
వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో వచ్చిన గొప్ప కవితలలో ఇదొకటి. యుద్ధంలో స్వయంగా పాల్గొని, మృత్యువుని దగ్గరగా చూసిన అనుభవంతో యుద్ధం ఎంత నిష్ప్రయోజనమో ససూన్ చాలా చక్కగా వివరించడంతో పాటు, అందులో పాల్గొనకుండా, యుద్ధాన్ని గొప్పగా కీర్తించే వాళ్ళ ఆత్మవంచన స్వభావాన్ని ఎండగడుతుంది ఈ కవిత.
.
బిషప్ మాతో ఇలా అన్నాడు: “వాళ్ళు యుద్ధం నుండి తిరిగొచ్చేక
మునపటిలా ఉండరు; కారణం వాళ్ళు క్రీస్తుకి వ్యతిరేకులపై
చిట్టచివరి ధర్మ యుద్ధం చెయ్యడానికి వెళ్ళేరు;
వాళ్లు కళ్ళజూసిన తోటి సైనికుల రక్తం
జాతి తలెత్తుకు జీవించడానికి కొత్త అధికారాన్నిచ్చింది.
వాళ్ళు మృత్యువుకి ఎదురునిలిచి మరీ పోరాడేరు.”
“అవును, మాలో ఎవ్వరం మునపటిలా లేము,” అన్నారు కుర్రాళ్ళు.
“జార్జికి రెండు కాళ్ళూ పోయాయి; బిల్ కి కళ్ళు అసలు కనపడవు,
పాపం ఊప్రితిత్తులలోంచి గుండు దూసుకెళ్ళి, జిం చావే నయమనుకుంటున్నాడు;
బెర్ట్ కి సిఫిలిస్ వ్యాధి సోకింది. అసలు యుద్ధానికి వెళ్ళిన వాడు
ఒక్కడైనా ఏదో ఒకటి పోగొట్టుకోకుండా తిరిగొస్తే ఒట్టు!”
దానికి బిషప్, “భగవంతుని లీలలు చిత్రంగా ఉంటాయి!” అన్నాడు.
.
సీ ప్రై ససూన్
(8 September 1886 – 1 September 1967)
ఇంగ్లీషు కవి
.

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm
.
‘They’
.
The Bishop tells us: ‘When the boys come back
‘They will not be the same; for they’ll have fought
‘In a just cause: they lead the last attack
‘On Anti-Christ; their comrades’ blood has bought
‘New right to breed an honourable race,
‘They have challenged Death and dared him face to face.’
‘We’re none of us the same!’ the boys reply.
‘For George lost both his legs; and Bill’s stone blind;
‘Poor Jim’s shot through the lungs and like to die;
‘And Bert’s gone syphilitic: you’ll not find
‘A chap who’s served that hasn’t found some change.
‘ And the Bishop said: ‘The ways of God are strange!’
.
Siegfried Sassoon
(8 September 1886 – 1 September 1967)
English Poet and Soldier
Poem Courtesy:
https://allpoetry.com/’They‘

మళ్ళీ వానలు పడతాయి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
(యుద్ధసమయం)
మళ్ళీ వానలు పడతాయి, నేల మంచి వాసన వేస్తుంది.
పిచ్చుకలు ఎప్పటిలా కిచకిచమంటూ తిరుగుతుంటాయి.
రాత్రిపూట చెరువుల్లో కప్పలు బెక బెక మంటాయి
నిగ నిగ మెరుస్తూ చెట్లకు పళ్ళు కాస్తాయి
రాబిన్ లు ఎప్పటిలా అగ్నిశిఖలాంటి ఈకలతో
వాలిన దండెం మీద నచ్చిన ఊసులాడుకుంటాయి.
ఒక్కడికికూడా యుద్ధం గురించి తెలియదు; చివరకి
అదెప్పుడు ముగిసిందోకూడా ఏ ఒక్కడికీ పట్టదు.
మానవజాతి సమూలంగా నాశనమైనా
చెట్టుకిగాని, పిట్టకుగాని ఏ దిగులూ ఉండదు.
అంతెందుకు, తెల్లవారుతూనే అడుగుపెట్టిన వసంతంకూడా
మనమెవ్వరమూ ఇక్కడలేమన్న విషయం గ్రహించేస్థితిలో ఉండదు.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
.

.
There Will Come Soft Rains
(War Time)
.
There will come soft rains and the smell of the ground,
And swallows circling with their shimmering sound;
And frogs in the pools singing at night,
And wild plum trees in tremulous white,
Robins will wear their feathery fire
Whistling their whims on a low fence-wire;
And not one will know of the war, not one
Will care at last when it is done.
Not one would mind, neither bird nor tree
If mankind perished utterly;
And Spring herself, when she woke at dawn,
Would scarcely know that we were gone.
.
Sara Teasdale
(August 8, 1884 – January 29, 1933)
American Poet
Poem Courtesy:
https://poets.org/poem/there-will-come-soft-rains
అదే పాట… థామస్ హార్డీ , ఇంగ్లీషు కవి
ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది
ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను.
అయినా, ఆ రసప్రవాహంలో
ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు.
ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం
అంత మైమరపించే సంగీతంలోనూ
ఇన్నేళ్ళవుతున్నా ఒక్క అపస్వరమూ
దొర్లకుండా ఎలా కొనసాగించగలుగుతున్నదన్నదే!
… ఓహ్! పాడుతున్న పిట్ట మాత్రం ‘ఒక్కటి ‘ కాదు.
అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయింది.
దానితో పాటే నా కంటే ముందు
ఆ పాటని విన్నవాళ్ళు కూడా.
.
థామస్ హార్డీ
(2 June 1840 – 11 January 1928)
ఇంగ్లీషు కవి

.
A bird sings the selfsame song,
With never a fault in its flow,
That we listened to here those long
Long years ago.
A pleasing marvel is how
A strain of such rapturous rote
Should have gone on thus till now
unchanged in a note!
–But its not the selfsame bird.–
No: perished to dust is he….
As also are those who heard
That song with me.
.
Thomas Hardy
(2 June 1840 – 11 January 1928)
English Poet
Poem Courtesy:
https://www.poemhunter.com/thomas-hardy/poems/
తొలకరి జల్లు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
నులివెచ్చని తొలకరి వర్షమా! సన్నగా మృదువుగా
రాలే నీ జల్లుకై పులకరిస్తూ నా ముఖాన్ని ఎదురొడ్డుతున్నాను.
అవ్యాజమైన నీ ప్రేమనీ, సామర్థ్యాన్నీ నా మనసు గ్రహించాలనీ
మంచుసోనలవంటి స్వచ్ఛమైన కలలు కనాలనీ కోరుకుంటున్నాను.
కలలు దారితప్పినా, మంచుతెరలలో చిక్కిన ప్రేమలా
అందంగా, చక్కగా, తారకలంత సన్నని మెరుపుతోనో;
రాజమార్గంమీదా, సెలయేటిగట్లమీది దట్టమైన చెట్లమధ్యా,
ఎక్కడపడితే అక్కడ అడవిపూలతీగలా అల్లుకుని
చామంతిపూలంత పచ్చని వెలుగులు వెదజల్లాలనీ కోరుకుంటున్నాను…
లేకపోతే వాటికి అంత మెరుపు ఎక్కడనుండి వస్తుంది?
నీ అమృతవృష్టి జీవితపు హాలాహలాన్ని అణగార్చి
మనోమిత్తికకు మంచి బీజములు మొలకేత్తే యోగ్యత అనుగ్రహిస్తుంది.
ఓ అమృత ధారా! తనివితీరా కురువు! కురిసి కురిసి
పూలవంటి ఆలోచనలు నాలో విరిసి జీవంతో తొణికిసలాడనీ!
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
To The Spring Rain
.
O warm Spring rain, to thee I lift my face,
Courting thy touch beneficient and light.
Would that this soul might feel thy pow’r and grace,
And dreams like snowdrops blossom pure and white.
Or errant ones, if they be sweet and fair
Like love-caught-in-the-mist, with starry gleam,
Or the wild rose that clambers everywhere
Along the highway and the wooded stream.
And golden visions, such as Daffodils
Must have… or whence is all their sunny glow?
Thy elixir might overcome life’s ills
And fit the soil for all good seed to grow
Within my soul. Fall gracious rain, and give
Me thoughts like flowers. Let them bloom and live!
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American Poet
.
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/65

ఆశాంతి … సిసీలియా బొరోమియో, ఫిలిప్పీన్ కవయిత్రి
చావుకీ, బ్రతుకుకీ మధ్య వేలాడే శూన్యంలో
ఎవరికీ కనపడకుండా ఉండాలని దొరికిన ఆధారాన్ని పట్టుకుని
ఒకమూలకి ఒదుక్కుని ఉంటాము;
మన మాటలకీ, చేతలకీ మధ్యనున్న సంబంధం
మనం అర్థం అయిందనుకున్నంతమట్టుకు, ఒక సాలెగూడు అల్లుకుంటాం
చివరకి అపార్థాలే మిగిలినా;
వెంటనే దృష్టిపెట్టవలసిన అవసరాలూ,
మనం ఆవేశంతో జరిపే చర్చల …
సందిగ్ధ జారుడుతలం మీద నడుస్తూ
నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను
“ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టు?”
.
సిసీలియా బొరోమియో,
సమకాలీన ఫిలిప్పీన్ కవయిత్రి
Cecilia_Borromeo
Filipino Poetess
.
Restless
.
It is that perennial immateriality dwelling between living and dying
crouched in the corners and grappling by the hinges
only to remain unseen;
We weave our web of what we believe we understand
of the relationship of our acts and events
only to remain misunderstood;
From that odd wisp of steam of heated discussions
to the urgent hiss of a new page calling;
I teeter on that thin ice —
That single space of uncertainty —
And I ask
“What am I doing here?”.
.
Cecilia Borromeo
Contemporary Filipino Poetess
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/cecilia_borromeo/poems/21841
Cecilia Borromeo was born in Cagayan de Oro City, Philippines. She now lives in Brussels, Belgium where she has been based for the past 7 years and where she has fulfilled her dream to become a scientist (currently: unemployed). Her poems and prose are widely read in her personal blog Clearcandy Daily (http://welcometoappleciders.blogspot.com) and dreams to get her work in print someday soon. She is known to write from the heart and is continuously training herself to meet her imagination so she can continue her love affair with words and to mold them to mean different things. She draws inspiration mostly from her own experiences and is in awe of her favorite poet, Mark Strand. After a tough day of surfing the net for jobs, she loves to lie in her couch for the rest of the evening thinking of chocolates and waffles. When not consumed by sugary thoughts, she enjoys diabetes literature, islet amyloidosis, reading poems out loud, learning the violin and dancing around the apartment.
ఒక పొద్దుగ్రుంకిన వేళ … ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
సూర్యాస్తమయాన్ని చూడడానికి ఒకరోజు పరుగెత్తి
ఒక కొండ శిఖరానికి చేరాను. ఎగసిపడుతున్న సముద్రపుటలల్లా,
దిక్కుల చివరవరకూ రక్తవర్ణంతో కొన్నీ, పసిడి అంచులతో కొన్నీ,
రకరకాల కాంతులతో మండుతున్న మంటల్ని అదుపుచెయ్యడానికి
తూర్పునుండి పడమరకీ, ఉత్తరంనుండి దక్షిణానికీ
మేఘాలు ఎలా దొర్లుకుంటూ వెల్లువెత్తాయని! అయినా
కీలలు ఆరలేదు సరికదా, భూమ్యాకాశాలు అంటుకుని వెర్రిగా
హాహాకారాలు చేస్తున్నట్టు పైపైకి విజృంభించి లేస్తున్నాయి.
ఒక్క క్షణం ఏమీపాలుపోక భయంతో అక్కడే నిలబడిపోయాను.
“దాడి”
అని అరుస్తూ రెండు ఆదిమ వైరి వర్గాలు కలహించుకుని ఒకర్నొకరు
నాశనం చేసుకుని, ఆ శిధిలాలు తగలబడిపోతున్నట్టు,
నా చెవుల్లో పిడుగుల్లాంటి వారి వింటి నారి చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.
క్రమంగా ఆ తమాషా సద్దుమణిగింది. సూర్యుడి కట్టకడపటి కిరణాలు
ఓ రెండు కొండశిఖరాల నడుమ వదలలేక వదలలేక తారట్లాడేయి.
ఇక చూడాలి ఆ నగరాన్ని! బంగారం, రాగి మలాము పూసినట్లు
పచ్చలు వెలుగు చిమ్ముతున్నట్టు కళ్ళముందు కనిపించింది.
నీలి- ఎరుపుల కలయికలో అపురూపమైన మేళవింపులని
బెనొజో గోజోలి తన ఆత్మలో దర్శించి, ఋషితుల్యులైన వీరుల్ని
కుంచెతో సృష్టించినట్టు యెరూషలేముని
కొత్తగా, ఎంత తన్మయత్వంతో చూశానో చెప్పలేను.
క్రమంగా అంతరించిన నింగిలోని ధగధగలకు
నేలమీద రంగులుకూడా తేటపడి, బంగారం, ఎరుపూ
కొలిమి నలుపయ్యాయి; అంతటా నిశ్శబ్దం ఆవరించింది.
ఎవరో గట్టిగా అరిచినట్టు వినిపించింది:
“మట్టినుండి మట్టిలోకి, బూడిదనుండి బూడిదలోకి
అంతా ప్రశాంతత!”
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
One Sunset
.
Swift to the mountain’s highest point I sped
To watch the sunset. How the clouds rolled forth!
Like hungry billows, purple, crested red,
They swept from east to west, from north to south,
Quenching the multi-coloured fires whose flare
Lighted the whole horizon. But again
The flames leaped- fiercely now- ‘til earth and air
In wild delirium seemed, from dreams of pain.
Frightened I stood there, for the moment dazed,
As though mine ears some thundering chord had heard
Above a crash of worlds whose ruins blazed,
Accompaniment to one primeval word-
War!
The pageant faded, but the sun’s last rays
Still lingered on the clouds between two hills,
When lo a city, gold and chrysoprase
And jasper, spread before me. With what thrills
I seemed to see a new Jerusalem,
Such as Gozzoli in his vision shows,
With hero-saints, as he has painted them,
On charges with the trappings blue and rose.
And then the colours from the afterglow
Died down to softest shades, umber and rust,
Turning to grey; and all was calm as though
I heard: Ashes to ashes, dust to dust-
Peace!
.
Antoinette de Coursey Patterson,
American
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/70
అడవిలో ఒక దృశ్యం… ఏంటొనెట్ డికూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఒహ్! ఎంత అద్భుతమైన దృశ్యం! పాపం ఇరుకైన
నగర సీమల్లో కమ్మని కలలకికూడా కరువే.
చుక్కల్ని తలలో తురుముకుంటున్న ఈ ‘ఫర్ ‘ చెట్లముందు
చర్చి గోపుర శిఖరాలుకూడా అంత పవిత్రత నోచుకో లేకున్నాయి.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
In the Forest
Ah, the forest visions! Poor and lowly
Are the dreams within a city’s bars,
Where cathedral spires seem less holy
Than these fir trees tipped with stars.
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/64
వీడ్కోలూ- స్వాగతమూ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
గొంతులో కమ్మని పాటతో, రంగురంగుల నీ రెక్కలు
ఎండలో తళుకులీనుతున్నప్పుడు నన్ను విడిచి వెళ్లిపోయావు.
రెక్కలు విరిగి, రంగులన్నీ తమ తళుకు కోల్పోయి
గొంతులో పాట గొంతులో ఇంకి, ఇపుడు తిరిగి వచ్చావు.
అయినా సరే, నీకు స్వాగతం. ఇల్లు నీకోసం తెరిచే ఉంటుంది.
కళ్ళు కన్నీరు చెమర్చవచ్చు, పెదాలు నవ్వుతూనే పలుకరిస్తాయి
నేను కన్న కలలకి ఎన్నటికీ మరుపు అన్నమాట ఉండదు
అప్పటి నీ తియ్యని పాట ఇంకా గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
Vale Atque Ave (Farewell and the Hail)
.
You left me, like a bird with song clear-spoken,
All its brave plumage glinting in the sun.
You come to me again, with pinion broken,
The colours tarnished and the song all done!
I welcome you! Wide open in my casement,
And smiles shall greet you, though the tears may start,
The dream I dreamed can suffer no effacement,
Your once sweet songs still echo in my heart.
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/55