నన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవి

నన్ను చావనీయండి, మృత్యువుకి భయపడానికి బదులు,

నా కథ ముగిసినందుకు ఆనంద పడనీయండి,

నా చివరి ఊపిరి నన్ను విడిచిపోగానే

ప్రాభాత వసంత వేళ కూసే కోకిలలా

పాడుతూ నిష్క్రమించనీయండి.

మృత్యువంటే ఏ భయం లేకుండా పోనివ్వండి,

నన్నిక ఏ యమశిక్షలూ భయపెట్టలేవు,

నా తలక్రింద విశ్వాసపు దిండుతో,

శిధిలమయే శరీరం పట్ల తిరస్కారంతో

నన్ను హాయిగా ఆలపిస్తూ వెళ్ళిపోనీయండి.

నా శౌర్య పతకాలను ప్రదర్శిస్తూ

నన్నొక వీరపుత్రుడిలా మరణించనీయండి;

సమాధి అన్న ఆలోచనకే భయపడడమా?

ఎన్నటికీ లేదు, మట్టిలోకైనా చిరునవ్వుతో

పాడుతూ నిష్క్రమించనీయండి.

నేను ఎన్ని కష్టాలు అనుభవించినా ఆనందంగా పోనీయండి,

ఈ ప్రపంచంపట్ల నాకు ఏ ఆరోపణలూ లేవు,

ఈ చర్మపంజరం పట్ల అసహ్యంతో

ఆత్మ దాని చెరనుండి తప్పించుకుని

పాడుతూ నిష్క్రమిస్తుంది.

మృత్యువు తన ముసుగుతో ఆఖరిప్రాణాన్నికూడా కప్పేటపుడు

బద్ధశత్రువునికూడా క్షమిస్తున్నా, నన్ను చావనీయండి,

నాకు మిగిలింది ఇక ఒక్క క్షణమే గనుక,

నా ఆఖరి ఋణంకూడా తీర్చుకున్న పిదప,

హాయిగా పాడుకుంటూ నిష్క్రమించనీయండి.

.

జార్జ్ మోజెస్ హార్టన్,

(1798–1884)

అమెరికను కవి

 

.

Imploring to Be Resigned to Death

.

Let me die and not tremble at death,

But smile at the close of my day,

And then at the flight of my breath,

Like a bird of the morning in May,

Go chanting away.

Let me die without fear of dead,

No horrors my soul shall dismay,

And with faith’s pillow under my head,

With defiance to mortal decay,

Go chanting away.

Let me die like the son of the brave,

And martial distinction display;

Nor shrink from a thought of the grave,

No, but with smile from the clay,

Go chanting away.

Let me die glad, regardless of pain,

No pang to this world betray,

And the spirit cut loose from its chains,

So loath in the flesh to delay,

Go chanting away.

Let me die, and my worst foe forgive,

When death veils the last vital ray;

Since I have but a moment to live,

Let me, when the last debt I pay,

Go chanting away.

.

(1865)

George Moses Horton

(1798–1884)

African-American Slave Poet

Read an excellent intro about the poet here

 

Poem Courtesy:

https://archive.org/details/africanamericanp00joan/page/36

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: