మనవి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
విరివిగా వాడడంవల్ల అరిగి అరిగి, నీ చేతికి అలవాటై,
నీ అవసరానికి తగినట్టు మలచబడిన పనిముట్టునవాలనీ,
నీ సేవకై నన్ను అలవోకగా వినియోగించుకోమనీ నా వినతి.
నిగనిగలాడే నీ జీవితపు రంగురంగుల కలనేత వస్త్రంలో
నన్నొక గుర్తింపులేని దారపుపోగుగా మసలనీ;
ఆ రంగురంగులమిశ్రమంలో నేనూ ఒక కణాన్నై
దాగి, చిరకాలం ఆ రంగుల్ని స్ఫుటంగా ప్రతిఫలిస్తాను.
నీ పగటికలల్లో నేనూ విహరించాలని నా ఆకాంక్ష,
మొయిలుదారులలో నువ్వు పరుచుకున్న మెట్ల అంచున,
దివ్యమైన వెన్నెల ప్రవాహపు పరవళ్ళలో
తారకాసముదయాలు వెలవెలబోతున్నప్పుడు
అధిరోహిస్తున్ననీ అడుగులు జారకుండా ప్రాపుగా ఉంటాను.
కానీ, నువ్వు అడుగులు వేస్తున్న సోపానాలనీ,
నగగనాంతరసీమలకు నీ రక్షణనీ మరిచిపోవద్దు.
.
ఏమీ లోవెల్
(February 9, 1874 – May 12, 1925)
అమెరికను కవయిత్రి.
.

.
A Petition
.
I pray to be the tool which to your hand
Long use has shaped and moulded till it be
Apt for your need, and, unconsideringly,
You take it for its service. I demand
To be forgotten in the woven strand
Which grows the multi-coloured tapestry
Of your bright life, and through its tissues lie
A hidden, strong, sustaining, grey-toned band.
I wish to dwell around your daylight dreams,
The railing to the stairway of the clouds,
To guard your steps securely up, where streams
A faery moonshine washing pale the crowds
Of pointed stars. Remember not whereby
You mount, protected, to the far-flung sky.
.
Amy Lowell
(February 9, 1874 – May 12, 1925)
American Poet
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే