ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది
ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను.
అయినా, ఆ రసప్రవాహంలో
ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు.
ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం
అంత మైమరపించే సంగీతంలోనూ
ఇన్నేళ్ళవుతున్నా ఒక్క అపస్వరమూ
దొర్లకుండా ఎలా కొనసాగించగలుగుతున్నదన్నదే!
… ఓహ్! పాడుతున్న పిట్ట మాత్రం ‘ఒక్కటి ‘ కాదు.
అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది.
దానితో పాటే నా కంటే ముందు
ఆ పాటని విన్నవాళ్ళు కూడా.
.
థామస్ హార్డీ
(2 June 1840 – 11 January 1928)
ఇంగ్లీషు కవి

స్పందించండి