కవిత్వం… డాన్ పాటర్సన్, స్కాటిష్ కవి

ఈ గ్రహం రూపుదిద్దుకుంటున్నప్పుడు

దాని అగ్నికీలలోని ఒకానొక మెరుపును, 

వజ్రం తన గర్భంలో శాశ్వతంగా పొదువుకున్న చందాన,

కవిత్వం ప్రేమ తర్వాత కలిగే విరహాన్ని కాకుండా

నిశ్శబ్దంగా మనలో అణురూపంలో ఉత్పన్నమయే స్థితినే

ప్రతిబింబిస్తుంది; కనుక, నిప్పుకణికలాంటి అతని ప్రేమ

నివురుగప్పుతున్నపుడు, మధుశాలలోని గాయకుని గొంతులోంచి

అకస్మాత్తుగా వచ్చే పాటలా కవి తన గొంతు తానే వింటాడు:

అతని అనుభూతుల్ని ఉదాత్తమైనవిగా చేసి చెప్పుకుంటూనో,

లేదా, తోడుగా వాయిస్తున్న వయొలిన్ రాగాలలో కరిగిపోతూనో;

కానీ ఆ ప్రేమ నిలకడగా సరియైన త్రోవ చూపిస్తున్నప్పుడు

అతని కవిత్వం, లోనుండి ఎప్పుడు బయటపడినా అతను గ్రహిస్తాడు,

ఎరుగని కొండవాగులా స్వచ్ఛంగా, గంభీరంగా బయటపడుతుందని.

అపుడు, వినీలాకాశం క్రింద గలగలా ప్రవహించే నీటి

మౌన గీతాలలో నీ పేరూ వినిపించదు, నా పేరూ వినిపించదు.

.

డాన్ పాటర్సన్,

(జననం 1963)

స్కాటిష్ కవి.

Don Patterson

Born 1963

.

Poetry

.

In the same way that the mindless diamond keeps

one spark of the planet’s early fires

trapped forever in its net of ice,

it’s not love’s later heat that poetry holds,

but the atom of the love that drew it forth

from the silence: so if the bright coal of his love

begins to smoulder, the poet hears his voice

suddenly forced, like a bar-room singer’s — boastful

with his own huge feeling, or drowned by violins;

but if it yields a steadier light, he knows

the pure verse, when it finally comes, will sound

like a mountain spring, anonymous and serene.

Beneath the blue oblivious sky, the water

sings of nothing, not your name, not mine.

.

Don Paterson

(Born 1963)

Scottish Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/don_paterson/poems/15921

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: