అవిశ్వాసి అని ముద్ర వేయండి!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను మీరు నేర్చిన, నమ్మిన సిద్ధాంతాలను వినడానికీ, నమ్మడానికీ ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఎదురైతే అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! మీరు కట్టిన దైవమందిరాల్లో పూజచెయ్యడానికి నిరాకరించినా, మీ మీ పుణ్యదినాల్లో జరిపే విందులకి హాజరుకాకపోయినా, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. పాపుల్నీ, పేదల్నీ, బాధితులనీ, చూసినపుడు అతని మనసు కరుణతో పొంగిపొరలవచ్చు గాక, అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! చిరకాలంనుండీ జరుగుతున్న మంచికీ చెడ్డకీ మధ్య యుద్ధంలో అతను ఎప్పుడూ మంచి పక్షాన్నే నిలబడితే నిలబడుగాక, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. అతను కనిపించిన ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడిని చూస్తున్నానంటే ఎవడికి కావాలి ఎంతమాత్రం వదలొద్దు, “అవిశ్వాసి ” అని ముద్రవెయ్యండి. అతను ప్రతివ్యక్తినీ అతనుచేసే భయంకరమైన తప్పుడు పనులనుండి, పాపాలనుండి మరలించడానికి ప్రయత్నించినా సరే, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. అతనికి మీ కన్నా భిన్నంగా ఆలోచించే హక్కు ఎక్కడిది? ఏది నిజమో ఏది అబద్ధమో నిర్ణయించే హక్కు ఎక్కడిది? అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. మిమ్మల్ని ఎందుకు సువార్తబోధించడానికి నియమించేరు? మీరు బోధించే నిబంధనలని ప్రశ్నిస్తే ఎలా? “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. వెలుతురుచూపించే మార్గపు తాళాలు మీదగ్గరే ఉన్నాయనీ, మీరు మాత్రమే ఒప్పు అని అతను ఒప్పుకునేట్టు చెయ్యండి, అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. అతను మీరు వేసే సంకెళ్ళు వేయించుకుందికి అంగీకరించేదాకా, అతని వివేకాన్నీ, ఆత్మనీ విడిచిపెట్టేదాకా, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. . ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్. (11th May 1826- 9th Jan 1884) అమెరికను కవి . I am sorry I could not provide the photo of the Poet. . Cry “Infidel” . If you find a man who does not receive The doctrines you have been taught to believe, Spare him not! Cry “Infidel!” If he worships not at the shrines you raise, Joins not in your feasts on your holy days, Cry “Infidel!” What though his heart with love overflow To the victims sin and want and woe, Spare him not! Cry “Infidel!” What though, in the long-waged fearful fight, He is ever found on the side of the Right, Cry “Infidel!” What though in each fellow-man he see An image of Him of Calvary, Spare him not! Cry “Infidel!” What though he endeavour each soul to win From the fearful paths of folly and sin, Cry “Infidel!” What right has he to think other than you? To judge for himself what is false or true? Spare him not! Cry “Infidel!” Wherefore have you been commissioned to preach, If any may question the dogmas you teach? Cry “Infidel!” Make him acknowledge you only are right, That you hold the keys of the portals of light; Spare him not! Cry “Infidel!” Until he consent your fetters to wear, And conscience and reason both forswear, Cry “Infidel!” . Alfred Gibbs Campbell (11th May 1826- 9th Jan 1884)* *Courtesy: https://www.findagrave.com/memorial/37797560/alfred-gibbs-campbell African -American Poet Read the interesting bio of the poet https://archive.org/details/africanamericanp00joan/page/102 Poem Courtesy: https://archive.org/details/africanamericanp00joan/page/111 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 2, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు19th CenturyAfrican-AmericanAlfred Gibbs Campbell నన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవినాకు స్వేచ్ఛ వస్తుంది!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.