రాజ సంతతికి అనూచానంగా వస్తున్న వారసత్వం:
తొలి రాజవీరుల పిల్లలూ, వాళ్ళ పిల్లల పిల్లలూ
ఘనకార్యాలు సాధించడం ద్వారానూ, గొప్పవస్తువులు
నిర్మించడం ద్వారానూ వాళ్ళ కలలను నిజం చేసారు.
పోరాటాలు ఏసిన ఆ చేతులు, పురాతన విషాదాంత
నాటకాలలో చిరస్థాయిగా నిలిచిన గుండెకోతలు
సూర్యచంద్రులున్నంతకాలం కొనసాగిస్తూనే ఉన్నాయి
వాళ్ళ వారసుల తలలు అధికారానికి తలవంచవు.
వాళ్ల చేతులు ఇప్పటికీ, వాళ్ళ తాతముత్తాతల
అస్థికలను దాచిన ఈ మట్టిని పరిరక్షిస్తూనే ఉన్నాయి.
తమ ప్రజల భవిషత్తు కోసం వాళ్ళ ధర్మాగ్రహం
అగ్నిపర్వతంలా ఎప్పుడూ లోలోపల రగులుతూనే ఉంది.
ఆ వైరిఖడ్గమూ వాళ్ళ కన్నీళ్ళనూ,
రక్తాన్నీ బహుమానంగా గెలుచుకో లేదు.
ప్రశాంతజీవితాకాంక్షతో సిగ్గువిడిచి
ఈ వారసత్వాన్ని ఎవరూ వదులుకోరు.
.
జోసెఫ్ మేరీ ప్లంకెట్
21 November 1887 – 4 May 1916
ఐరిష్ జాతీయవాద కవి
కుతూహలం రేకెత్తించే ఇతని జీవిత విశేషాలు ఇక్కడ.
.
.
Our Heritage
.
This heritage to the race of kings:
Their children and their children’s seed,
Have wrought their prophecies in deed
Of terrible and splendid things.
The hands that fought, the hearts that broke
In old immortal tragedies,
These have not failed beneath the skies:
Their children’s heads refuse the yoke.
And still their hands shall guard the sod
That holds their fathers’ funeral urn;
Still shall their hearts volcanic burn
With anger of the sons of God.
No alien sword shall earn as wage
The entail of their blood and tears.
No shameful price for peaceful years
Shall ever part this heritage.
.
Joseph Mary Plunkett.
21 November 1887 – 4 May 1916
Irish Nationalist Poet
Poem Courtesy: https://archive.org/details/poetry01assogoog/page/n294
స్పందించండి