ఒక పొద్దుగ్రుంకిన వేళ … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి సూర్యాస్తమయాన్ని చూడడానికి ఒకరోజు పరుగెత్తి ఒక కొండ శిఖరానికి చేరాను. ఎగసిపడుతున్న సముద్రపుటలల్లా, దిక్కుల చివరవరకూ రక్తవర్ణంతో కొన్నీ, పసిడి అంచులతో కొన్నీ, రకరకాల కాంతులతో మండుతున్న మంటల్ని అదుపుచెయ్యడానికి తూర్పునుండి పడమరకీ, ఉత్తరంనుండి దక్షిణానికీ మేఘాలు ఎలా దొర్లుకుంటూ వెల్లువెత్తాయని! అయినా కీలలు ఆరలేదు సరికదా, భూమ్యాకాశాలు అంటుకుని వెర్రిగా హాహాకారాలు చేస్తున్నట్టు పైపైకి విజృంభించి లేస్తున్నాయి. ఒక్క క్షణం ఏమీపాలుపోక భయంతో అక్కడే నిలబడిపోయాను. “దాడి” అని అరుస్తూ రెండు ఆదిమ వైరి వర్గాలు కలహించుకుని ఒకర్నొకరు నాశనం చేసుకుని, ఆ శిధిలాలు తగలబడిపోతున్నట్టు, నా చెవుల్లో పిడుగుల్లాంటి వారి వింటి నారి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. క్రమంగా ఆ తమాషా సద్దుమణిగింది. సూర్యుడి కట్టకడపటి కిరణాలు ఓ రెండు కొండశిఖరాల నడుమ వదలలేక వదలలేక తారట్లాడేయి. ఇక చూడాలి ఆ నగరాన్ని! బంగారం, రాగి మలాము పూసినట్లు పచ్చలు వెలుగు చిమ్ముతున్నట్టు కళ్ళముందు కనిపించింది. నీలి- ఎరుపుల కలయికలో అపురూపమైన మేళవింపులని బెనొజో గోజోలి తన ఆత్మలో దర్శించి, ఋషితుల్యులైన వీరుల్ని కుంచెతో సృష్టించినట్టు యెరూషలేముని కొత్తగా, ఎంత తన్మయత్వంతో చూశానో చెప్పలేను. క్రమంగా అంతరించిన నింగిలోని ధగధగలకు నేలమీద రంగులుకూడా తేటపడి, బంగారం, ఎరుపూ కొలిమి నలుపయ్యాయి; అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఎవరో గట్టిగా అరిచినట్టు వినిపించింది: “మట్టినుండి మట్టిలోకి, బూడిదనుండి బూడిదలోకి అంతా ప్రశాంతత!” . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 Sep 1866 – 30 Apr 1925 అమెరికను కవయిత్రి . One Sunset . Swift to the mountain’s highest point I sped To watch the sunset. How the clouds rolled forth! Like hungry billows, purple, crested red, They swept from east to west, from north to south, Quenching the multi-coloured fires whose flare Lighted the whole horizon. But again The flames leaped- fiercely now- ‘til earth and air In wild delirium seemed, from dreams of pain. Frightened I stood there, for the moment dazed, As though mine ears some thundering chord had heard Above a crash of worlds whose ruins blazed, Accompaniment to one primeval word- War! The pageant faded, but the sun’s last rays Still lingered on the clouds between two hills, When lo a city, gold and chrysoprase And jasper, spread before me. With what thrills I seemed to see a new Jerusalem, Such as Gozzoli in his vision shows, With hero-saints, as he has painted them, On charges with the trappings blue and rose. And then the colours from the afterglow Died down to softest shades, umber and rust, Turning to grey; and all was calm as though I heard: Ashes to ashes, dust to dust- Peace! . Antoinette de Coursey Patterson, American Poem Courtesy: https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/70 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిసెప్టెంబర్ 20, 2019