ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి
నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను.
ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు…
త్వరగా! అది సరిపోతుంది.
నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు
అప్పుడు నేను పడిపోతే అవకాశం ఉండదు.
మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి
అది నా అభిమతమూ, నీ అభిమతమూ.
నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు
సముద్రతీరమైనా ఫర్వా లేదు
ఎడతెగని పరుగుపందెంలో చిక్కుకున్నా
నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ
ఇన్నాళ్ళూ బ్రతికిన నా జీవితానికీ
ఈ ప్రపంచానికి వీడ్కోలు
నా తరఫున ఆ కొండల్ని ఒకసారి
ముద్దాడండి, ఇపుడు నేను సర్వసన్నద్ధం.
.
ఎమిలీ డికిన్సన్
( 10 December 1830 – 15 May 1886)
అమెరికను కవయిత్రి
Tie the strings of my Life, My Lord,
.
Tie the Strings to my Life, My Lord,
Then, I am ready to go!
Just a look at the Horses
Rapid! That will do!
Put me in on the firmest side
So I shall never fall
For we must ride to the Judgment
And it’s partly, down Hill
But never I mind the steeper
And never I mind the Sea
Held fast in Everlasting Race
By my own Choice, and Thee
Goodbye to the Life I used to live
And the World I used to know
And kiss the Hills, for me, just once
Then — I am ready to go!.
Emily Dickinson
( 10 December 1830 – 15 May 1886)
American Poet
Poem Courtesy:
https://100.best-poems.net/tie-strings-my-life-my-lord.html

జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
అసలు జీవితమంటే ఏమిటి? నడుస్తున్న ఇసుకగడియారం
సూర్యుడికి దూరంగా జరుగుతున్న వేకువ పొగమంచు.
క్షణం తీరికలేకుండా కోలాహలంగా పదే పదే వచ్చే కల.
దాని గడువు ఎంత? ఒక్క విశ్రాంతి క్షణం, ఆలోచనా లేశం.
అదిచ్చే ఆనందం? ప్రవాహంలోని నీటి బుడగ.
దాన్ని అందుకుందికి పడే ఆరాటంలో అదీ శూన్యమైపోతుంది.
ఆశ అంటే ఏమిటి? హాయినిచ్చే ప్రాభాతపు పిల్లగాలి.
దాని హొయలుతో పచ్చికబయళ్ళమీది తెలిమంచు హరిస్తుంది
ప్రతిపూలగుత్తినుండీ దాని రత్నాలను త్రెంచి, మాయమౌతుంది.
నిరాశల ముళ్ళకొనలను దాచే సాలెగూడు అది,
ఆ ముసుగులోంచి మరింత వాడిగా గుచ్చుకునేట్టు చేస్తుంది.
మృత్యువంటే ఏమిటి? ఇప్పటికీ కారణం కనిపెట్టలేదా?
ఆ రోతపుట్టే శబ్దానికి మరో గూఢమైన, మార్మికపు పదం.
అలసినవాళ్ళు కోరుకునే దీర్ఘకాలపు నిద్ర.
మనశ్శాంతి అంటే? దాని ఆనందానికి హద్దులేమిటి?
అయితే స్వర్గం, లేకుంటే సమాధి తప్ప వేరు లేవు.
మరి ప్రాణం అంటే ఏమిటి? ఆదొక మాయపొర. తొలగించగానే
అంతవరకూ కోరుకున్నది, అక్కరలేకుండా పోతుంది,
మన తెలివి తక్కువ కళ్ళకి, కనిపించే ప్రతి వస్తువూ
దాని అతిశయాన్ని ఋజువు చేస్తూనే ఉంటాయి.
కృతజ్ఞతలేని మనుషులకి దాన్ని పదిలపరచుకోవడం
ఎలాగో చెప్పడానికీ, అహంభావి ఆ ఆనందం ఎలా తెలుసుకోలేడో,
మళ్ళీ మృత్యువు తర్వాతే తిరిగిపొందగలడని తెలియజెయ్యడానికీ,
అదొక పరీక్ష. దాన్ని అందరూ ఎదుర్కోవలసిందే!
.
జాన్ క్లేర్
(13 July 1793 – 20 May 1864)
ఇంగ్లీషు కవి.
.
What is Life?
.
And what is Life? An hour-glass on the run,
A mist retreating from the morning sun,
A busy, bustling, still-repeated dream.
Its length? A minute’s pause, a moment’s thought.
And Happiness? A bubble on the stream,
That in the act of seizing shrinks to nought.
And what is Hope? The puffing gale of morn,
That of its charms divests the dewy lawn,
And robs each flow’ret of its gem—and dies;
A cobweb, hiding disappointment’s thorn,
Which stings more keenly through the thin disguise.
And what is Death? Is still the cause unfound?
That dark mysterious name of horrid sound?
A long and lingering sleep the weary crave.
And Peace? Where can its happiness abound?
Nowhere at all, save heaven and the grave.
Then what is Life? When stripped of its disguise,
A thing to be desired it cannot be;
Since everything that meets our foolish eyes
Gives proof sufficient of its vanity.
‘Tis but a trial all must undergo,
To teach unthankful mortals how to prize
That happiness vain man’s denied to know,
Until he’s called to claim it in the skies.
.
John Clare
(13 July 1793 – 20 May 1864)
English Poet
Poem Courtesy:
https://100.best-poems.net/what-life-1.html
ఆనవాలు పట్టడం… రోజర్ మెగోఫ్ , ఇంగ్లీషు కవి
మీరు ఇతను స్టీఫెనే అంటారు.
అలా అయితే నేను నిజమో కాదో రూఢి చేసుకోవాలి.
నా జాగ్రత్తలో నేనుండడం ఎప్పుడైనా మంచిదే కదా!
చూశారా! ఇక్కడే పప్పులో కాలు వేశారు. జుత్తు చూస్తున్నారు గదా,
ఇది నల్లగా ఉంది. స్టీఫెన్ జుత్తు తెల్లగా ఉంటుంది…
ఏమిటీ? ఏమయిందీ? విస్ఫోటనం జరిగిందా?
అలా అయితే నల్లగా మాడిపోతుంది. నా మతి మండినట్టే ఉంది.
నా బుర్రకి ముందే తట్టి ఉండాలి. సరే, మిగతావి పరీక్షిద్దాం.
ఆ ముఖం, ఆ ముఖం గురించే నే నడుగుతున్నది?
నల్లగా కొరకంచులా మాడిపోయిన చర్మం,
పొక్కిపోయి, మచ్చలు తేరి పోయింది
అది పిల్లవాడి ముఖం అంటే ఎవరైనా నమ్ముతారా?
అయితే, కాలిపోగా మిగిలిన చోట్ల కనిపిస్తున్న స్వెట్టరు
మాత్రం బాగా పరిచయం ఉన్నట్టు కనిపిస్తోంది.
కానీ, రూఢిచేసుకోవడం ఎందుకైనా మంచిది.
ఓ, స్కౌటు బెల్టు. అది మాత్రం అతనిదే.
ఈ మధ్యనే, నిండా వారం కూడా తిరగలేదు,
దానికి కన్నాలు వెయ్యడం నాకు గుర్తుంది.
పిల్లలకు వాళ్ళు వేసుకునే దుస్తులమీద
ఎక్కువ దృష్టి ఉండే వయసు కదా.
ఇది ఖచ్చితంగా స్టీఫెనే. కానీ రూఢి
చేసుకోవడం, అన్ని సందేహాలు తీర్చుకోవడం మంచిది.
ఏ చిన్నపాటి ఆశ ఉన్నా నిలబెట్టుకోవడం మంచిది.
జేబులో! జేబులు ఖాళీ చెయ్యండి.
చేతి రుమాలా? అది ఏ విద్యార్థిదైనా అయి ఉండొచ్చు.
ఎంత మురికిగా ఉండాలో అంత మురికిగా ఉంది. సిగరెట్లా?
అయితే ఇది స్టీఫెన్ ఖచ్చితంగా కాదు.
మీకు తెలుసుగా, నేను సిగరెట్లు తాగనియ్యనని.
వాడు నా మాట పెడచెవిని పెట్టడు. వాళ్ళ నాన్నలా కాదు.
కాని ఆ పెన్-నైఫ్ వాడిదే. అది వాడిదేనని ఒప్పుకుంటున్నా.
ఆ తాళాలగుత్తికున్న తాళంచెవి కూడా వాడిదే
ఈ మధ్యనే వాళ్ళ నానమ్మ ఇచ్చింది.
అంటే ఇది తప్పకుండా స్టీఫెనే.
ఇప్పుడర్థం అయింది నాకు ఏంజరిగిందో…
అదే సిగరెట్ల విషయం.
ఖచ్చితంగా వాడు వాటిని
వాడికంటే పెద్ద కుర్రాళ్ళకోసం తెచ్చి ఉంటాడు.
అంతే! అంతే! మరోలా అవడానికి అవకాశం లేదు.
ఇది వాడే.
ఇది మా స్టీఫెనే!
.
రోజర్ మెగోఫ్
జననం 1943
ఇంగ్లీషు కవి.

Image Courtesy: https://ryedalefestival.com/wp-content/uploads/6-Roger-McGough.jpg
.
The Identification
.
So you think it is Stephen?
Then I’d best make sure
Be on the safe side as it were.
Ah, theres been a mistake. The hair
You see, its black, now Stephens fair…
Whats that? The Explosion?
Of course, burnt black. Silly of me.
I should have known. Then lets get on.
The face, is that a face I ask?
That mask of charred wood
Blistered, scarred could
That have been a child’s face?
The sweater, where intact, looks
In fact all too familiar.
But one must be sure.
The scout belt. Yes that’s his.
I recognise the studs he hammered in
Not a week ago. At the age
When boys get clothes-conscious
Now you know. Its almost
Certainly Stephen. But one must
Be sure. Remove all trace of doubt.
Pull out every splinter of hope.
Pockets. Empty the pockets.
Handkerchief? Could be any schoolboy’s.
Dirty enough. Cigarettes?
Oh this can’t be Stephen.
I don’t allow him to smoke you see.
He wouldn’t disobey me. Not his father.
But that’s his penknife. That’s his alright.
And that’s his key on the keyring
Gran gave him just the other night.
Then this must be him.
I think I know what happened
…. About the cigarettes
No doubt he was minding them
For one of the older boys.
Yes that’s it.
That’s him.
That’s our Stephen.
.
Roger McGough
9th Nov 1937
English Poet
Poem Courtesy:
https://archive.org/details/strictlyprivatea00mcgo/page/58
రోజులు… వికీ ఫీవర్, ఇంగ్లీషు కవయిత్రి
అవి మనదగ్గరికి
కడగని సీసాల్లా
ఖాళీగా, మురికిగా వస్తాయి.
వాటి అంచులకి
‘నిన్న’ మసకగా
పొరలా కమ్మి ఉంటుంది.
మనం వాటిని ఉంచుకోలేం.
మన బాధ్యత వాటిని నింపి
వెనక్కి పంపెయ్యడమే.
దానికి కూలి ఏమీ ఉండదు.
దానికి ప్రతిఫలం:
చేసిన పనే. అంతే!
దీన్ని మనం ప్రశ్నిస్తే
వాచీల్లా గుండ్రటి ముఖాల్తో
వాళ్లు కోపంతో అరుస్తారు.
పోనీ అద్దం పగులగొడదామని అనుకుంటే
మనల్ని మనమే గాయపరచుకుంటాం.
రోజుల్లో ఏమీ మార్పు ఉండదు.
అవి పొద్దు పొడుస్తూనే
వెలుతురుతో మనల్ని నిద్రలేపుతాయి.
పొద్దుపోగానే, చీకట్లో వదిలి పోతాయి.
చీకటి వాటి
బలహీనత కాదు; మృత్యువు గురించి
ఆలోచించనలతో మనల్ని పెట్టే బాధ.
రోజులకి అంతం లేదు.
పంజరం మీద
గుడ్డ ఎప్పుడో కప్పి ఉంది.
.
వికీ ఫీవర్
జననం 1943
ఇంగ్లీషు కవయిత్రి
.
Image Courtesy:
https://www.poetryarchive.org/poet/vicki-feaver
.
Days
.
They come to us
Empty but not clean-
Like unrinsed bottles
Sides clouded
With film
Of yesterday.
We can’t keep them.
Our task is to fill up
And return.
There are no wages.
The reward is said to be
The work itself.
And if we question this,
Get angry and scream
At their round clock faces
Or try to break the glass,
We only hurt ourselves.
The days remain intact.
They wake us up
With light and leave us
In the dark.
For night is not
Their weakness- but a tease
To make us dream of death.
There is no end to days.
Only a cloth laid
Over a birdcage.
.
Vicki Feaver
Born 1943
English Poetess
Poem Courtesy:
https://archive.org/details/strictlyprivatea00mcgo/page/66
రానున్న రోజులకో చీటీ… జిమ్ బర్న్స్, ఇంగ్లీషు కవి
నేను ముసలివాడిని అయిపోయేక
భయపెట్టే చొక్కాలూ
మరీ పొట్టి పంట్లాలూ
నాకు తొడగొద్దు.
తొడిగి, వేసవిలో
పిల్లలాడుకునే చోట్లకు
చూస్తూకూచోమని తరమొద్దు.
ప్రాణం నిలబెట్టుకుందికి
సరిపడినంత తిండిపెట్టి,
శీతాకాలమంతా
స్థానిక గ్రంథాలయంలో
ఏ గదిలోనో కూచుని
నిన్నటి పేపరుని
ఈరోజు చదవడానికి
నా వంతు వచ్చేవరకూ
వేచి చూస్తూ గడపమని అనొద్దు.
అంతకంటే, నన్ను కాల్చి పారేయండి.
అలా చెయ్యడానికి మీకు తోచిన కారణం
ఏదో ఒకటి, నా వల్ల తగువులొస్తున్నాయనో
నా పనులు నేను చేసుకోలేకపోతున్నాననో,
నా గది అపరిశుభ్రంగా ఉంచుతున్నాననో.
మీరు నన్ను చంపడానికి
నన్ను చంపడానికి సంజాయిషీక్రింద
మీరు పైనచెప్పిన కారణాలు
చెప్పడానికి భయపడితే
అందరికీ, నేను అమ్మాయిలమీద
వాలిపోతున్నానని చెప్పండి,
అందులోనూ చిన్నపిల్లలు అని చెప్పి
కాల్చి పారేయండి.
మీరు ఎందుకు చేసేరని అడగను.
కానీ ఆ పని మాత్రం చెయ్యండి.
అంతేగాని, వీధి చివర్లో
ఉన్న షాపులకి చేతిలో చిల్లర
లెక్కపెట్టుకుంటూ వెళ్ళవలసి వచ్చేట్టో,
లేకపోతే, ఏ కుష్ఠురోగి కిచ్చినట్టో
కొన్ని నిర్ణీత సమయాల్లో ఉచితంగా ప్రయాణం
చెయ్యమని, ఒక అనుమతి నా ముఖాన్న కొట్టొద్దు.
.
జిమ్ బర్న్స్
జననం 1936
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://poetrymagazines.org.uk/magazine/recordea5e-2.html?id=16305
.
Note for the future
.
When I get old
Don’t dress me in
Frayed jackets
and too-short trousers,
and send me out
to sit around bowling-greens
in summer.
Don’t give me just enough
To exist on, and expect me
To like passing
The winter days
In the reading room
Of the local library, waiting
My turn to read
Last night’s local paper.
Shoot me!
Find reason, any reason,
Say I’m a troublemaker,
Or can’t take care of my self
And live in a dirty room.
If you are afraid
Of justifying my execution
On those terms,
Tell everyone I leer
At little girls, and then
Shoot me!
I don’t care why you do it,
But do it,
And don’t leave me
To walk to corner shops
Counting my coppers,
Or give me a pass to travel cheap
At certain times, like a leper.
.
Jim Burns
Born 1936
English Poet
Poem Courtesy:
https://archive.org/details/strictlyprivatea00mcgo/page/70
వసంతంలో పారిస్ నగరం… సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
కాసేపు కనిపించీ కాసేపు కనిపించని
సూర్యుడి వెలుగులో నగరం ప్రకాశిస్తోంది.
పిల్లగాలి హుషారుగా ఈదుకుంటూ పోతోంది.
ఒక చిన్న జల్లు కురిసి ఆగిపోయింది.
నీటిబొట్లు మాత్రం చూరుకి వేలాడుతూ
ఒకటొకటిగా క్రిందకి రాలుతున్నాయి.
ఆహ్! ఇది పారిస్, ఇది పారిస్,
వసంతం అడుగుపెట్టింది.
బోయిస్ పార్కు చిత్రమైన స్పష్టాస్పష్ట కాంతితో
మిలమిలా మెరుస్తుండడం నాకు తెలిసినదే.
పొడవైన ఛాంప్స్ రాచవీధిలో ఆర్క్ డ ట్రీయోంఫ్
ప్రాచీనతకి చిహ్నంగా నిశ్చలంగా, హుందాగా నిలబడుతుంది.
కానీ మహోన్నతంగా పెరిగిన అకేసియా చెట్లమీద పడే
వెలుతురుకి కాలిబాటమీద నీడలు దోబూచులాడుకుంటాయి.
ఓహ్, ఇది పారిస్, ఇది పారిస్,
చెట్ల ఆకులు పచ్చదనాన్ని సంతరించుకుంటున్నాయి.
సూర్యాస్తమయం అయింది, వెలుగు తిరోగమించింది,
పడీ పడనట్టు నాలుగు చినుకులు రాలేయి.
కానీ సియాన్ నదిమీదనుండి ఇంత హాయిగా గాలి
వీస్తుంటే, దాన్ని ఎవరు పట్టించుకుంటారు?
అయినా, అందమైన యువతి ఒకతె కిటికీ
అద్దం పక్కన కూచుని ఏదో కుట్టుకుంటోంది.
అది పారిస్, అది పారిస్ నగరం అయి
అది వసంతం అయితే, మరోసారి తప్పక రండి.
.
సారా టీజ్డేల్
(8th Aug 1884 – 29th Jan 1933)
అమెరికను కవయిత్రి
.

.
Paris in Spring
.
The city’s all a-shining
Beneath s fickle sun,
A gay young wind is a-blowing,
The little shower is done,
But the raindrops still are clinging
And falling one by one—
Oh, it’s Paris, it’s Paris
And springtime has begun.
I know the Bois is Twinkling
In a sort of hazy sheen,
And down the Champs the gay old arch
Stands cold and still between.
But the walk is flecked with sunlight
Where the great acacias lean,
Oh, it’s Paris, it’s Paris,
And the leaves are growing green.
The sun’s gone in, the sparkle’s dead,
There falls a dash of rain,
But who would care when such an air
Comes blowing up the Seine?
And still Ninette sits sewing
Beside the windowpane
When it’s Paris, it’s Paris
And springtime’s come again.
.
Sara Teasdale
(8th Aug 1884 – 29th Jan 1933)
American
Poem Courtesy:
https://archive.org/details/collectedpoemsof00teas/page/36
ప్రాణం అంటే ఏమిటి… కోలరిడ్జ్ , ఇంగ్లీషు కవి
కాంతి గురించి ఒకప్పుడు ఊహించినట్టుగా
మనిషి కంటికి అందనంత విస్తారమైనదా ప్రాణం?
తనకు ఎదురులేనిదీ, ఏది మూలాధారమో కనుగొనలేనిదీ,
మనం ఇప్పుడు చూస్తున్న దాని అన్ని రంగులూ,
వాటిలోని అతి చిన్న ఛాయా భేదాలూ, చీకటిని
అంచులకు తరుముతూ తరుముతూ ఏర్పడినదేనా?
ఆసలు ఈ ప్రాణానికి చైతన్యము హద్దు కాదా?
ఈ ఆలోచనలూ, బాధలూ, ఆనందాలూ, ఊపిరులూ
ప్రాణానికీ మృత్యువుకీ మధ్య నిత్యం జరిగే కాటా కుస్తీలో భాగమేనా?
.
సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్
(21 October 1772 – 25 July 1834)
ఇంగ్లీషు కవి
.
What is Life?
.
Resembles Life what once was held of Light,
Too ample in itself for human sight?
An absolute Self an element ungrounded
All, that we see, all colours of all shade
By encroach of darkness made?
Is very life by consciousness unbounded?
And all the thoughts, pains, joys of mortal breath,
A war-embrace of wrestling Life and Death?
.
Samuel Taylor Coleridge
(21 October 1772 – 25 July 1834)
English Poet
Poem Courtesy:
https://100.best-poems.net/what-life.html
లెక్కలు… గవిన్ ఏవార్ట్, ఇంగ్లీషు కవి
నాకు 11 ఏళ్ళు. నిజమే, నాకు నిజంగా
రెండో ఎక్కం నోటికి రాదు. మా ఉపాద్యాయులు సిగ్గుచేటు అంటారు.
నాకు సమయం దొరికినా, అప్పటికి ఒళ్ళు బాగా అలసిపోతుంది.
రోన్ ఐదేళ్లవాడు. సమంతకి 3, కెరోల్ కి ఏడాదిన్నర,
అదికాక నెలల బిడ్డ. అవసరమైన పనులన్నీ నేనే చెయ్యాలి.
అమ్మ పనికి పోతుంది. నాన్న ఎక్కడో ఉన్నాడు. కనుక
నేనే వాళ్ళకి బట్టలు తొడగాలి, ఉదయం ఫలహారం పెట్టాలి.
మిసెస్ రసెల్ ఎప్పుడో వస్తుంది, రోన్ ని నేనే బడికి దిగబెడతాను.
మిస్ ఈమ్స్ నన్ను ‘శుద్ధ మొద్దు’ అని తనదైన పాత పద్ధతిలో తిడుతుంది.
డొరీన్ మెలొనీ నన్ను ‘వఠ్ఠి దద్దమ్మ’ అంటుంది.
టీ తర్వాత ఆటలకి తోపుడుబండిలో తీసుకెళ్ళాలి.
మామూలు రోజుల్లో ఆ చోటు బాగానే ఉంటుంది. దానినిండా
నాలా ఉదయాన్నే లేచి పనిచేసే పిల్లలే. వాచీలో 6 చూపించగానే
పిల్లల్ని నిద్రపుచ్చాలి. అప్పుడు నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.
7 అవుతుంటే, అమ్మ తలుపు తెరుస్తున్న తాళ్ళచెవి చప్పుడు వినిపిస్తుంది.
.
గవిన్ ఏవార్ట్
(4 February 1916 – 25 October 1995)
ఇంగ్లీషు కవి
Arithmetic
.
I’m 11. I don’t really know
My Two Times Two Table. Teacher says it’s disgraceful.
But even if I had the time, I feel too tired.
Ron’s 5, Samantha’s 3, Carole’s 18 months,
And then there’s Baby. I do what’s required.
Mum’s working. Dad’s away. And so
I dress them, give them breakfast. Mrs Russel
Moves in, and I take Ron to school.
Miss Eames calls me on old-fashioned word: Dunce.
Doreen Maloney says I’m a fool.
After tea, to the Rec. Pram-pushing’s show
But on fine days it’s a good place, full
Of larky boys. When 6 shows on the clock
I put the kids to bed. I’m free for once.
At about 7- Mum’s key in the lock.
.
Gavin Ewart.
British Poet
Poet Courtesy: https://archive.org/details/strictlyprivatea00mcgo/page/19
ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా కిటికీ అద్దం మంచుతో మెరుస్తోంది
లోకం అంతా ఈ రాత్రి చలికి వణుకుతోంది
చంద్రుడూ, గాలీ రెండంచుల కత్తిలా
భరించశక్యంకాకుండా బాధిస్తున్నారు.
భగవంతుడా! ఇలాంటపుడు తలదాచుకుందికి
కొంపలేనివాళ్లనీ, దేశద్రిమ్మరులనీ రక్షించు.
దేముడా! మంచుమేతలు వేసిన వీధుల్లో దీపాల
వెలుగుకి తచ్చాడే నిరుపేదలని కరుణించు.
మడతమీదమడతవేసిన తెరలతో వెచ్చగా,
నా గది ఇప్పుడు వేసవిని తలపిస్తోంది.
కానీ ఎక్కడో, గూడులేని అనాధలా
నా మనసు చలికి మూలుగుతోంది.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
