నిజమైన ప్రేమికుడికి మతం అంటూ ఏదీ ఉండదు,
ఈ సత్యాన్ని గ్రహించుకో.
కారణం, ప్రేమే అభిమతమైనవారికి దేని మీదా
అటు విశ్వాసమూ ఉండదు, ఇటు అగౌరవమూ ఉండదు.
అసలు, ప్రేమలో పడినప్పుడు
ఈ శరీరం, బుద్ధి, మనసు, ఆత్మల ఉనికే ఉండదు.
ప్రేమలో ఆ స్థితిని చేరుకో.
అప్పుడు నీకు వియోగమన్న ప్రశ్నే ఉండదు.
.
రూమీ
13వ శతాబ్దం
పెర్షియను కవి .

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి