రోజు: డిసెంబర్ 2, 2019
-
అవిశ్వాసి అని ముద్ర వేయండి!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను
మీరు నేర్చిన, నమ్మిన సిద్ధాంతాలను వినడానికీ, నమ్మడానికీ ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఎదురైతే అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! మీరు కట్టిన దైవమందిరాల్లో పూజచెయ్యడానికి నిరాకరించినా, మీ మీ పుణ్యదినాల్లో జరిపే విందులకి హాజరుకాకపోయినా, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి. పాపుల్నీ, పేదల్నీ, బాధితులనీ, చూసినపుడు అతని మనసు కరుణతో పొంగిపొరలవచ్చు గాక, అతన్ని విడిచిపెట్టవద్దు, “అవిశ్వాసి” అని ముద్రవెయ్యండి! చిరకాలంనుండీ జరుగుతున్న మంచికీ చెడ్డకీ మధ్య యుద్ధంలో అతను ఎప్పుడూ మంచి పక్షాన్నే నిలబడితే నిలబడుగాక,…