నాకు స్వేచ్ఛ వస్తుంది!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను కవి
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను.
లోకం నన్ను చూసి నవ్వితే నా కేమిటి లక్ష్యం?
దాని నవ్వులూ, ఈసడింపులూ అన్నీ ఒకటే నాకు ఇపుడు,
డబ్బున్నదన్న దాని అహంకారాన్ని కాలితో నలిపి పారెస్తా,
కిరీటాలూ, వాటిని ధరించే శిరస్సులూ రెంటికీ విలువివ్వను.
అబ్బ! మానవాళి ఎలా వాటిని భరించగలుగుతోంది?
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను.
నాకు స్వాతంత్య్రమేమిటని లోకం నవ్వినా, ఇక నేను స్వేచ్ఛాజీవిని.
దాని వెకిలినవ్వుల్ని చూసి నవ్వుకుంటా, దాని అధికారాన్ని తిరస్కరిస్తా,
దాని శృంఖలాలకి నా మనసుని ఎన్నడూ తలవంచుకునేలా చెయ్యను;
ఎవరికి యజమాని అవసరం ఉందో వాళ్లని భరిస్తే భరించమను,
నా మనసు ఇక ఎంతమాత్రం వాళ్ళని భరించలేదు.
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను.
నిజం ఒక్కటే ఇపుడు నాకు ముందుండి నన్ను నడిపేది,
ఎక్కడికి తీసుకుపోతే, అక్కడికి ఆమె అడుగుజాడల్లో
ఆనందంగా నా కాళ్ళు అడుగులేసుకుని పోతాయి.
ఆకలితో అలమటిస్తున్న మనసుకి ఆమె చెప్పిందే ప్రాణం,
ఆకలితో, దాహంతో విలవిలలాడే నా ఈ మనసుకి.
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను.
నా త్రోవ ఎంత వేడిగా కాళ్లు పొక్కులెక్కిపోనిచ్చేదైనా;
నేను ఎంతో ఆనందంతో ఆ శిలువని మోయడమే కాదు,
నేను ఎంచుకున్న నాయకుల్ని చెయ్యవేసే సాహసం చెయ్యమంటాను;
ఆ శిలువ నాకు ఇపుడు గాలికంటే తేలికైపోతుంది,
ఎందుకంటే, ఇపుడు సత్యం నా మార్గదర్శీ, చేదోడూను!
.
ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్
(11th May 1826- 9th Jan 1884)
ఆఫ్రికను- అమెరికను కవి
.
I Would Be Free
.
I would be free! I will be free!
What though the world laugh at me?
To me alike are its smiles and its frowns,
I trample in scorn on its riches; and crowns
Are worthless to me as the heads which wear them.
O! How can humanity bear them?
I would be free! I will be free!
Free, though the world laugh at me!
I smile at its jeers and spurn its control,
And ne’er to its fetters shall bend my soul;
Let those who have need of a master wear them,
But never can my spirit bear them.
I would be free! I will be free!
And Truth shall my leader be!
Yea, whither she leads shall my willing feet
Joyfully tread in her footprints; and sweet
Shall her lessons be to my hungering soul!
To my thirsting and hungering soul.
I would be free! I will be free!
Though scorching my pathway be;
I can cheerfully bear the cross, and dare
The lot of my chosen leader to share;
And the cross shall be lighter than air to me,
For Truth shall my guide and helper be!
.
Alfred Gibbs Campbell
(11th May 1826 – 9th Jan 1884)
African-American
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి