ఇంగ్లీషు కవి T E ఎర్ప్ మూడు కవితలు 1. మరోమార్గం… . నేను సుమారుగా ఇరవై ఏళ్ళనించి పుస్తకాలు చదువుతూ ఉన్నాను; అందరూ ఎక్కడ నవ్వితే, నేనూ అక్కడ నవ్వేను ఎక్కడ ఏడిస్తే , నేనూ అక్కడ ఏడిచేను. జీవితం ఇన్నాళ్ళూ అరిగిపోయినదారిలోనే ప్రయాణించింది. నా అంతట నేను మరోదారి వెతుక్కుంటాను. 2. ప్రేమ కవిత . ఏం చెప్పమంటావు?! నేను నీలో ఒక భాగాన్నైపోయాను. అందులో మరీ దౌర్భాగ్యం ఏమిటంటే వెనక మగాళ్ళు చేసే పొగడ్తలు వింటూ ఏమీ పట్టకుండా నిశ్చలంగా నువ్వలా వీధివెంట వెళుతూ ఉంటావు. నీ వెనకే వస్తున్న నాకు నవ్వుతోబాటు లోపల గర్వంగా అనిపిస్తుంది. 3. గుంపు . ఇక్కడ రకరకాల మనుషుల గుంపు ఉంది అందరూ ఒక్క గొంతుతో అరుస్తున్నారు. ముందుగా చెబుతున్నా, జాగ్రత్త! ఆ గుంపుకి మరీ దగ్గరకు పోబోకు. నీ గొంతు ఆ అరుపుల్లో వినిపించనైనా వినిపించదు లేదా, నువ్వూ వాళ్ళలా అరవడం మొదలుపెడతావు. . T E ఎర్ప్ 20 వ శతాబ్దం ఇంగ్లీషు కవి (ఈ కవి గురించి ఏ సమాచారమూ ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను) 1. Departure I have been reading books for about twenty years; I have laughed with other men’s laughter wept with their tears. Life has been a cliche all these years I would find a gesture of my own. 2. Love Poem . I have become so much a part of you alas! and the worse part that you go down the street and hear men’s praises with calm indifference; while I who follow smile and am filled with pride. 3.The Crowd . Here are many different people all roaring with one voice. Beware! Do not go too near! Or you will lose your voice and roar with them! TW Earp English Poet 20th century Poem Courtesy: https://archive.org/details/oxfordpoetry1915oxfouoft/page/8? Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే అక్టోబర్ 4, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులుEnglish Poethttps://archive.org/details/oxfordpoetry1915oxfouoft/page/8?T E Erp అందం అంటే ఏమిటి?… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవిఅమ్మ… థెరెసా హెల్బర్న్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.