కొత్తలోకానికి పయనం … లాయిడ్ మిఫ్లిన్, అమెరికను కవి తారకాసముదయం మధ్యనెక్కడో మేఘాలపై నిలుచున్నాము మేము. అక్కడ నెలకొన్న నిశ్శబ్ద ఏకాంతత, తేజోమయమైన అతని శిరసుచుట్టూ వీణానాదమై నినదించగా, ఒక దేవదూత చేతులెత్తి ఒక్కొక్క చుక్కనీ చూపిస్తూ ఇలా అన్నాడు: “ఇక్కడున్న ఈ లక్షల నక్షత్రాలలో ఏ ప్రపంచానికి మిమ్మల్ని నన్ను ఎగరేసుకు పొమ్మంటారు?” అని. … నేను చనిపోయి అప్పటికి ఎక్కువ సమయం కాలేదు… “ఒక్క సారి నన్ను ఈ విశాల విశ్వాన్ని పరికించనీయండి. నిర్ణయం తీసుకోబోయే ముందు నన్ను ఆలోచించుకోనీయండి … అవునూ, అక్కడ దూరంగా క్షితిజరేఖ దగ్గర అందంగా మెరుస్తూ దాని లేవెలుగులు మన రెక్కలకు ఎరుపునద్దుతున్న నక్షత్రం ఏమిటి? నాకు అక్కడికి వెళ్ళి ఉండిపోవాలనుంది,” అని అన్నాను. చిన్న పిల్లల ఆలోచనలు పసిగట్టి నవ్వే పెద్దలా చిరునవ్వుతో “నువ్వు నిన్న రాత్రి చనిపోయిన ప్రపంచం అదే!” అన్నాడు. . లాయిడ్ మిఫ్లిన్ (15 September 1846 – 1921) అమెరికను కవి . . Upon a cloud among the stars we stood. The angel raised his hand and looked and said, “which world, of all yon starry myriad, Shall we make wing to?” The still solitude Became a harp whereon his voice and mood Made spheral music round his haloed head. I spake—for then I had not long been dead— “Let me look round upon the vasts, and brood A moment on these orbs ere I decide… What is yon lower star that beauteous shines And with soft splendour now incarnadines Our wings?—There would I go and there abide.” Then he as one who some child’s thought divines, “That is the world where yesternight you died.” . Lloyd Mifflin (15 September 1846 – 1921) Poem Courtesy: https://archive.org/details/littlebookofmode00ritt/page/168 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే అక్టోబర్ 14, 2019
వర్గాలుఅనువాదాలు సంతోషహృదయము… జాన్ వాన్స్ చీనీ, అమెరికను కవినిష్క్రమిస్తున్న అతిథి… జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.