వీడ్కోలూ- స్వాగతమూ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
గొంతులో కమ్మని పాటతో, రంగురంగుల నీ రెక్కలు
ఎండలో తళుకులీనుతున్నప్పుడు నన్ను విడిచి వెళ్లిపోయావు.
రెక్కలు విరిగి, రంగులన్నీ తమ తళుకు కోల్పోయి
గొంతులో పాట గొంతులో ఇంకి, ఇపుడు తిరిగి వచ్చావు.
అయినా సరే, నీకు స్వాగతం. ఇల్లు నీకోసం తెరిచే ఉంటుంది.
కళ్ళు కన్నీరు చెమర్చవచ్చు, పెదాలు నవ్వుతూనే పలుకరిస్తాయి
నేను కన్న కలలకి ఎన్నటికీ మరుపు అన్నమాట ఉండదు
అప్పటి నీ తియ్యని పాట ఇంకా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
Vale Atque Ave (Farewell and the Hail)
.
You left me, like a bird with song clear-spoken,
All its brave plumage glinting in the sun.
You come to me again, with pinion broken,
The colours tarnished and the song all done!
I welcome you! Wide open in my casement,
And smiles shall greet you, though the tears may start,
The dream I dreamed can suffer no effacement,
Your once sweet songs still echo in my heart.
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/55