అనువాదలహరి

కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

I WISH

ALL MY FRIENDS

A VERY HAPPY AND PROSPEROUS

NEW YEAR 2020

MAY THIS YEAR

USHER IN

NEW FRIENDSHIPS,

SOOTHE OLD PAINS,

FULFILL YOUR DREAMS

AND

INSPIRE YOU TO ASPIRE FOR MORE.

ఇప్పటికే వేలసార్లు చెప్పి, చెప్పకుండా మిగిలినదేముందని

నూతన సంవత్సరంలో కొత్తగా కవితలో చెప్పడానికి?

కొత్త సంవత్సరాలు వస్తూంటాయి, పాతవి వెళుతూంటాయి,

మనం కలగంటామని తెలుసు, అయినా ఎన్నో కలలు కంటాం.

మనం వేకువతో నవ్వుతూ నిదుర మేల్కొంటాం,

చీకటితోపాటే శోకిస్తూ … నిద్రకుపక్రమిస్తాం.

మనల్ని కాటువేసేదాకా, లోకాన్ని హత్తుకుంటాం, 

అప్పుడు శపిస్తాం, ఎగిరిపోడానికి రెక్కలులేవే అని నిట్టూరుస్తాం.

మనం జీవిస్తూ, ప్రేమిస్తాం, కామిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం,

పెళ్ళికూతుళ్ళను సింగారిస్తాం, మృతులను దుప్పటిలో చుడతాం.

మనం నవ్వుతాం, ఏడుస్తాం, ఎన్నో ఆశిస్తాం, ఎన్నిటికో భయపడతాం,

ఆ మాటకొస్తే, ఏ సంవత్సరానికైనా పల్లవి అదే!

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919) 

అమెరికను కవయిత్రి

.

The Year

.

What can be said in New Year rhymes,

That’s not been said a thousand times?

The new years come, the old years go,

We know we dream, we dream we know.

We rise up laughing with the light,

We lie down weeping with the night.

We hug the world until it stings,

We curse it then and sigh for wings.

We live, we love, we woo, we wed,

We wreathe our brides, we sheet our dead.

We laugh, we weep, we hope, we fear,

And that’s the burden of the year.

.

Ella Wheeler Wilcox

(November 5, 1850 – October 30, 1919)

American Poet

Poem Courtesy:

https://www.familyfriendpoems.com/poem/the-year-by-ella-wheeler-wilcox

రాత్రి తలెత్తే ప్రశ్నలు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

అసలు

ఈ ఆకాశం ఎందుకు?

నెత్తిమీద ఉరుములు ఎవరు రేపెడతారు?

ఆ ఫెళఫెళమనే శబ్దం ఎవరు చేస్తారు?

దేవతలు నిద్రలో పక్కమిదనుండి క్రిందకి దొర్లిపోతారా?

వాళ్ళ ఆటబొమ్మలన్నిటినీ పగలగొడుతున్నారా?

సూర్యుడు ఎందుకు అంత త్వరగా క్రిందకి దిగిపోతాడు?

రాత్రిపూట మేఘాలెందుకు ఆకలితో

అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణీ,

చంద్రుడిచుట్టూ ఉన్న గుడినీ మింగడానికి

అన్నట్టుగా నెమ్మదిగా పాకురుతుంటాయి?

అందరూ చెప్పుకుంటున్నట్టు

చుక్కలమధ్య ఎలుగుబంటి ఉంటుందా?

అలాగైతే, అది పచ్చికబయళ్ళ కడ్డంగా కట్టిన

దళ్ళు దూకి పాలపుంతని తాగెయ్యదా?

రాలిన ప్రతి నక్షత్రమూ

మిణుగురుపురుగుగా మారుతుందా?

మళ్ళీ తిరిగి అది ఎన్నడూ స్వర్గం చేరుకోదా?

అసలు ఇంతకీ

ఈ ఆకాశం ఎందుకున్నట్టు?

.

లూయీ అంటర్ మేయర్

అమెరికను కవి

(October 1, 1885 – December 18, 1977)

.

.

Questions at Night

.

Why

Is the sky?

What starts the thunder overhead?

Who makes the crashing noise?

Are the angels falling out of bed?

Are they breaking all their toys?

Why does the sun go down so soon?

Why do the night-clouds crawl

Hungrily up to the new-laid moon

And swallow it, shell and all?

If there’s a Bear among the stars,

As all the people say,

Won’t he jump over those Pasture-bars

And drink up the Milky Way?

Does every star that happens to fall

Turn into a fire-fly?

Can’t it ever get back to Heaven at all?

And why

Is the sky?

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/questions-at-night/

బహిష్కృతుడు… క్లాడ్ మెకే, జమైకన్ కవి

మా తాతముత్తాతలు పుట్టిన … చీకటి,  అనామకపు ప్రదేశాలకి

ఎలాగైనా వెళ్ళాలని తనువులోఇరుక్కున్న నా ఆత్మ ఉవ్విళ్ళూరుతోంది.

పెదాలు పేనుతున్న మాటల్ని, ఎప్పుడూ వినకున్నా, అనుభూతిస్తున్నాను.

నా మనసు ఎన్నడో మరిచిపోయిన అడవి పాటలు పాడుతోంది.

నేను మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళకపోతే నాకు ప్రశాంతత లేదు,

కానీ, ఈ పడమటి దేశాలు నాకో వెల నిర్ణయించాయి,

పరిచయంలేని వాళ్ల దేవుళ్ళకు నేను మొక్కినా

నాకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందన్న ఆశ లేదు.

“నా”దన్నదాన్ని దేన్నో నేను కోల్పోయాను, పూర్తిగా

నా గుండెలోనుండి అతి ముఖ్యమైనదేదో జారిపోయింది.

ఇక నేను నా బ్రతుకుని, ఈ నేలదొరల నడుమ,

వారికి ఎడంగా, జీవచ్ఛవంలా ఈడవవలసిందే.

ఎందుకంటే, నా సహజ వాతావరణానికి దూరమై, తెల్లవాడి

అజమాయిషీలకు లోబడి, పుట్టకూడని యుగంలో పుట్టాను.

.

క్లాడ్ మెకే

(September 15, 1889 – May 22, 1948) 

జమైకన్ కవి.

.

Outcast

.

For the dim regions whence my fathers came

My spirit, bondaged by the body, longs.

Words felt, but never heard, my lips would frame;

My soul would sing forgotten jungle songs.

I would go back to darkness and no peace,

But the great western world holds me in fee,

And I may never hope for full release

While to its alien gods I bend my knee.

Something in me is lost, forever lost,

Some vital thing has gone out of my heart,

And I must walk the way of life a ghost

Among the sons of earth, a thing apart.

For I was born, far from my native clime,

Under the white man’s menace, out of time.

.

Claude Mckay

(September 15, 1889 – May 22, 1948)

Jamaican Writer and Poet

Poem Courtesy: Black Poetry – A supplement to Anthologies which exclude Black Poets Edited by   Dudley Randall, Broadside Press, 12651 Old Mill Place, Detroit, Michigan 48238  

https://archive.org/details/blackpoetrysuppl00rand/page/4

కాలపరిభ్రమణం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

Merry Christmas

to all my Christian Friends

నరికిన చెట్టు కాలక్రమంలో తిరిగి చిగురించగలదు;

పూర్తిగా మోడులైపోయిన మొక్కలు పూలు పళ్ళూ కాయవచ్చు;

యమబాధ అనుభవించే మనిషికికూడా ఉపశాంతి లభిస్తుంది;

బొత్తిగా ఎండిపోయిన నేలసైతం చినుకులుపడి తడిపీల్చుకుంటుంది;

మంచి చెడులు దొర్లుతూ వస్తాయి, అదృష్టం యాదృచ్చికంగా మారుతుంది,

కష్టాలనుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్దురోజులకీ.

అదృష్టమహాసాగరం ఎప్పుడూ పొర్లిప్రవహించదు

అది ఆటులో ఉనప్పుడే మేళ్ళు చేసిపోతుంది;

దాని ఆటుపోటులు రెండూ ఒక్కగతిలోనే నడుస్తాయి

దాని మగ్గం నాజూకు, అతిముతక వస్త్రాలు రెంటినీ నేస్తుంది

ఎంతసంతోషమైనా కడదాకా కొనసాగనీయదు

భరింపరాని కష్టమైనా సున్నితంగా మార్పుచెందక తప్పదు.

ఎప్పుడూ శిశిరమే ఉండదు, ఎప్పుడూ వసంతమే నిలబడదు,

అంతులేని రాత్రీ ఉండదు, శాశ్వతమైన అహమూ ఉండదు,

ఒక ఋతువు పులుగుల రోదనలతో నిండిపోవచ్చు

భీకరమైన తుఫానైనా ప్రశాంతతతో చెయ్యికలపవలసిందే

మంచిచెడుల వికల్పాలతో భగవంతుడు, పడతామన్న భయమూ,

లేస్తామన్న ఆశ ఉండేలా మన ప్రవృత్తిని తీర్చిదిద్దుతాడు.

ఒక పొరపాటువల్ల కోల్పోయినదాన్ని, మరో అవకాశం తిరిగి తెస్తుంది,

పెద్దలోతులేని నూతిలోకూడా ఏవో చిన్న చేపపిల్లలు ఉండకపోవు,

కొన్ని విషయాలు చాలామందికి ప్రతికూలమైనా, అందరికీ అన్నీ కావు,

కొందరికి అన్ని అవసరాలూ తీరినా, కోరుకున్నవన్నీ ఎవరికీ సమకూరవు.

దుఃఖం జతకూడని సుఖం ఏ మనిషి పాలా బడదు.

కొందరికి తక్కువలో తక్కువ ఉండొచ్చు, అన్నీ ఉన్నవారెవరూ ఉండరు.

.

సెయింట్  రాబర్ట్ సౌత్ వెల్

(1561 –  21 February 1595)

ఇంగ్లీషు కవి.

Photo Courtesy:

https://www.catholiceducation.org/en/faith-and-character/faith-and-character/saint-robert-southwell-the-martyr-who-brought-beauty-to-england.html

Times Go by Turns

.

The lopped tree in time may grow again;

Most naked plants renew both fruit and flower;

The sorest wight may find release of pain,

The driest soil suck in some moist’ning shower;

Times go by turns and chances change by course,

From foul to fair, from better hap to worse.

The sea of Fortune doth not ever flow,

She draws her favours to the lowest ebb;

Her time hath equal times to come and go,

Her loom doth weave the fine and coarsest web;

No joy so great but runneth to an end,

No hap so hard but may in fine amend.

Not always fall of leaf nor ever spring,

No endless nightyet not eternal day;

The saddest birds a season find to sing

The roughest storm a calm may soon allay;

Thus with succeeding turns God tempereth all,

That man may hope to rise yet fear to fall.

A chance may win that by mischance was lost;

The well that holds no great, takes little fish;

In some things all, in all things none are cross’d,

Few all they need, but none have all they wish

Unmeddled joys here to no man befall,

Who least hath some, who most hath never all.

.

Robert Southwell

(1561 –  21 February 1595)

English Poet

Poem Courtesy:

https://archive.org/details/poemsdix01dixo/page/482

చిత్రమైన కలయికలు- 1… హెరాల్డ్ మన్రో, ఇంగ్లీషు కవి

ఎవరైనా తాము చూస్తుండగా ఒక మట్టి పెల్ల లేచి

నాలుగుపక్కలా నడుస్తూ, ఊపిరి తీస్తూ, మాటాడుతూ, ప్రేమిస్తుంటే

భయంతో ఎంత గజగజలాడిపోతారు? ఎంత ఆశ్చర్యంతో

“నువ్వు కదలగలుగుతున్నావా?” అని ఎగబీల్చుతారు?

కనుకనే, మనిషి నడవడం చూస్తున్నప్పుడు ఎప్పుడూ అనుకుంటుంటాను:

ఓ ధరిత్రీ! నువ్విది ఎలా సాధించగలిగేవు? నీ శక్తి ఎంతని?

నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే,నిర్మొహమాటంగా చెబుతున్నా,

నాకు ఇది ఎంతమాత్రం నమ్మబుద్ధి కావటం లేదు.

.

హెరాల్డ్ మన్రో

(14 March 1879 – 16 March 1932)

ఇంగ్లీషు కవి.

.

The Strange Meetings

 

I

 

If one beheld a clod of earth arise,

And walk about, and breathe, and speak and love,

How one would tremble, and in what surprise

Gasp: “Can you move?”

 

So, when I see men walk, I always feel:

Earth! How have you done this? What can you be?

I’m so bewildered that I can’t conceal

My incredulity.

 .

Harold  Manroe

(14 March 1879 – 16 March 1932)

English Poet

Poem Courtesy:

(https://archive.org/details/poetry01assogoog/page/n314

మన వారసత్వం… జోసెఫ్ ప్లంకెట్, ఐరిష్ కవి

రాజ సంతతికి అనూచానంగా వస్తున్న వారసత్వం:

తొలి రాజవీరుల పిల్లలూ, వాళ్ళ పిల్లల పిల్లలూ

ఘనకార్యాలు సాధించడం ద్వారానూ, గొప్పవస్తువులు

నిర్మించడం ద్వారానూ వాళ్ళ కలలను నిజం చేసారు.

పోరాటాలు ఏసిన ఆ చేతులు, పురాతన విషాదాంత

నాటకాలలో చిరస్థాయిగా నిలిచిన గుండెకోతలు

సూర్యచంద్రులున్నంతకాలం కొనసాగిస్తూనే ఉన్నాయి

వాళ్ళ వారసుల తలలు అధికారానికి తలవంచవు.

వాళ్ల చేతులు ఇప్పటికీ, వాళ్ళ తాతముత్తాతల

అస్థికలను దాచిన ఈ మట్టిని పరిరక్షిస్తూనే ఉన్నాయి.

తమ ప్రజల భవిషత్తు కోసం వాళ్ళ ధర్మాగ్రహం

అగ్నిపర్వతంలా ఎప్పుడూ లోలోపల రగులుతూనే ఉంది.

ఆ వైరిఖడ్గమూ వాళ్ళ కన్నీళ్ళనూ,

రక్తాన్నీ బహుమానంగా గెలుచుకో లేదు.

ప్రశాంతజీవితాకాంక్షతో సిగ్గువిడిచి

ఈ వారసత్వాన్ని ఎవరూ వదులుకోరు.

.

జోసెఫ్ మేరీ ప్లంకెట్

21 November 1887 – 4 May 1916

ఐరిష్ జాతీయవాద కవి

కుతూహలం రేకెత్తించే ఇతని జీవిత విశేషాలు ఇక్కడ.

.

.

Our Heritage

.

This heritage to the race of kings:

Their children and their children’s seed,

Have wrought their prophecies in deed

Of terrible and splendid things.

The hands that fought, the hearts that broke

In old immortal tragedies,

These have not failed beneath the skies:

Their children’s heads refuse the yoke.

And still their hands shall guard the sod

That holds their fathers’ funeral urn;

Still shall their hearts volcanic burn

With anger of the sons of God.

No alien sword shall earn as wage

The entail of their blood and tears.

No shameful price for peaceful years

Shall ever part this heritage.

.

Joseph Mary Plunkett.

21 November 1887 – 4 May 1916

Irish Nationalist Poet 

Poem Courtesy:  https://archive.org/details/poetry01assogoog/page/n294

 

కొడుక్కి ఆశీస్సులతో… థామస్ మెక్డొనా, ఐరిష్ కవి

భగవంతుడు నీకు సందేహించనవసరంలేని

బలాన్నీ, స్పష్టంగా దర్శించగల శక్తినీ ఇచ్చుగాక.

పోరాటాలెప్పుడూ ఒక లక్ష్యంకోసమే

స్వాతంత్య్రంకోసం చేసే పోరాటం సుదీర్ఘం,

అది నువ్వు నీ ఆగ్రహం, పోరాటంద్వారా సాధించడమే

నా జీవితానికి కొనసాగింపు.

కానీ, సెయింట్ సిసీలియా విందురోజున

పుట్టిన నీవంటి బుజ్జి పాపాయికి

నే నిపుడు నీ వయసుకి తగిన రీతిలో

లౌకిక ఆనందాలు కలగాలని ఆలపించాలి.

అతి సాధారణమైనవి: నీ బాల్యం, నీ కౌమారం

ఏ ఒడిదుడుకులూ లేకుండా ధైర్యంతో

అమాయకత్వంతో, సత్యసంధతతో సాగాలని.

ఇంత పిన్న వయసులో ఉన్న నీకు

మనసా, వాచా, కర్మణా సిద్ధించుగాక.

.

థామస్ మెక్డొనా

1 February 1878 – 3 May 1916

ఐరిష్ కవి

 

 

Wishes for my Son

(Addressed to his first child Donnachd born in 1912)

.

God to you may give the sight

And the clear undoubting strength

Wars to knit for single right,

Freedom’s war to knit at length,

And to win, through wrath and strife

To the sequel of my life.

But for you, so small and young,

Born on St. Cecilia’s Day,

I in more harmonious song

Now for nearer joys should pray-

Simple joys: the natural growth

Of your childhood and your youth,

Courage, innocence and truth:

These for you, so small and young

In your hand and heart and tongue.

.

Thomas MacDonagh

1 February 1878 – 3 May 1916

Irish Poet

Poem Courtesy:

https://archive.org/details/poetry01assogoog/page/n294

 

ఒక పల్లవి… పెడ్రైక్ పియర్స్, ఐరిష్ కవి

నా తలపున ఒక పల్లవి మెరిసింది

మహరాజుకీ, సైనికునికీ

నా ప్రేయసికొక పల్లవి రాసాను

రాజులకే రాజు, చిరకాలపు మృత్యువుకి.

ఓ మిత్తీ! నీ మృత్తికాగృహపు చీకటి నల్లదనపుజిగి

పట్టపగటి వెలుతురుకంటే ప్రకాశవంతంగా ఉంది.

నీ ఇంటి స్తబ్దత, అనంతమైన నీరవత

పావురాల సంగీతంకంటే ఇంపుగా ఉంది.

.

పెడ్రైక్ పియర్స్

(10 November 1879 – 3 May 1916)

ఐరిష్ కవి,

గేలిక్ నుండి అనువాదం: జోసెఫ్ కాంప్ బెల్

A Rann

.

A rann* I made in my heart

For the knight, for the king,

A rann I made for my love,

For the king of kings, for old Death.

Brighter to me than the light of the day

The darkness of your clay-black house;

Sweeter to me than the music of doves

The quiet of your house, and its everlasting silence.

.

Padraic Pearse (aka Patrick Pearse)

(10 November 1879 – 3 May 1916)

Irish Poet

Tr. From Gaelic: Joseph Campbell

Note:1  *Rann: Irish word for a Stanza especially of a song.

Note 2: The Title is mine not the Poet’s.  Reason: The poem was quoted without title.

Poem Courtesy: Artcle appearing in Poetry- A Magazine of Verse, ed. Harriet Monroe, August 1916 

https://archive.org/details/poetry01assogoog/page/n294 

ప్రతిధ్వని… ఛార్లెట్ బెకర్

నా ప్రియుడు కడసారి వీడ్కోలు చెప్పాడు, దుఃఖమూ కన్నీళ్ళూ లేకుండా

బహుశా, మేము ఇద్దరం ఇన్నాళ్ళూ కలిసి తిరిగి గడిపిన ఆనందక్షణాలు

గుర్తుచేసుకున్నాడేమో?! కానీ, పెదవిమీద ఆ నిర్లిప్తపు చిన్న చిరునవ్వు—

ఎన్ని చెప్పు, ఎన్ని ఏడుపులూ అందులోని విషాదానికి సాటి రావు

ఎంతో బాధేసింది! తెరిచిన తలుపులనుండి బయటకి వెళ్ళాడు

రెక్క తెగిన పక్షిలా…  నెమ్మదిగా … నిరాశగా… నిట్టూరుస్తూ .

అతను ఎక్కడికెళ్ళాడో నే చెప్పలేను గానీ

తెల్లవారీదాకా అతని నవ్వు నాకు వినిపిస్తూనే ఉంది.
.

చార్లెట్ బెకర్

.

Echo

.

Love said farewell, yet not with moan or  tears

Did he recall the gladness of the years

We walked together?  with a little laugh-

Ah, but no weeping ever could be half 

So sad! – out from my open door he went,

His bowed wings torn, his breathing slow and spent.

And, though I know not whither he is gone

I hear his laughter from the dusk till dawn!

.

Charlotte Becker

I deeply regret that I could not provide any details about the poetess.

 

Poem Courtesy:  (From Poetry: A Magazine of Verse)

https://archive.org/details/poetry01assogoog/page/n155 

మారణహోమం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను

Maple in Autumn

 

శరత్కాలం ఆ లోయని వరదలా కమ్ముకుంది—

సీసపు గుళ్ళలా చినుకులు టపటపా రాలుతున్నాయి

ఫర్ చెట్లు అటూ ఇటూ బాధతో మూలుగుతూ కదుల్తున్నాయి

నేలంతా గాయపడ్డ మేపిల్ చెట్ల రక్తపు మరకలే.

.

ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్

అమెరికను 

Carnage

.

Over the valley swept the Autumn flood—

In showers of leaden bullets fell the rain;

the firs moved to and fro, drunken with pain,

And wounded maples stained the earth with blood.

.

Antoinette De Coursey Patterson

American

Poem Courtesy:
https://archive.org/details/poetry01assogoog/page/n91

 

%d bloggers like this: