మెట్లమీది గడియారం… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

ఆ పల్లె వీధికి చివరన కొద్దిదూరంలో

ఎప్పటిదో తాతలనాటి భవంతి ఉండేది

దాని పాడుబడ్ద ముందు పెరడులో

పొడుగాటి పోప్లార్ చెట్లు నీడలు పరుస్తుండేవి

చావడి మధ్యలో, తనున్నచోటునుండి

పాత గోడగడియారం అందరికీ హెచ్చరిస్తుండేది:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

మెట్లకి సగం ఎత్తులో ఉండేదది

గట్టి ఓకుచెట్టు కవచంలోంచి

చేతులు చాచి పిలుస్తున్నట్టుండేది

తన ఆచ్ఛాదనలోంచి బిక్షువు

ఛాతీపై శిలువ విక్షేపించి నిట్టూర్చినట్టు!

రుద్ధకంఠంతో దారిపోయేవారందరితో చెప్పేది:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

పగటిపూట దాని గొంతు మంద్రంగా, తేలికగా ఉండేది

కాని అంతా ప్రశాంతంగా ఉండే అర్థరాత్రివేళ,

నడుస్తున్న అడుగులు వినిపించినంత స్పష్టంగా

ఆ ఖాళీ వసారాలోంచి, ఇంటి చూరులోంచి

నేల నలుమూలలనుండి మారుమోగుతుండేది

అక్కడి ప్రతి గది తలుపుకి చెబుతున్నట్టు-

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

రోజులు విచారంతో, వేడుకలతో నిండినా

పురుళ్ళూ, మరణాలతో గడిచినా

క్షణంలో మారే సుఖదుఃఖాల పరిణామాలకి

కాలం మారినా, అది మారకుండా నిలబడేది

అ దేదో దేముడైనట్టూ, అన్ని చూసినట్టు

చిత్రమైన ఆ మాటల్నే మళ్ళీ మళ్ళీ

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అంటూ

ఒకప్పుడు ఆ భవంతిలో వచ్చినవారెవరైనా

అరమరికలులేని ఆతిథ్యం అందుతూ ఉండేది

వంటింట్లో ఎప్పుడూ నిప్పునార్పడం ఉండేదికాదు

అతిథులు యజమాని సహపంక్తిని భుజించేవారు

కానీ, అంత ఆనందంలోనూ అపస్వరంలా

గడియారం మాత్రం తన హెచ్చరిక విడిచేది కాదు:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అంటూ

ఎందరో పిల్లలక్కడ ఆనందంతో ఆడేవారు

యువతీయువకులు మధురమైన కలల్లో తూగేవారు

ఏమి అద్భుతమైన రోజులవి! ఎంత వైభవం

భోగభాగ్యాలతో ప్రేమతో గడచిన కాలమది!

లోభి తన బంగారు నాణేలు ఒక్కొక్కటీ లెక్కెట్టినట్టు

ఆ రోజులన్నీ ఆ పాతగడియారం నెమరువేసుకుంటోంది

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అంటూ

ఆ గదినుండే, స్వచ్ఛమైన తెల్లని ముసుగులో

పెళ్ళినాటి రాత్రి పెళ్ళికూతురు బయలు వెడలింది;

అక్కడే, ఆ మేడక్రింది గదిలోనే, చల్లగా

మంచుపొరలమధ్య మృతుడు దీర్ఘనిద్రతీస్తున్నది

ప్రార్థనానంతరం అంతటా నిండిన నిశ్శబ్దంలో

మెట్లదగ్గరి గోడగడియారం అంటున్నట్టనిపించింది:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

అందరూ చెల్లాచెదరై నలుదిక్కులా ఎగిరిపోయారు

కొందరికి పెళ్ళిళ్ళైపోయాయి, కొందరు గతించారు,

“మళ్ళీ వాళ్ళందరూ ఎప్పుడు తిరిగి కలుస్తారు?” అని

దిగమింగుకుంటున్న బాధతో నే ప్రశ్నిస్తే

ఎప్పుడో, గడచిపోయిన రోజుల్లో చెప్పినట్తుగానే

ఆ పాత గోడగడియారం సమాధానం చెబుతోంది:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

ఇక్కడ ఆశాశ్వతం, అక్కడే శాశ్వతం,

అక్కడ వియోగాలూ, బాధలూ, సంరక్షణలూ,

మృత్యువూ, అసలు కాలమన్న ఊసే ఉండదక్కడ.

అక్కడే శాశ్వతం, ఇక్కడ క్షణికం!

కాలాతీతమైన ఆ గడియారం

నిరంతరం చెబుతూనే ఉంది:

“శాశ్వతత్వం… క్షణికం!

క్షణికమే… శాశ్వతం!” అని.

.

H W లాంగ్ ఫెలో

(27th Feb 1807 –  24th March 1882)

అమెరికను కవి.

H W Longfellow

.

The Old Clock on the Stairs

.

Somewhat back from the village street

Stands the old-fashioned country-seat.

Across its antique portico

Tall poplar-trees their shadows throw;

And from its station in the hall

An ancient timepiece says to all, —

      “Forever — never!

      Never — forever!”

Half-way up the stairs it stands,

And points and beckons with its hands

From its case of massive oak,

Like a monk, who, under his cloak,

Crosses himself, and sighs, alas!

With sorrowful voice to all who pass, —

      “Forever — never!

      Never — forever!”

By day its voice is low and light;

But in the silent dead of night,

Distinct as a passing footstep’s fall,

It echoes along the vacant hall,

Along the ceiling, along the floor,

And seems to say, at each chamber-door, —

      “Forever — never!

      Never — forever!”

Through days of sorrow and of mirth,

Through days of death and days of birth,

Through every swift vicissitude

Of changeful time, unchanged it has stood,

And as if, like God, it all things saw,

It calmly repeats those words of awe, —

      “Forever — never!

      Never — forever!”

In that mansion used to be

Free-hearted Hospitality;

His great fires up the chimney roared;

The stranger feasted at his board;

But, like the skeleton at the feast,

That warning timepiece never ceased, —

      “Forever — never!

      Never — forever!”

There groups of merry children played,

There youths and maidens dreaming strayed;

O precious hours! O golden prime,

And affluence of love and time!

Even as a miser counts his gold,

Those hours the ancient timepiece told, —

      “Forever — never!

      Never — forever!”

From that chamber, clothed in white,

The bride came forth on her wedding night;

There, in that silent room below,

The dead lay in his shroud of snow;

And in the hush that followed the prayer,

Was heard the old clock on the stair, —

      “Forever — never!

      Never — forever!”

All are scattered now and fled,

Some are married, some are dead;

And when I ask, with throbs of pain,

“Ah! when shall they all meet again?”

As in the days long since gone by,

The ancient timepiece makes reply, —

      “Forever — never!

      Never — forever!”

Never here, forever there,

Where all parting, pain, and care,

And death, and time shall disappear, —

Forever there, but never here!

The horologe of Eternity

Sayeth this incessantly, —

      “Forever — never!

      Never — forever!”

.

H W Longfellow

(27th Feb 1807 –  24th March 1882)

American Poet

Poem Courtesy:

https://www.poetryfoundation.org/poems/44643/the-old-clock-on-the-stairs

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: