మట్టిలోకి ఒక బీజం నాటబడుతుంది
గుండెల్నిపిండుతూ అంతరాల్లోంచి ఒకపాట బయటకొస్తుంది
ముత్యపుచిప్పలోంచి ఒక ముత్యం బయట పడుతుంది
పంజరంనుండి ఒక పక్షి బయటకు ఎగిరిపోతుంది,
శరీరంనుండి, ఒక ఆత్మకూడా!
విత్తనం మహావృక్షంగా ఎదుగుతుంది
విశాలవిశ్వమంతా ఆ పాటని పాడుకుంటుంది
కంఠహారంలో ఆ ముత్యం మరింత అందంగా మెరుస్తుంది
పక్షి మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలోకి ఎగసిపోతుంది
మృత్యువు ఒక సగం, జీవితం మరొక సగం,
ఆ రెండూ కలిసి పూర్ణత్వాన్ని కలిగిస్తాయి.
.
జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్
(September 28, 1867–January 26, 1896)
అమెరికను కవి.

స్పందించండి