అనువాదలహరి

ముఖాలు… కేథరీన్ సావేజ్ బ్రాజ్మన్, అమెరికను కవి

బ్రిటిష్ మ్యూజియం లో

ఈజిప్టునుండి ఇక్కడికి ప్రయాణంచేసి,

మ్యూజియంలో రాతిమీద, కర్రమీద

శాశ్వతంగా చిత్రించబడ్డ పురాతన

మానవకళేబరాల్ని చూడడానికి వచ్చి

అలవాటుగా కిటికీలోంచి మృదువుగా ప్రవహిస్తున్న

నగరదృశ్యాన్ని ఒంటరిగా పరికిస్తున్నాను.

శీతకాలమైనా ఎండ చురుక్కుమంటోంది.

వసారాలో పావురాలు అటూఇటూ ఎగురుతూ రెక్కలతో

ఆకాశంవంక గుడ్లప్పగించి చూస్తూ

విశ్రాంతి లేకుండా ప్రాంగణాన్ని శుభ్రంచేస్తున్నాయి.

లోపలికి ప్రవేశించి, సంప్రదాయంగా కనిపిస్తున్న

మేధావుల్నీ, జపనీస్ యాత్రికులప్రవాహాన్ని తప్పుకుని,

టిక్కట్టుతీసుకుని, బారులుతీరిన సుందర చైతన్య

మానవప్రవాహాన్ని దాటి, అక్కడ అడుగుపెట్టడానికి

మృత్యువుసైతం క్షణకాలం వెనుకాడే

కళేబరాల భద్రమందిరంలో ప్రవేశించాను.

ఆ శరీరాల సారూప్యతకి మృత్యువుకూడా తడబడి

ఆత్మలు లేచి ముందుకు సాగేదాకా నిరీక్షిస్తుందేమో.

ఎవ్వరీ బాలుడు, ఇంకా తను ఎదగని యవ్వన రూపాన్ని

కలగంటున్నది? ఎవ్వరీ తరుణీమణి

ఒత్తైన ఉంగరాలజుత్తుతో, పెళ్ళికూతురులా

పచ్చలుపొదిగిన బంగారునగలు అలంకరించుకుని,

సమాధిని వరించింది? అతినాగరీకమైన రోమను

దుస్తులు ధరించిన ఈ యువకుడు, సొగసుగా ఉన్నా

మెచ్చుకోదగ్గ దుస్తుల్లో సన్నగా గొట్టంలా కనిపిస్తూ

ముఖం అటుతిప్పుకున్నాడు, ఏడవడానికేమో?

మరొక ముఖం అచ్చం మా నాన్నదిలా ఉంది

విచారంలో ఉన్నప్పుడు రాత్రీ పగలూ ఒకేపనిగా

ఆలోచిస్తూంటే అతని నుదురు అలాగే ముడతలుపడేది.

ఇపుడు నాకన్నా, శాశ్వతంగా, యువకుడు తను.

మనసులోనే పోయిన నా ఆప్తుల్ని రూపించుకున్నాను

ఉత్తరలోకాల్లోకి వాళ్ళ జ్ఞాపకాలుకూడా అనుసరిస్తాయా

అని ఊహిస్తూ. వాళ్ళకి ఇవేవీ పట్టవు.

మనకి అందరు. ఊహల నీడల్లో కరిగిపోతారు.

నన్ను నేను కాలంలో కరిగిపోవడాన్ని ఊహించుకున్నాను.

అదోశుష్కమైన ఆలోచన. ఇక్కడ గాలి ఆడటం లేదు.

ఇక్కడన్నీ తీర్చి దిద్ది లోపరహితంగా ఉన్నాయి.

మృత్యువులో పవిత్రంగా. కనిపించని రెక్కలు

గాలిలోకి ఎగిరిపోతాయి. గోడలమీది జంతువులు

మనం వీటివంక కన్నార్పకుండా చూడడం చూసి

అయితే అవి బాగున్నాయి అనుకుంటాయి. నాతో పాటే బయటకి

ఒక స్తబ్దత వెంటవచ్చింది… పావురాలు మౌనంగా ఉన్నాయి.

నా గాఢమైన కోరికలన్నీ కళగా రూపొందాయి.

ముగ్గురు దేవతలకీ * ఆ నైవేద్యంతో సంతృప్తి కలిగింది.

.

(*మనకి బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల్లాగే, గ్రీకు- రోమను పురాణ గాథల ప్రకారం మనిషి పుట్టుకనుండి మరణందాకా Clotho, Lachesis, and Atropos అని ముగ్గురు Fates (దేవతలు) శాసిస్తారు. ఆ ముగ్గురు గురించీ కవయిత్రి చెబుతున్నది.)

.

కేథరీన్ సావేజ్ బ్రాజ్మన్ 

జననం 1934

అమెరికను కవయిత్రి

.

Faces

In the British Museum

Alone and watching from the window

of my singularity the milky, eddying

cityscape, I’ve come to see the mummy

faces painted on the wood and stone

of immortality, traveling from Egypt

here. The sun is bright for winter;

in the courtyard, pigeons scavenge

ceaselessly, fluttering down and up,

flashing captive pupils at the sky.

I enter, make my way through tweedy

scholars and the tides of Japanese,

pay, and pass beyond the spectacles

of moving lives, into a burial-house

where even death demurred a moment,

hesitating at the body’s likenesses,

and let the spirits rise and travel

Who is this child, still wistful

for the man unlived? This woman,

rich in ringlets, gold, and emeralds,

adorned as for her husband, married

to the tomb? A youth in fashionable

Roman garments, comely but tubercular

beneath his laurelled wrappings, turns

his eyes away as if to weep. Another

face could be my father’s furrowed

deep in distresses of his being,

thinking back and forward into the night.

Forever, he is younger, now, than I.

In my mind I paint my dead, wondering

if remembrance accompanies them along

their underworld. They are untouched,

untouchable, mingling with the shades.

I paint myself in my dissolving time,

a glassy thought. The air is light;

all here seems distilled, perfected—

sacred in its dust. The absent wings

fly upward, and hieratic animals

who attend us gaze upon these images

and find them beautiful. A stillness

follows me outside—the pigeons mute,

my absolute desires changed into art,

the fates placated with the sacrifice.

Catharine Savage Brosman

Born 1934

American

Poem Courtesy:  http://louisianapoetryproject.org/faces/

(ఐరిష్) ద్వీపకల్పం… సీమస్ హీనీ, ఐరిష్ కవి

కవీ! నీకు చెప్పడానికి ఏమీ లేనపుడు, ఒకరోజు

రోజల్లా ఈ ద్వీపకల్పం చుట్టూ కారులో తిరిగి రా.

ఆకాశం నీకు రాజమార్గంలా ఎదురుగా ఎత్తుగా కనిపిస్తుంది

కానీ ఎక్కడా గమ్యం గుర్తులుండవు గనుక ఆగే పని లేదు.

కానీ, ఏ క్షణంలోనైనా జారి దొర్లిపోవచ్చన్న భయంతో నడుపు.

చీకటిపడేసరికి, దిగంతాలు సముద్రాన్నీ కొండల్నీ మింగేస్తాయి,

దున్నిన పొలం, పక్కనే సున్నంకొట్టిన భవనాన్ని మింగేస్తుంది

నువ్వు ఎలాగూ చీకట్లోనే కారు నడపవలసి వస్తుంది. ఇప్పుడు ఒకసారి

మెరిసే సముద్రతీరాన్నీ, చెట్లచివర కనిపించే కాంతివలయాన్నీ,

ఉధృతంగా లేచిన అలలు భళ్ళున పగిలి బిందువులైన బండరాళ్ళనూ,

తమ పొడవైన కాళ్ళమీద విలాసంగా నిలబడే నీటి పక్షుల్నీ,

పొగమంచులోకి తామే ప్రయాణిస్తున్నట్టు కనిపించే ద్వీపాల్నీ తలుచుకో.

ఇపుడిక ఇంటిముఖం పట్టు. ఇప్పటికీ చెప్పడానికేమీ ఉండదు

ఒక్కటి తప్ప: ఇపుడు నువ్వు చిమ్మ చీకటిలో ఎటువంటి దృశ్యాన్ని చూసినా

అదేమిటో, నునుపుదేరినట్టున్న వాటి ఆకారస్వరూపాన్ని బట్టి పోల్చుకోగలవు

జలవనరులూ, నేలా అయితే మరి చెప్పనక్కరలేదు, అన్నిటికంటే మరీ సులువు.

.

సీమస్ హీనీ

13 April 1939 – 30 August 2013

ఐరిష్ కవి.

.

The Peninsula

.

When you have nothing more to say, just drive

For a day all around the peninsula.

The sky is tall as over a runway

The land without marks so you will not arrive.

But pass through, though always skirting landfall.

At dusk, horizons drink down sea and hill,

The ploughed field swallows the whitewashed gable

And you are in the dark again. Now recall

The glazed foreshore and silhouetted log,

That rock where breakers shredded into rags,

The leggy birds stilted on their own legs,

Islands riding themselves out into the fog.

And drive back home, still with nothing to say

Except that now you will uncode all landscapes

By this: things founded clean on their own shapes,

Water and ground in their extreme..

.

Seamus Heaney

13 April 1939 – 30 August 2013

Irish Poet

Poem Courtesy:

https://www.pinterest.com/pin/202873158200100385/

నిండుచంద్రుడు… తూ ఫూ, చీనీ కవి

గోపురం మీద… ఒంటరిగా, రెండురెట్లు కనిపిస్తున్న చంద్రుడు.

రాత్రి నిండిన ఇళ్ళ వరుసలుదాటి, చల్లగా తగిలే నది కెరటాలమీద

నిలకడలేని వర్ణమిశ్రమాన్ని నలుదిక్కులా వెదజల్లుతున్నాడు.

అల్లికచాపలమీద చూస్తే పట్టువలకంటే మిన్నగా మెరుస్తున్నాడు.

ఆచ్ఛాదనలేని కొండ శిఖరాలు; అంతటా నిశ్శబ్దం. ఉన్న నాలుగు

చుక్కలమధ్యనుండీ అడుగుతడబడకుండా తేలిపోతున్నాడు. నా తాతలనాటి

తోటలో పైన్, లవంగ చెట్లు బాగా పెరిగాయి. ఎటుచూసినా వెలుగు వరద.

ఏకకాలంలో, పదివేల చదరపుమైళ్ల మేరా దాని కాంతిలో మునిగిపోయింది.

.

తూ-ఫూ

(712- 770)

చీనీ కవి

Full Moon

.

Above the tower — a lone, twice-sized moon.

On the cold river passing night-filled homes,

It scatters restless gold across the waves.

On mats, it shines richer than silken gauze.

Empty peaks, silence: among sparse stars,

Not yet flawed, it drifts. Pine and cinnamon

Spreading in my old garden . . . All light,

All ten thousand miles at once in its light!

.

Tu Fu (aka  Du Fu)

(712- 770)

Chinese Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/tu_fu/poems/2190

శిలగా మరణించాను… రూమీ, పెర్షియన్ కవి

నేను శిలగా మరణించేను కానీ మొక్కనై తిరిగి మొలకెత్తాను

నేను చెట్టుగా మరణించేను కానీ జంతువుగా తిరిగి పుట్టేను.

నేను జంతువుగా మరణించేను కానీ మనిషిగా తిరిగి జన్మించేను.

భయం దేనికి? మరణంలో పోగొట్టుకున్నదేమిటిట?

.

రూమీ

13 వ శతాబ్దం

పెర్షియన్ సూఫీ కవి

 

.

Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

.

A Stone I died

.

A stone I died and rose again a plant;

A plant I died and rose an animal;

I died an animal and was born a man.

Why should I fear? What have I lost by death?.

.

Rumi

13th Century

Persian Poet

Poem Courtesy:  https://allpoetry.com/A-Stone-I-died

గుప్పెడు మట్టి… హెన్రీ లూయీ వివియన్ డెరోజియో, భారతీయ (బెంగాలీ) కవి

అప్పటికి ఆకాశం లేతనీలిరంగు సంతరించుకుంది

గగన మండలం మీదకి సూర్యుడు ఇంకా అడుగుపెట్టలేదు.

చిటారుకొమ్మమీద కోయిల గొంతెత్తి ప్రభాతగీతమాలపిస్తోంది,

చిక్కని ఆకుపచ్చని ప్రకృతి సువాసనలతో గుబాళిస్తోంది.

జూలియన్, నేనూ అలా నడుచుకుంటూ నడుచుకుంటూ

ఈ నేల గర్వించే గొప్ప వ్యక్తి సమాధి దగ్గర ఆగేము.

శిలాఫలకం అతని పేరూ, వయసూ, ఘనతా ప్రకటిస్తోంది.

అతను సాధించిన ఘనకార్యాలకీ, అతనిమీద కురిపించిన

ప్రశంసల జల్లుకీ నాకు నోటమాట రాలేదు, నాకు తెలియకుండానే

అతని సాధనకీ, జీవిత విస్తృతికీ నాలో అసూయ పొడచూపింది:

ఎవరో గొప్పవ్యక్తి మాటలే, ‘మనిషొక మహత్తర సృష్టి ‘

అనీ నేనూ చిలకపలుకు పలికేను; జూలియన్ వొంగి

అక్కడనుండి కొంత మట్టిని తనచేతిలోకి తీసుకుని

ఇలా అన్నాడు, “చూడు! మనిషంటే మరేమీ కాదు, ఇది!”

.

హెన్రీ లూయీ వివియన్ డెరోజియో

(12th Aug 1809- 26th Dec 1831)

భారతీయ (బెంగాలీ) కవి

.

Dust

.

Of soft cerulean colour was the sky,

The sun had not yet risen o’er the scene,

The wild lark sang his morning hymn on high,

And heaven breathed sweetly o’er the foliage green

Julian and I walked forth, and soon we came

Unto the tomb of a high son of fame ;

The marble told his deeds, his years, and name.

Struck with his greatness, and the sounding praise

That was bestowed upon him, I began

Almost to envy him the race he ran:

Man is a noble work, the wise man says,

And so said I ; but Julian stooped, and took

Some dust up in his hand, and bade me look

Upon it well, and then he cried, ‘See, this is man !’

April, 1827

.

Henry Louis Vivian Derozio

(10 th Apr 1809*-  26th Dec 1831) 

Indo-Anglian Poet, 

The DOB has been corrected vide reference to Prof KR Srinivasa Iyyengar’s book (https://archive.org/details/indiancontributi030041mbp/page/n38) Page 9.
Some of the other references state it as 18th Apr 1809.

పేదరికం… మూన్ బ్యూంగ్ రాన్, దక్షిణ కొరియా కవి

మనందరికీ తెలిసినదే

నాలుగు చెలకలైనా వరిపొలం లేని రైతుకి

ఎంతశ్రమో నలుగురు పిల్లల్ని పెంచి బడికి పంపించాలంటే.

తనకంటూ ఇల్లులేని, నగరంలోని గృహస్థు

ఇల్లు సంపాదించుకుందికి జీవితమంతా

ఎన్ని కష్టనష్టాలు పడతాడో కూడా తెలుసు.

పిల్లల్ని పెంచిన వారందరికీ తెలుసు

నలుగురు పిల్లల్ని పెంచాలంటే

అందరిలాగే బడికి పంపించాలంటే

వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే

ఒళ్ళు తెగకోసుకోవడం లాంటిదని.

ఓ పిల్ల పెళ్ళిచెయ్యాలంటే, ఒక ఇంటిస్తంబం మాయమౌతుంది,

కుర్రాణ్ణి కాలేజీకి పంపాలంటే ఒక పొలం అమ్మెయ్యాల్సొస్తుంది.

రోజుకి ఎనిమిదిగంటలు పనిచేసినా చాలదు.

కొందరు లోపలా బయటాకూడ పనిచేస్తారు, అయినా, చివరకి

లెక్కలన్నీ తేలే సరికి అది ఎక్కడికీ చాలదు.

మనకి తెలుసు ఎదిగే పిల్లల ఆకలి ఎలా ఉంటుందో.

అలా అని పేదరికం అంటే కేవలం చింకిబట్టలేనా?

మనందరం గోతిలో ముత్యాల్లా కప్పబడి ఉండాలా?

అంతా బాగానే ఉంది,అంతా బాగానే ఉందనుకుంటూ

ఈ రోజు ఆకలిని ఏ చెలమలో నీరో తాగి మాన్పగలమా?

ఆ ఆకుపచ్చని పర్వతం తనపాదాల చెంత తోటలని పెంచినట్టు

మనపాదాలక్రింద పిల్లల్ని పెంచలేం.

అది ఒంతరిగా విరియనూ గలదు, వాడనూ గలదు.

నాలుగు ఋతువులూ వెచ్చి వెళ్లిపోతాయి.

కానీ పిల్లలు తమంత తాము పెరగలేరు; వాళ్లంత వాళ్ళు తినలేరు.

భర్తలు భార్యలకు కావలసింది తెచ్చిపెట్టాలి.

భార్యలు తమ భర్తలకి అండగా నిలబడాలి.

వాళ్లకి ఆ ఆకుపచ్చని పర్వతంలా ఎంతటి రసాత్మక హృదయం ఉన్నా,

మనుషులు పనిలోనే పుడతారు, పనిలోనే బ్రతుకుతారు, పనిలోనే చస్తారు.

ఊరవేసిన చేపలని తింటేనే పేగులు సంతృప్తిచెందేది.

వాళ్ళకి తిండిలేకపోతే కడుపు మలమలమాడుతుంది.

తిండితినగలిగితేనే కాలకృత్యాలు తీర్చుకోగలరు.

ఆదర్శవాదిలా, కేవలం గాలిభోంచేస్తూ, తేనె తాగుతూ

ఒంతరిగా ఎవరు బ్రతకగలరు?

తినడానికి బార్లీ జావ, ఉలవచారూ మాత్రమే ఉన్నవాడికి

అన్నం కనిపిస్తే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది.

వాళ్ళు అన్నం ముందు సాష్టాంగపడతారు.

“ఈ ప్రపంచం అంతా ఒక్క చామంతిని వికసింపజేయడానికి

కృషిచేస్తునట్టుంది,” అని మీరు భావ గీతాలాలపిస్తున్నప్పుడు

ఈ నేలమీద, ఎవరికీ కనిపించని ఓ మూల

ఒక పిడికెడు అన్నంకోసం ఒక గొంతు ఆకలితో అరుస్తోందని మీకు తెలుసా?

ఎలా చూసినా, పేదరికం అంటే చిరుగుబట్టలు వేసికోవడం మాత్రం కానే కాదు.

అదేదో ఒక సారి తొడుక్కుని తర్వాత తీసేసే పాత చొక్కాలాటిది కాదు.

జీవితం భీకరమైన తరంగాలమీద చిక్కుకున్నప్పుడు,

మధ్యాహ్నం వేళ తీరికగా ఆకుపచ్చ పర్వతాన్ని చూడడం ఆనందం ఇవ్వదు.

పేదరికం ఒక శత్రువు. మనల్ని నిలువునా నమిలేసే క్రిమి.

అది మన సహజమైన వ్యక్తిత్వాన్ని కూడా నంజుకు తింటుంది.

ఆ విషం మన దుస్తుల్నే కాదు, మన చర్మాన్నికూడా చివుకబెడుతుంది.

అది మానవాళికంతటికీ శత్రువు. మనం తరిమెయ్యవలసిన భూతం.

పేదరికంలో సుఖానికి అర్రులు జాచేవాడు

అతనికి తెలియకుండానే కదుపులో ఈ క్రిమిని పెంచుకుంటున్నాడు.

‘తావో యువాన్-మిన్ ‘ తాగే కప్పుని ఎరువడుగుతూనో,

‘లీ బై ‘ తాగిన తర్వాత చేసే అల్లరి పనుల్ని అనుకరిస్తూనో

మీరు అంతా బాగుంది, అంతా బాగుందని అరవ్వొచ్చు.

కానీ, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు.

గుప్పెడు మెతుకుల అన్నం కోసం, చారునీళ్ళకోసం

అలమటించే ఆ నోటిని అవమానపరచ వొద్దు

ఒక పద్యం కోసం పేదరికాన్ని తాకట్టుపెడతానంటూ.

ఓ మోసకారి కవీ! జోలపాటలు పాడే కవి

ఎప్పుడూ ప్రజల్ని ఎప్పుడూ నిద్రపుచ్చుతూనే ఉంటాడని తెలుసుకో!

.

మూన్ బ్యూంగ్ రాన్

Born 1935

దక్షిణ కొరియా కవి.

This poem seems an excellent, uncompromising rejoinder to the poem “Gazing at Mudeung Mountain by Seo Jung-ju.  In fact, some of the lines are quoted exactly to contradict what poverty is not about and what a poor man is supposed to do.

 *

Poverty

.

We all know how tiring it is
for a farmer with five patches of rice fields
to raise four kids and send them to school.
We know a poor citizen without a house
risks his whole life
to get his own house.
Those who have raised kids all know
it is like cutting off your own bone
to raise four kids,
to send them to school like others do,
and to help them find their mates.
To marry one daughter, a pillar of the house disappears
and to send a child to college, you lose a rice patch.
Working even eight hours a day is not enough,
and some work inside and outside to save
yet not enough is made despite all the considerations.
We all know how demanding children’s mouths are–
yet is poverty mere rags?
Should we lie buried alone in the pit like a gem?
Can you quiet today’s hunger,
drinking dull drinks of water, saying it’s all right, it’s all right,
deliberately folding your arms, pretending to turn away?
We can’t raise our kids
the way the green mountain tends to orchids under her feet.
She blooms and withers alone; four seasons come and go.
But children don’t grow by themselves; they can’t eat for themselves.
Husbands should provide for wives,
wives should hold up their husbands.
Humans are born into work, live in work, and die in work
no matter how much the natural heart is like the green mountain.
The intestines are only satisfied with pickled fish.
They go hungry without food
and they defecate with food.
Who can live like an idealist
living alone, drinking only dew and wind?
Those who have only a bowl of barley with bean stew
think of rice as Heaven–
they bow down in front of rice.
While you sing, the whole universe is working together
to bring one chrysanthemum to bloom.
Do you know that in a shadowed corner of this land
a hungry mouth lives asking for a spoonful of rice?
Poverty is not by any means merely tattered rags.
It’s not just the old dress that one puts on and takes off.
When life gets swept up in the rough waves,
it isn’t a pleasure to lazily watch the green mountain in the afternoon.
Poverty is the enemy, the poisonous worm that gobbles us up
and feasts upon even our natural character,
the toxin that rots not just clothes but the flesh, too.
It’s our human enemy, the devil to drive away,
the seeker of pleasure in poverty
who hopelessly nurtures worms in the growling belly.
You say it’s all right, it’s all right,
borrowing Tao Yuan-min’s drinking cup,
imitating Li Bai’s drunken rowdiness.
Don’t deceive yourself.
Don’t defile the hungry mouth
who wants a bowl of rice and bean soup,
trading poverty for a piece of poem.
Oh, the hypocrite poet, the poet
of lullabies who puts people to sleep.

.

Moon Byung-ran

Born 1935

South Korean Poet

Poem and Image Courtesy: https://jaypsong.blog/category/moon-byung-ran/

Moon Byung-ran (1935 – ) was born in Hwasun, Jeollanam-do. He taught creative writing at Chosun University as well as in Suncheon High School and Gwangju Jeil High School. He has published such collections as LegitimacyOn the Field of Bamboo ShootsOde to the LandOde to MayMudeung MountainTo the Weaver, and Tchaikovsky of the Dawn. Famous for being a poet of the people, he has made it his mission to represent the under-represented and to resist any form of oppression, especially the military dictatorship in Korea in the 1970s and 1980s.

మన కృతులు … హెన్రీ ఏబీ, అమెరికను కవి

మన ఆలోచనలు అవి పుట్టినప్పటి మన ఆవేశాల వన్నెల్ని

ఎలా సంతరించుకుంటాయో, అలాగే మన కృతులు కూడా

మన అంతరాంతరాలలోని అశాంతిని ప్రతిఫలిస్తూ

ముందటిదాన్ని విడిచిపెట్టి కొత్తది అందుకుంటాయి.

మానవ నిర్మితాలైన గర్వించదగిన మహత్తర కళాఖండాలు

వాటి సృష్టికర్తలు వాటితో సంతృప్తి చెందలేదని సూచిస్తుంటాయి.

కారణం, తన కృతుల సోపానాలని అధిరోహించి క్రిందకి చూసినపుడు

పూర్ణవృత్తాలుకూడా సన్నగా కనిపిస్తాయి; అసలు తను చేసిన సృష్టి

అంతా కళాకారుడికి లోపభూయిష్టంగా కనిపిస్తుంది; గుండె రక్తమోడుతుంది;

పశ్చాత్తాపం తెరలు తెరలుగా కన్నీరై పెల్లుబికి వస్తుంది,

తను అందుకోగలననుకున్న ఉత్కృష్టసామర్ధ్యతాప్రమాణాలముందు

తన అత్యుత్తమసృష్టి పేలవం, నిష్ఫలమైనందుకు విచారమేస్తుంది.

.

హెన్రీ ఏబీ

(July 11, 1842 – June 7, 1911)

అమెరికను కవి.

.

Faciebat *

.

As thoughts possess the fashion of the mood

That gave them birth, so every deed we do

Partakes of our inborn disquietude

Which spurns the old and reaches towards  the new.

The noblest works of human art and pride

Show that their makers were not satisfied.

For, looking down the ladder of our deeds

The rounds seem slender; all past work appears

Unto the doer faulty; the heart bleeds,

And pale Regret comes weltering in tears,

To think how poor our best has been, how vain,

Beside the excellence  we would attain.

.

*( Latin :  nearest meaning  Passive voice of Do)

Henry Abbey

(July 11, 1842 – June 7, 1911)

American Poet

Poem Courtesy:

https://archive.org/details/bookofpoetrysong00bate/page/2

శిధిల సమాధి… ఫేనీ స్టెరెన్ బోర్గ్, డచ్చి కవయిత్రి

ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఈ కవిత తనప్రియమైన వ్యక్తి గురించి రాసిన స్మృతిగీతం కాదు. ఒక శిధిల సమాధినీ, అక్కడి శిలా ఫలకం మీది తేదీనీ, మృత్యుల్లేఖనాన్నీ చూసిన తర్వాత కవి మదిలో మెదిలిన ఆలోచనల పరంపర.

.

“ప్రియాతి ప్రియ సఖా!

ఎప్పటికీ నీ ప్రేమలో”

అని ఆ శిలాఫలకం మీద చెక్కి ఉంది, ఎన్నేళ్ళ క్రిందటో.

ఆ ఆప్త వచనాలక్రింద నిద్రిస్తోంది ఒక శరీరం

మరీ తొలిప్రాయంలోది, విగతాత్మయై.

ప్రతి ఏడూ కొన్ని పువ్వులు వస్తూ ఉండి ఉంటాయి,

కానీ ఈ స్థలాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదని తెలుస్తూనే ఉంది.

అక్కడున్న తేదీని బట్టి, ఈ సరికి, అతన్ని “ప్రియాతి ప్రియంగా”

ప్రేమించిన ఆ “ఎప్పటికీ నీ ప్రేమలో” కూడా గతించి ఉంటుంది.

అంతకు ఎన్నాళ్ళముందో నిర్ణయించుకున్నట్టుగా

ఆమెని నీ ప్రక్కనే ఎందుకు సమాధి చెయ్యలేదు?

నేను కారణాలు ఊహించగలనేమోగాని

యదార్థం నాకూ తెలియదు.

ఇక నువ్వు శాశ్వతంగా ఒంటరిగా ఎదురుచూస్తుంటావు

ఇద్దరి కోసం ప్రత్యేకించిన ఈ సమాధిలో నీ జత కోసం.

నే నిక్కడినుండి కదిలి వెళిపోతున్నప్పుడనిపిస్తోంది

బహుశా, ఆమెకూడా అలాగే వెళ్ళిపోయిందని.

.

ఫేనీ స్టెరెన్ బోర్గ్,

డచ్చి కవయిత్రి

Fenny Sterenborg

The beauty of the poem is that it is not about one’s beloved.  It is a reflection after reading an inscription on a dilapidated Tomb (stone).

In a way, most of us are hypocrites. Even if our grief for the loss of our beloved is genuine, the promises we make to the dead beloved or to ourselves in that moment of grief we never keep.  Time heals the greatest wounds. Our necessities, our compulsions, our frailties force us to compromise with just a wafer-thin token respect for the dead remaining in our memories. 

And the unfortunate dead ‘beloved young man’ in this poem was still waiting in his grave for his “forever yours”.  As the passerby (the poet here) notes,  time  might have changed her course and took a different turn which the poor soul never knew about.

And the takeaway here, if any, is one should not extend one’s faith on their “beloved”s beyond their lifetime.

.

Withered Grave

.

Forever yours

my dearly beloved one

Carved in stone, many years ago.

Underneath those loving words, a resting body

far too young, left by it’s soul.

A few lonely flowers come back every year,

but it’s apparent, no living soul is tending here.

From the date, by now, forever must also be gone.

But where did she go, this yours forever,

that dearly beloved one.

Why wasn’t she buried here with you,

like decided all those years ago.

I can only guess the reasons,

but I will never know.

Forever you lie alone, awaiting,

in this grave meant for two.

As I move on, I wonder,

perhaps she did too.

.

Fenny Sterenborg

Born 1956

Dutch Poetess

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/fenny_sterenborg/poems/22028

కొత్త సంవత్సరపు కోరిక… జూడిత్ రైట్, ఆస్ట్రేలియన్ కవయిత్రి

కొత్త సంవత్సరం నాకు ఏ బహుమతి అందించాలా

అని గనక ఆలోచిస్తూంటే, అది, కళలపట్ల

ఆమెకున్న మక్కువ గురించి కథలుగా చెప్పుకునే

మా ముత్తవ్వ వైఖరి లాంటిది కావాలని కోరుకుంటాను.

ఎనిమిదిమంది సంతానంతో, పాపం ఆమెకు ఎన్నడూ

బొమ్మలు గీయడానికి అవకాశం చిక్కలేదు;

ఒక రోజు ఆమె స్విట్జర్లాండు దేశంలో ఒక నది ఒడ్డున

చాలా ఎత్తైన కొండగుట్టపై కూర్చుంది.

దూరంగా ఆమె రెండో కొడుకు మంచునీటిప్రవాహం మీద తేలుతూ

పట్టుతప్పి ప్రవాహదిశలో ఎనభై అడుగుల దిగువన

రాళ్ళమీద పడుతున్న జలపాతంవైపు కొట్టుకుపోడం చూసింది.

ఆమె రెండవ కూతురు, ఆమె ధరించిన దుస్తులవల్ల

నిస్సందేహంగా అసౌకర్యం అనుభవిస్తూనే తమ్ముడికి

చివరి ఆశగా ఇనుప ఊచ ఉన్న ఒక కర్రని అందించింది.

(అదృష్టవశాత్తూ, కొట్టుకుపోతూనే అతను దాన్ని అందుకోగలిగాడు);

ఆ పరిస్థితుల్లో చెయ్యడానికి నిజంగా ఏమీ లేదు;

ఒక కళాకారుడికి ఉండే నిర్లిప్తమైన దృష్టితో

మా అవ్వ తొందర తొందరగా ఒక చిత్రాన్ని గీసింది.

ఈ సంఘటన నిజమనడానికి ఋజువుగా ఆ చిత్రం ఇప్పటికీ ఉంది.

ఓ కొత్త సంవత్సరమా, నువ్వు మాతృదినోత్సవపు కానుక ఇంకా నిశ్చయించుకోకపొతే,

మరొకసారి గతంలోకి వెళ్ళి, ఆ బొమ్మగీస్తున్నపుడు ఆమె చేతిలోని స్థైర్యాన్ని పట్టి తీసుకురా!

.

జూడిత్ రైట్

(31 May 1915 – 25 June 2000)

ఆస్ట్రేలియన్ కవయిత్రి, పర్యావరణ, ఆదీవాసీల భూమిహక్కులకై పోరాడిన కార్యకర్త

.

Judith Wright
Australian Poet

.

Request to a Year

.

If the year is meditating a suitable gift,

I should like it to be the attitude

of my great- great- grandmother,

legendary devotee of the arts,

 

who, having eight children

and little opportunity for painting pictures,

sat one day on a high rock

beside a river in Switzerland

 

and from a difficult distance viewed

her second son, balanced on a small ice flow,

drift down the current toward a waterfall

that struck rock bottom eighty feet below,

 

while her second daughter, impeded,

no doubt, by the petticoats of the day,

stretched out a last-hope alpenstock

(which luckily later caught him on his way).

 

Nothing, it was evident, could be done;

And with the artist’s isolating eye

My great-great-grandmother hastily sketched the scene.

The sketch survives to prove the story by.

 

Year, if you have no Mother’s Day present planned,

Reach back and bring me the firmness of her hand.

.

Judith Wright

(31 May 1915 – 25 June 2000)

Australian Poet, Environmentalist and campaigner for Aboriginal land rights.  

Poem Courtesy: 

http://famouspoetsandpoems.com/poets/judith_wright/poems/2422

క్షణకాలపు లోలత్వం… రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

ప్రభూ! నీ ప్రక్కన కూర్చునే క్షణకాలపు లోలత్వానికి అనుమతి ప్రసాదించు.

నే చేయవలసిన పనులని తర్వాత నెమ్మదిగా చక్కబెట్టుకుంటాను.

నీ వదనాన్ని వీక్షించక నా మనసుకి విశ్రాంతీ, ఉపశమనమూ లేవు,

దరిలేని శ్రమసాగరంలో నా పని అశ్రాంతశ్రమల ప్రోవు.

నిట్టూర్పులతో, మర్మరధ్వనులతో నా ప్రాంగణంలో అడుగుపెట్టిన ఈ వేసవి రోజున

నికుంజవిహారులు నెత్తావి పూలగుత్తులచుట్టూ తమకంతో నృత్తగీతాలాలపిస్తునాయి.

దొరికిన ఈ కొద్ది ప్రశాంత విశ్రాంతి సమయమూ, నీ ఎదురుగా, మౌనంగా

కూర్చుని, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తూ లోలోన ఆలపించనీ! ప్రభూ!

.

రబీంద్రనాథ్ టాగోర్

7th May 1861 – 7th Aug 1941

భారతీయ కవి

Image Courtesy: Wikipedia

.

A Moment’s Indulgence

.

I ask for a moment’s indulgence to sit by thy side. The works

that I have in hand I will finish afterwards.

Away from the sight of thy face my heart knows no rest nor respite,

and my work becomes an endless toil in a shoreless sea of toil.

Today the summer has come at my window with its sighs and murmurs; and

the bees are plying their minstrelsy at the court of the flowering grove.

Now it is time to sit quiet, face to face with thee, and to sing

dedication of life in this silent and overflowing leisure.

.

Rabindranath Tagore

7 May 1861 – 7 August 1941

Indian Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/rabindranath_tagore/poems/2203

 

%d bloggers like this: