విచారము… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి ఎడతెరిపి లేకుండా కురిసే వానలా విచారము నా గుండె దొలిచేస్తోంది. తక్కినవారు రాత్రల్లా బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగినా ఉదయం అయేసరికి ఎప్పటిలా మామూలుగా అయిపోతారు. కానీ, ఈ బాధ పెరగనూ పెరగదు, తరగనూ తరగదు. ఇది పూర్తిగా ఆగిపోదు, పూర్తిగా పెరగదు. అందరూ ఎప్పటిలా ముస్తాబై ఊరిలోకి వెళ్ళిపోతారు. నేను మాత్రం కుర్చీలో కూర్చుండిపోతాను. నా ఆలోచనలన్నీ మెల్లగా విచారగ్రస్తమౌతాయి. అప్పుడు నేను నిల్చున్నా ఒకటే, కూర్చున్నా ఒకటే, నేను ఏ గౌను తొడుక్కున్నా, ఏ చెప్పులేసుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (February 22, 1892 – October 19, 1950) అమెరికను కవయిత్రి . Edna St. Vincent Millay . Sorrow . Sorrow like a ceaseless rain Beats upon my heart. People twist and scream in pain, — Dawn will find them still again; This has neither wax nor wane, Neither stop nor start. People dress and go to town; I sit in my chair. All my thoughts are slow and brown: Standing up or sitting down Little matters, or what gown Or what shoes I wear. . Edna St. Vincent Millay (February 22, 1892 – October 19, 1950) American Poetess ` Poem Courtesy: https://www.gutenberg.org/files/109/109-h/109-h.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిజూలై 23, 2019