అందం అంటే ఏమిటి?… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి

నశ్వరమైన ఈ శరీరంలో అతి సూక్ష్మ భాగాన్ని

అదెంత చిన్నదైనా, సజీవంగా ఉంచే … ఒక సంకేతం;

ఒక సరసు మీదా, రాతిగుట్టమీదా అకస్మాత్తుగా

సమానంగా పడే అద్భుతమైన … ఆవేశ లేశము,

నిద్రిస్తున్న దైవత్వాన్ని నిద్రమేల్కొలిపి

జరిగినదీ, జరుగనున్నదీ గుర్తుచేస్తూ

భరించలేని గుండె గాయాలను మాన్పి

సాంత్వన నిచ్చే … ప్రతీక, ఒక జ్ఞాపిక;

అంతేనా? పాటలో, ప్రేమలో, చిన్నపిల్లల కళ్ళలో

క్షణక్షణమూ కొత్తగా మనకి మనం చేసుకునే ప్రమాణం,

విశాలగగనం మీదా, రోదించే సముద్రం మీదా,

వేకువనే వికసించిన ప్రతి పువ్వుమీదా,

ఆకసంలోని విరిసిన ఇంద్రధనుసుమీదా

స్పష్టంగా కనిపించే … భగవంతుని సంతకం.

.

గోవింద కృష్ణ చెత్తూర్

(24th April 1898 –  3rd March 1936)

భారతీయ కవి

Photo Courtesy: https://www.geni.com/people/Govinda-Krishna-Chettur/6000000003146958378

What is Beauty

.

A sign, that of the living whole, we make

A part incorporate, however small;

A fragment of the passion that doth fall

In sudden splendour upon hill or lake:

A symbol,  a remembrancer to awake

The sleeping godhead to a memory

Of what has been, and what again shall be,

And still the heart’s intolerable ache.

Nay more; a pledge, renewed from hour to hour

In song, in love, in dream, in children’s eyes;

Writ on the laughing heavens, the sorrowing sea;

Sealed  on the morning face of every flower;

And, even as the rainbow in the skies,

A covenant of God’s integrity.

.

Govinda Krishna Chettur

(24th April 1898 –  3rd March 1936)

First Generation Indo-Anglian Poet

(Former Principal, Govt. College Mangalore)

Works: Poetry:

Sounds and Images (1921);

The Triumph of Love (1932);

Gumataraya and other Sonnets for all Moods(1932);

The Temple Tank and other Poems(1932)

Altars of Silence (1935)

and The Shadow of God (1934).

Short Stories:

The Ghost City (1932)

Memoirs:

The Last  Enchantment

Poem Courtesy:

https://archive.org/details/indiancontributi030041mbp/page/n88

(The Indian Contribution to English Literature by  K R Srinivasa Iyengar, Karnatak Publishing House, Bombay- 4, 1945, p88)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: