భాగ్యవిధాతలు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

కాలమనే ఈ గోడల మధ్య పనిచేసే

వారందరూ భావిభాగ్యవిధాతలే;

కొందరు మహత్తరమైన కార్యాలు సాధిస్తే,

కొందరు చక్కని నడకగల కవిత్వాన్ని రాస్తారు.

వీటిలో ఏదీ పనికిమాలినదీ, తక్కువైనదీ లేదు;

దేనిమట్టుకు అది దాని స్థాయిలో ఉత్తమమైనదే;

పైకి కేవలం కాలక్షేపపు పనిలా కనిపించేది సైతం 

తక్కినవాటికి బలంకూర్చి సహకరిస్తుంది.

మనం నిలబెట్టే కేవల ఆకృతిస్వరూపానికి

కాలం తగిన వస్తుసముదాయం నింపి పూర్ణత ఇస్తుంది.

మనం ఈ స్వరూపాన్ని వర్తమానం, గతం

అనే ఇటుకలతోనే కట్టి నిలబెట్టేది.

ఈ కట్టడం ఆకారంలో, పోకడలలో నిజంగా కొత్తది

మధ్యలో పెద్ద పెద్ద లోపాలను విడిచిపెట్టదు.

వాటి గురించి పెద్దగా ఆలోచించవద్దు, ఎందుకంటే

అవి ఎవరికీ కనిపించవు, గుర్తించనూ లేరు.

కళాత్మకతతో సృష్టిచేసే తొలిరోజుల్లో,

ప్రతి కళాకారుడూ అతిసూక్ష్మమూ, స్పష్టంగా కనుపించని

వివరాలనిసైతం విశ్వవ్యాపియైన భగవంతుడు

అన్నీ గమనిస్తాడన్న నమ్మికతో శ్రద్ధగా తీర్చిదిద్దేవారు.

మనం కూడా మన పనిని బాగా పూర్తిచేద్దాం

గోచరాగోచర ప్రకృతులు రెండింటితో సహా.

భగవంతుని స్థావరమైన మన ఇళ్ళనుకూడా

పూర్తిగా పరిశుభ్రంగా, అందంగా దిద్దుకుందాం.

లేకపోతే మనజీవితాలు అసంపూర్ణంగా

మిగిలిపోతాయి; కాలం గోడల మధ్య మిగిలే

విరిగిపోయిన మెట్లవరుసలమీద ఎక్కడానికి

అడుగులు వేసినపుడు కాళ్ళు తడబడతాయి.

కనుక, ఈ రోజు మనం ఏది నిర్మించినా విశాలంగా,

వెడల్పుగా, దృఢంగా ఖచ్చితంగా ఉండేలా నిర్మిద్దాం.

అపుడు, రేపు అవి ఎక్కుతున్నపుడు మన భవిష్యత్తు

చిరకాలం భద్రంగా ఉండడం మనం గ్రహిస్తాము.

అలా చెయ్యగలిగినపుడే ఈ విశ్వమంతా

ఒక సమతలప్రదేశంలా కనిపిస్తూ

చూపుల అంచున అనంతాంబరాన్ని తాకుతూ 

కనిపించే శిఖరాలని అందుకోగలుగుతాము.

.

హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882)

అమెరికను కవి.

.

The Builders

.

All are architects of Fate,

Working in these walls of Time;

Some with massive deeds and great,

Some with ornaments of rhyme.

Nothing useless is, or low;

Each thing in its place is best;

And what seems but idle show

Strengthens and supports the rest.

For the structure that we raise,

Time is with materials filled;

Our to-days and yesterdays

Are the blocks with which we build.

Truly shape and fashion these;

Leave no yawning gaps between;

Think not, because no man sees,

Such things will remain unseen.

In the elder days of Art,

Builders wrought with greatest care

Each minute and unseen part;

For the Gods see everywhere.

Let us do our work as well,

Both the unseen and the seen;

Make the house, where Gods may dwell,

Beautiful, entire, and clean.

Else our lives are incomplete,

Standing in these walls of Time,

Broken stairways, where the feet

Stumble as they seek to climb.

Build to-day, then, strong and sure,

With a firm and ample base;

And ascending and secure

Shall to-morrow find its place.

Thus alone can we attain

To those turrets, where the eye

Sees the world as one vast plain,

And one boundless reach of sky.

.

H W Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: