మృత్యువంటే… ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు మృత్యువు రకరకాలుగా ఉంటుంది: అందులో గెలుపూ లేదు ఓటమీ లేదు: కేవలం ఒక బాల్టీ ఖాళీ అవడం, పలక శుభ్రంగా తుడిచిపెట్టడం లాంటిది, అప్పటివరకూ ఉనికిగలదానికి దయతో చరమగీతం పాడడం. అంతే! మనకి తెలిసినది ఇంతవరకే: మృత్యువు జీవనం కాదు, ఒక క్షీణస్థితి, ప్రాణం చిదిమివెయ్యబడుతుంది, బాల్టీ పగులుతుంది. ఎన్నో గొప్ప వింతలూ, విశేషాలు చూసినవారికి కూడా ముగింపుమాత్రం ఇంకా తెలీదు. మరణంలో విజయుడూ, విజితుడూ ఒక్కటిగా కలిసి పోతారు; పిరికివాడూ, సాహసికుడూ: మిత్రుడూ శత్రువూ, ఒకటే. బ్రతికున్నపుడు నువ్వు ఏమి సాధించావు? అని భూతపతీ అడుగడు. కానీ, గడచిన ప్రతి నిన్నలోనూ ఒక కళంకం దాగి ఉంటుంది స్పష్టమైన మన అపరిపూర్ణతలని అరకొరగా దాస్తూ. ఎంతో అందంగా ఊహించిన నీ భవిష్యత్తు, ఎన్నడో వాడి వత్తై గతించినదాన్ని, అందరూ స్పృశించి, తిరగతోడి, నెమరువేసుకుని, గొప్పగా, మధురంగా అంచనా వేసినపుడు, నీ మరణానంతరం, అది నువ్వుగా తిరిగి వికసిస్తుంది. . ఛార్ల్స్ సోర్లీ (19 May 1895 – 13 October 1915) స్కాటిష్ కవి . . Such, Such Is Death . Such, such is Death: no triumph: no defeat: Only an empty pail, a slate rubbed clean, A merciful putting away of what has been. And this we know: Death is not Life, effete, Life crushed, the broken pail. We who have seen So marvellous things know well the end not yet. Victor and vanquished are a-one in death: Coward and brave: friend, foe. Ghosts do not say, “Come, what was your record when you drew breath?” But a big blot has hid each yesterday So poor, so manifestly incomplete. And your bright Promise, withered long and sped, Is touched, stirs, rises, opens and grows sweet And blossoms and is you, when you are dead. . Charles Sorley (19 May 1895 – 13 October 1915) Scottish Poet Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/charles_sorley/poems/12016 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూలై 15, 2019
వర్గాలుఅనువాదాలు ట్యాగులు20th CenturyCharles SorleyScottish Poet పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవికవిత్వం… డాన్ పాటర్సన్, స్కాటిష్ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.