పిచ్చి ఆశ … అడా ఐజాక్స్ మెన్కెన్, అమెరికను కవయిత్రి

ఓ పిచ్చి, తెలివితక్కువ మనసా! నీ జీవితాశయాలనన్నిటినీ

దూరంగా, మసక మసక మొయిలు సింహాసనము మీద పెట్టుకుని,

ప్రేక్షకుల చప్పట్లకోసం, తెలిపొద్దు పొగమంచుతో

దారాలు పేనుకుంటూ పైకి లాగుతున్నావు కానీ,

జాగ్రత్త! ఆ దారి పొడవునా ఎదురయ్యేది ప్రేతవస్త్రాలే;

ఎంత ధైర్యవంతుడైనా, వాటిని దాటాలనుకుంటే మాత్రం

దారి మధ్యలో మృత్యువునో, హిమపాతాన్నో ఎదుర్కోవడం తధ్యం.

ఓ పిచ్చి మనసా! ఏళ్ళు గతించిపోతున్నా

నీ పారవశ్యపు దృక్కులు ఇంకా ఆ ఒక్క తారకమీదే.

దాని వెచ్చని కాంతి పుంజాలు ఇక్కడిలానే ఉన్నాయి,

దేవదూతలు నడచివచ్చే ఆ దారి ఇంకా మిణుకుమంటూనే ఉంది,

నువ్వు ఊహిస్తున్న ఆ కిరీటం అందనంత దూరాల్లోనే ఉంది…

జాగ్రత్త సుమా! నువ్వొక నిప్పుకణానివి. కనుక ఈ అనంతవిశ్వంలో

నీ స్వీయ ప్రతిబింబాన్నే చూసుకుంటున్నావేమో ఆలోచించు.

.

అడా ఐజాక్స్ మెన్కెన్,

(June 15, 1835 – August 10, 1868)

అమెరికను కవయిత్రి

.

Aspiration

.

Poor, impious Soul! That fixes its high hopes

In the dim distance, on the throne of clouds,

And from the morning’s mist would make the ropes

To draw it up amid acclaim of crowds—

Beware! That soaring path is lined with shrouds;

And he who braves it, though of sturdy breath,

May meet, half way, the avalanche and death!

O poor young Soul! – whose year-devouring glance

Fixes in ecstasy upon a star,

Whose feverish brilliance looks a part of earth,

Yet quivers where the feet of angels are,

And seems the future crown in realms afar—

Beware! A spark thou art, and dost but see

Thine own reflection in Eternity!

.

Adah Isaacs Menken

(June 15, 1835 – August 10, 1868)

American Writer, actress, and Painter

Read the interesting bio of the poet here:

Poem Courtesy:

https://archive.org/details/africanamericanp00joan/page/183

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: