ఒక చిన్ని పక్షికి…. ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

గూటిలోంచి జారి పడిపోయిన నిన్నొకసారి చూసేను

గాయపడిన రెక్కతో నీ బెదురుచూపులూ గమనించాను.

నీ గాయాన్ని మాన్పి భయాన్ని నెమ్మదిగా పోగొట్టేను,

అప్పుడు నువ్వు ధైర్యంగా కిచకిచలాడుతూ పాడ బోయేవు.

నిన్ను పెంచుకుందికి నీకో పంజరం కూడా కొన్నాను,

ఈ అడవి నీకు అంత పరిచయం లేదన్న ధీమాతో

కాలక్రమంలో అన్నీ మరిచిపోతావని ఊహించుకుని

నాతోనే నువ్వు ఒంటరిగా ఉండిపోతావని సంతృప్తి పడ్డాను.

కానీ, వేసవి పొడచూపడంతోనే నీలో దూరంగా, ఎక్కడికో

ఎగిరిపోవాలన్న కాంక్ష మోసులువారింది- నీదైన రీతిలో

నాకు చెప్పావుకూడా మౌనంగా నీలాకాశంవంకే చూపులు నిలుపుతూ,

నీ కోరికను గ్రహించి పంజరంలోంచి నిన్ను వదిలేసాను.

ఓ నా చిన్ని విహంగమా! పంజరంలాంటి జీవితం నన్నింకా గట్టిగా పట్టి ఉంది.

కానీ త్వరలోనే, అమృతహస్తమొకటి నాకూ విముక్తి ప్రసాదిస్తుందిలే, తెలుసా!

.

ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్

September 17, 1866 – April 30, 1925

అమెరికను కవయిత్రి.

.

To A Bird

.

I found you fallen from your nest one day,

With little frightened eyes and wounded wing;

I healed the hurt and coaxed the fear away,

And then you bravely tried to chirp and sing.

I bought a cage to keep you for a pet:

So little of the woodland you had known

I felt assured you would in time forget,

And be content to stay with me alone.

But when the summer came, a longing grew

To fly far, far,- you even told me so

In your mute way, with eyes fixed on the blue.-

I understood the wish, and let you go.

Ah, little Bird, life’s cage still holds me fast,

But a kind hand will free me, too, at last!

.

Antoinette De Coursey Patterson

September 17, 1866 – April 30, 1925

American Poet

Poem Courtesy:

https://archive.org/details/sonnetsquatrains00patt/page/7

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: