(యుద్ధసమయం)
మళ్ళీ వానలు పడతాయి, నేల మంచి వాసన వేస్తుంది.
పిచ్చుకలు ఎప్పటిలా కిచకిచమంటూ తిరుగుతుంటాయి.
రాత్రిపూట చెరువుల్లో కప్పలు బెక బెక మంటాయి
నిగ నిగ మెరుస్తూ చెట్లకు పళ్ళు కాస్తాయి
రాబిన్ లు ఎప్పటిలా అగ్నిశిఖలాంటి ఈకలతో
వాలిన దండెం మీద నచ్చిన ఊసులాడుకుంటాయి.
ఒక్కడికికూడా యుద్ధం గురించి తెలియదు; చివరకి
అదెప్పుడు ముగిసిందోకూడా ఏ ఒక్కడికీ పట్టదు.
మానవజాతి సమూలంగా నాశనమైనా
చెట్టుకిగాని, పిట్టకుగాని ఏ దిగులూ ఉండదు.
అంతెందుకు, తెల్లవారుతూనే అడుగుపెట్టిన వసంతంకూడా
మనమెవ్వరమూ ఇక్కడలేమన్న విషయం గ్రహించేస్థితిలో ఉండదు.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

స్పందించండి