నేను మరణించి, ఏప్రిల్ నెల వర్షానికి
తడిసిన తమ కురులతో చెట్లు నా మీద వాలినపుడు,
గుండె పగిలి నువ్వుకూడా నా మీద వాలితే వాలవచ్చు
అయినా, నేను లక్ష్య పెట్టను.
గుబురుగా పెరిగిన కొమ్మలతో వర్షానికి వంగిన
చెట్లకున్నంత ప్రశాంతంగా ఉంటాను నేను.
అంతేకాదు. నువ్వు ఇప్పుడున్న దాని కంటే
మౌనంగా, ఉదాసీనంగా ఉంటాను నేను.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి

స్పందించండి