ఈ కవితలో lighted wood అన్న పదం మీద ఉపయోగించిన శ్లేష గమనించదగ్గది. ఒకటి చెక్కలతో చేసిన రంగస్థలాన్ని సూచిస్తే, రెండవది చప్పుడులేకుండా చిరుగాలికి లాస్యంచేస్తూ మండుతున్న కట్టె అయి ఉండొచ్చునని నా అభిప్రాయం. మీరు గమనించి ఉంటే, బాగా ఎండిన కట్టెమీది మంట ఒక్కోసారి మండుతున్నంతమేరా కట్టెను తాకీ తాకనట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అంటే, ఒక నృత్యం కవయిత్రికి అద్భుతమైన మరొక నృత్యాన్ని గుర్తుకు తెచ్చిందన్నమాట.
స్పందించండి