ఈ కవిత నేపథ్యం గురించి అందులోని గ్రీకు పౌరాణిక పాత్రలు గురించి, దాన్ని ఏ రకంగా వ్యాఖ్యానించుకోవచ్చు నన్న విషయం గురించి చాలా చర్చలే ఉన్నాయి. .. స్పష్టత, సంక్షిప్తత, నిర్దుష్టత, మాటలపొదుపు లక్ష్యంగా గతశతాబ్దం తొలినాళ్లలో వచ్చిన ఇమేజిజం అన్న కవిత్వోద్యమంలో ఒక ముఖ్యపాత్రధారి ఐన ఎజ్రా పౌండ్ వ్రాసిన ఈ కవిత ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కవిత. దీనికి నాకు తోచిన వ్యాఖ్యానం ఈ అనువాదం. ఇది అతని ఉద్దేశ్యం కాదు, కానక్కరలేదు.
అప్పుడే పుట్టిన పాపని చేతిలోకి తీసుకుంటున్నప్పుడు కలిగిన అనుభవంగా దీన్ని నేను వ్యాఖ్యానిస్తున్నాను.
.
నా చేతిలోకి ఒక చెట్టుని అందుకున్నాను.
దాని సారం నా చేతులలోకి ప్రాకుతోంది.
నా గుండెలో ఒక చెట్టు మొలిచింది
అధోముఖంగా.
ఇప్పుడు చేతులుచాచినట్టు నానుండి కొమ్మలు వ్యాపిస్తున్నాయి.
పాపా, నువ్వు మహావృక్షానివే!
నిన్ను ఆనుకుని నాచులాటివెన్నో బ్రతుకుతై.
పిల్లగాలికి తల ఊచే ఊదారంగుపువ్వువీ నువ్వే.
ఎంతో ఉన్నతమైనదానివి నువ్వు.
నిన్ను పసిపాపగా చూడడం ఈ లోకపు దృష్టిలోపం.
.
ఎజ్రా పౌండ్
(30 October 1885 – 1 November 1972)
అమెరికను కవి
.

స్పందించండి