నేను ముసలివాడిని అయిపోయేక
భయపెట్టే చొక్కాలూ
మరీ పొట్టి పంట్లాలూ
నాకు తొడగొద్దు.
తొడిగి, వేసవిలో
పిల్లలాడుకునే చోట్లకు
చూస్తూకూచోమని తరమొద్దు.
ప్రాణం నిలబెట్టుకుందికి
సరిపడినంత తిండిపెట్టి,
శీతాకాలమంతా
స్థానిక గ్రంథాలయంలో
ఏ గదిలోనో కూచుని
నిన్నటి పేపరుని
ఈరోజు చదవడానికి
నా వంతు వచ్చేవరకూ
వేచి చూస్తూ గడపమని అనొద్దు.
అంతకంటే, నన్ను కాల్చి పారేయండి.
అలా చెయ్యడానికి మీకు తోచిన కారణం
ఏదో ఒకటి, నా వల్ల తగువులొస్తున్నాయనో
నా పనులు నేను చేసుకోలేకపోతున్నాననో,
నా గది అపరిశుభ్రంగా ఉంచుతున్నాననో.
మీరు నన్ను చంపడానికి
నన్ను చంపడానికి సంజాయిషీక్రింద
మీరు పైనచెప్పిన కారణాలు
చెప్పడానికి భయపడితే
అందరికీ, నేను అమ్మాయిలమీద
వాలిపోతున్నానని చెప్పండి,
అందులోనూ చిన్నపిల్లలు అని చెప్పి
కాల్చి పారేయండి.
మీరు ఎందుకు చేసేరని అడగను.
కానీ ఆ పని మాత్రం చెయ్యండి.
అంతేగాని, వీధి చివర్లో
ఉన్న షాపులకి చేతిలో చిల్లర
లెక్కపెట్టుకుంటూ వెళ్ళవలసి వచ్చేట్టో,
లేకపోతే, ఏ కుష్ఠురోగి కిచ్చినట్టో
కొన్ని నిర్ణీత సమయాల్లో ఉచితంగా ప్రయాణం
చెయ్యమని, ఒక అనుమతి నా ముఖాన్న కొట్టొద్దు.
.
జిమ్ బర్న్స్
జననం 1936
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://poetrymagazines.org.uk/magazine/recordea5e-2.html?id=16305
స్పందించండి