది.

ఇక నేను నా బ్రతుకుని, ఈ నేలదొరల నడుమ,

వారికి ఎడంగా, జీవచ్ఛవంలా ఈడవవలసిందే.

ఎందుకంటే, నా సహజ వాతావరణానికి దూరమై, తెల్లవాడి

అజమాయిషీలకు లోబడి, పుట్టకూడని యుగంలో పుట్టాను.

.

క్లాడ్ మెకే

(September 15, 1889 – May 22, 1948) 

జమైకన్ కవి.

.

Outcast

.

For the dim regions whence my fathers came

My spirit, bondaged by the body, longs.

Words felt, but never heard, my lips would frame;

My soul would sing forgotten jungle songs.

I would go back to darkness and no peace,

But the great western world holds me in fee,

And I may never hope for full release

While to its alien gods I bend my knee.

Something in me is lost, forever lost,

Some vital thing has gone out of my heart,

And I must walk the way of life a ghost

Among the sons of earth, a thing apart.

For I was born, far from my native clime,

Under the white man’s menace, out of time.

.

Claude Mckay

(September 15, 1889 – May 22, 1948)

Jamaican Writer and Poet

Poem Courtesy: Black Poetry – A supplement to Anthologies which exclude Black Poets Edited by   Dudley Randall, Broadside Press, 12651 Old Mill Place, Detroit, Michigan 48238  

https://archive.org/details/blackpoetrysuppl00rand/page/4

%d bloggers like this: