అపార్థం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
పగటికి ప్రేమగా, అపురూపంగా చూసే హృదయ ముందనీ
రాత్రి ఏమీపట్టనట్టు, మౌనంగా ఉంటుందని అందరూ అంటారు
కానీ, నేను చాలా సార్లు రాత్రి వెళ్లిపోయిన తర్వాత
ఆమె కన్నీటి బిందువులు పువ్వులమీదా, గడ్డిమీదా చూశాను.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.