ఒక పాత వసతిగృహంలో ఎప్పుడైనా
అతనూ నేనూ కలుసుకుని ఉంటే
ఇద్దరం కలిసి కూచుని ఎన్ని
చషకాలైనా తాగేసి ఉండేవాళ్ళం.
కానీ, పదాతిదళంలో పెరగడం వల్ల
ఒకరికొకరు ఎదురుపడి తీక్ష్ణంగా చూసుకుంటూ
అతను నామీదా, నే నతనిమీదా కాల్పులుజరుపుకున్నాం.
నే నతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా కాల్చిచంపాను.
అతన్ని నేను ఎందుకు కాల్చి చంపేనంటే…
అతను నా శత్రువు గనుక;
అదంతే! అతను నా శత్రువు, వైరి వర్గం;
అందులో సందేహం లేదు, కాకపోతే
నా లాగే, అనుకోకుండా, బహుశా అతనికీ
సైన్యంలో చేరుదామనిపించి ఉండొచ్చు,
ఏ పనీ దొరక్క, వలలూ, బోనులూ అమ్ముకునేవాడు
అంతకంటే మరో కారణం కనిపించదు.
నిజం; యుద్ధం ఎంత వింతైనది, ఆసక్తికరమైనది!
యుద్ధభూమిలో కాక ఏ మద్యం దుకాణంలోనో తారసపడిఉంటే
ఆదరించాలనో, పదిరూపాయలు సాయంచేయాలనో అనిపించే
సాటి వ్యక్తిని … నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతాం.
.
థామస్ హార్డీ
ఇంగ్లీషు కవి
.

స్పందించండి