(ఐరిష్) ద్వీపకల్పం… సీమస్ హీనీ, ఐరిష్ కవి
కవీ! నీకు చెప్పడానికి ఏమీ లేనపుడు, ఒకరోజు
రోజల్లా ఈ ద్వీపకల్పం చుట్టూ కారులో తిరిగి రా.
ఆకాశం నీకు రాజమార్గంలా ఎదురుగా ఎత్తుగా కనిపిస్తుంది
కానీ ఎక్కడా గమ్యం గుర్తులుండవు గనుక ఆగే పని లేదు.
కానీ, ఏ క్షణంలోనైనా జారి దొర్లిపోవచ్చన్న భయంతో నడుపు.
చీకటిపడేసరికి, దిగంతాలు సముద్రాన్నీ కొండల్నీ మింగేస్తాయి,
దున్నిన పొలం, పక్కనే సున్నంకొట్టిన భవనాన్ని మింగేస్తుంది
నువ్వు ఎలాగూ చీకట్లోనే కారు నడపవలసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి
మెరిసే సముద్రతీరాన్నీ, చెట్లచివర కనిపించే కాంతివలయాన్నీ,
ఉధృతంగా లేచిన అలలు భళ్ళున పగిలి బిందువులైన బండరాళ్ళనూ,
తమ పొడవైన కాళ్ళమీద విలాసంగా నిలబడే నీటి పక్షుల్నీ,
పొగమంచులోకి తామే ప్రయాణిస్తున్నట్టు కనిపించే ద్వీపాల్నీ తలుచుకో.
ఇపుడిక ఇంటిముఖం పట్టు. ఇప్పటికీ చెప్పడానికేమీ ఉండదు
ఒక్కటి తప్ప: ఇపుడు నువ్వు చిమ్మ చీకటిలో ఎటువంటి దృశ్యాన్ని చూసినా
అదేమిటో, నునుపుదేరినట్టున్న వాటి ఆకారస్వరూపాన్ని బట్టి పోల్చుకోగలవు
జలవనరులూ, నేలా అయితే మరి చెప్పనక్కరలేదు, అన్నిటికంటే మరీ సులువు.
.
సీమస్ హీనీ
13 April 1939 – 30 August 2013
ఐరిష్ కవి.

.
The Peninsula
.
When you have nothing more to say, just drive
For a day all around the peninsula.
The sky is tall as over a runway
The land without marks so you will not arrive.
But pass through, though always skirting landfall.
At dusk, horizons drink down sea and hill,
The ploughed field swallows the whitewashed gable
And you are in the dark again. Now recall
The glazed foreshore and silhouetted log,
That rock where breakers shredded into rags,
The leggy birds stilted on their own legs,
Islands riding themselves out into the fog.
And drive back home, still with nothing to say
Except that now you will uncode all landscapes
By this: things founded clean on their own shapes,
Water and ground in their extreme..
.
Seamus Heaney
13 April 1939 – 30 August 2013
Irish Poet
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి