అనువాదలహరి

కాలమే నిర్ణయిస్తుంది… సుకాసా స్యహ్దాన్, ఇండోనీషియా కవి

కాలమే నిర్ణయిస్తుంది

ఎక్కడ నిజమైన యుద్ధం

ఆరంభమవుతుందో:

ప్రతి గుండెలోనూ.

కాలమే నిర్ణయిస్తుంది

తమని తాము గాయపరచుకోడంలో

ఎవరు కృతకృత్యులౌతారో:

ఎవ్వరూ గెలవరు.

కాలమే నిర్ణయిస్తుంది

మిత్రులలో

శతృవులెవరో:

రెంటిలో పెద్ద తేడా ఉండదు.

కాలమే నిర్ణయిస్తుంది

చివరకి, ఎవరు

చెప్పేది నిజమో:

ఎవరు చెప్పేదీ కాదు.

.

సుకాసా స్యహ్దాన్

జననం: 1968

ఇండోనీషియన్ కవి

.

Time Shall Tell 

.

Time shall tell 
where the real 
warfare befalls:
in every soul 

Time shall tell 
who triumphs 
in self-infliction:
no one shall

Time shall tell 
foes apart 
from friends:
no difference

Time shall tell 
who possesses 
the ultimate truth: 
no one.

.

Sukasah Syahdan

Born: 1968

Indonesian Poet

Poem Courtesy:

http://www.wikitime.net/literature/268-time-shall-tell-by-sukasah-syahdaneng

%d bloggers like this: