నెల: జూలై 2019
-
నన్ను వెంట తరుముతూ… అబ్బాస్ కియరోస్తమి ఇరానియన్ కవి
అబ్బాస్ కియరోస్తమి దీనిని ఒక జపనీస్ హైకు లా రాసినా, దానికి ఉండే ప్రాథమిక లక్షణాలని మాత్రం తెలిసే అతను అనుసరించలేదు. ఇక్కడ నీడ చాలా చక్కగ అమరే ఉపమానం అయినప్పటికీ, కవి చెప్పదలుచుకున్నది మాత్రం నీడ కాదు. మనతో పాటు పెరిగే, మనకికూడ తెలియని మన వ్యక్తిత్వం. *** నా చిన్నప్పటి నేస్తం నా నీడ, నన్ను వెంటాడుతూ వస్తోంది. అదీ నాతో పెరిగింది, నాతో పాటే వయసు మీరింది. అది నన్ను నా సమాధివరకూ…
-
నిజమైన ప్రేమికుడు… రూమీ, పెర్షియన్ కవి
నిజమైన ప్రేమికుడికి మతం అంటూ ఏదీ ఉండదు, ఈ సత్యాన్ని గ్రహించుకో. కారణం, ప్రేమే అభిమతమైనవారికి దేని మీదా అటు విశ్వాసమూ ఉండదు, ఇటు అగౌరవమూ ఉండదు. అసలు, ప్రేమలో పడినప్పుడు ఈ శరీరం, బుద్ధి, మనసు, ఆత్మల ఉనికే ఉండదు. ప్రేమలో ఆ స్థితిని చేరుకో. అప్పుడు నీకు వియోగమన్న ప్రశ్నే ఉండదు. . రూమీ 13వ శతాబ్దం పెర్షియను కవి . . True lover . A true Lover doesn’t follow…
-
కాలమే నిర్ణయిస్తుంది… సుకాసా స్యహ్దాన్, ఇండోనీషియా కవి
కాలమే నిర్ణయిస్తుంది ఎక్కడ నిజమైన యుద్ధం ఆరంభమవుతుందో: ప్రతి గుండెలోనూ. కాలమే నిర్ణయిస్తుంది తమని తాము గాయపరచుకోడంలో ఎవరు కృతకృత్యులౌతారో: ఎవ్వరూ గెలవరు. కాలమే నిర్ణయిస్తుంది మిత్రులలో శతృవులెవరో: రెంటిలో పెద్ద తేడా ఉండదు. కాలమే నిర్ణయిస్తుంది చివరకి, ఎవరు చెప్పేది నిజమో: ఎవరు చెప్పేదీ కాదు. . సుకాసా స్యహ్దాన్ జననం: 1968 ఇండోనీషియన్ కవి . Time Shall Tell . Time shall tell where the real warfare befalls: in…
-
విచారము… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఎడతెరిపి లేకుండా కురిసే వానలా విచారము నా గుండె దొలిచేస్తోంది. తక్కినవారు రాత్రల్లా బాధతో లుంగలు చుట్టుకుపోయి మూలిగినా ఉదయం అయేసరికి ఎప్పటిలా మామూలుగా అయిపోతారు. కానీ, ఈ బాధ పెరగనూ పెరగదు, తరగనూ తరగదు. ఇది పూర్తిగా ఆగిపోదు, పూర్తిగా పెరగదు. అందరూ ఎప్పటిలా ముస్తాబై ఊరిలోకి వెళ్ళిపోతారు. నేను మాత్రం కుర్చీలో కూర్చుండిపోతాను. నా ఆలోచనలన్నీ మెల్లగా విచారగ్రస్తమౌతాయి. అప్పుడు నేను నిల్చున్నా ఒకటే, కూర్చున్నా ఒకటే, నేను ఏ గౌను తొడుక్కున్నా, ఏ…
-
జైలులో ఒక సాయంత్రం… ఫైజ్ అహ్మద్ ఫైజ్, పాకిస్థానీ కవి
సర్పిలాకారపు సాయంత్రమనే నిచ్చెన మీంచి ఒక్కొక్క నక్షత్రపు మెట్టూనీ దిగుతూ రాత్రి భూమిమీదకు దిగుతుంది. పిల్లగాలి చెవులకి ఎంతదగ్గరనుండి పోతుందంటే చెవిలో ఎవరో రహస్యప్రేమభాషణ చేసినట్టనిపిస్తుంది. జైలు ముందరి ఆవరణలోని చెట్లు ఆకాశపు పటం మీద ఇంటికి తప్పించుకు పారిపోయే దారిని అల్లుకుంటున్న కాందిశీకులు. డాబామీద చంద్రుడు ప్రేమతో, ఔదార్యంతో నక్షత్రాలనన్నిటినీ తళుకులీనే పొడులుగా మారుస్తున్నాడు. అన్ని దిక్కులనుండీ, దట్టమైన ఆకుపచ్చని నీడలు తెరలు తెరలుగా నా వైపు కమ్ముకొస్తున్నాయి. నా ప్రేమిక నుండి ఏడబాటు గుర్తుచేసుకున్నప్పుడల్లా…
-
భాగ్యవిధాతలు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
కాలమనే ఈ గోడల మధ్య పనిచేసే వారందరూ భావిభాగ్యవిధాతలే; కొందరు మహత్తరమైన కార్యాలు సాధిస్తే, కొందరు చక్కని నడకగల కవిత్వాన్ని రాస్తారు. వీటిలో ఏదీ పనికిమాలినదీ, తక్కువైనదీ లేదు; దేనిమట్టుకు అది దాని స్థాయిలో ఉత్తమమైనదే; పైకి కేవలం కాలక్షేపపు పనిలా కనిపించేది సైతం తక్కినవాటికి బలంకూర్చి సహకరిస్తుంది. మనం నిలబెట్టే కేవల ఆకృతిస్వరూపానికి కాలం తగిన వస్తుసముదాయం నింపి పూర్ణత ఇస్తుంది. మనం ఈ స్వరూపాన్ని వర్తమానం, గతం అనే ఇటుకలతోనే కట్టి నిలబెట్టేది. ఈ…
-
ఒక చిన్ని పక్షికి…. ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
గూటిలోంచి జారి పడిపోయిన నిన్నొకసారి చూసేను గాయపడిన రెక్కతో నీ బెదురుచూపులూ గమనించాను. నీ గాయాన్ని మాన్పి భయాన్ని నెమ్మదిగా పోగొట్టేను, అప్పుడు నువ్వు ధైర్యంగా కిచకిచలాడుతూ పాడ బోయేవు. నిన్ను పెంచుకుందికి నీకో పంజరం కూడా కొన్నాను, ఈ అడవి నీకు అంత పరిచయం లేదన్న ధీమాతో కాలక్రమంలో అన్నీ మరిచిపోతావని ఊహించుకుని నాతోనే నువ్వు ఒంటరిగా ఉండిపోతావని సంతృప్తి పడ్డాను. కానీ, వేసవి పొడచూపడంతోనే నీలో దూరంగా, ఎక్కడికో ఎగిరిపోవాలన్న కాంక్ష మోసులువారింది- నీదైన…
-
కవిత్వం… డాన్ పాటర్సన్, స్కాటిష్ కవి
ఈ గ్రహం రూపుదిద్దుకుంటున్నప్పుడు దాని అగ్నికీలలోని ఒకానొక మెరుపును, వజ్రం తన గర్భంలో శాశ్వతంగా పొదువుకున్న చందాన, కవిత్వం ప్రేమ తర్వాత కలిగే విరహాన్ని కాకుండా నిశ్శబ్దంగా మనలో అణురూపంలో ఉత్పన్నమయే స్థితినే ప్రతిబింబిస్తుంది; కనుక, నిప్పుకణికలాంటి అతని ప్రేమ నివురుగప్పుతున్నపుడు, మధుశాలలోని గాయకుని గొంతులోంచి అకస్మాత్తుగా వచ్చే పాటలా కవి తన గొంతు తానే వింటాడు: అతని అనుభూతుల్ని ఉదాత్తమైనవిగా చేసి చెప్పుకుంటూనో, లేదా, తోడుగా వాయిస్తున్న వయొలిన్ రాగాలలో కరిగిపోతూనో; కానీ ఆ ప్రేమ నిలకడగా…
-
మృత్యువంటే… ఛార్లెస్ సోర్లీ, స్కాటిష్ కవి, సైనికుడు
మృత్యువు రకరకాలుగా ఉంటుంది: అందులో గెలుపూ లేదు ఓటమీ లేదు: కేవలం ఒక బాల్టీ ఖాళీ అవడం, పలక శుభ్రంగా తుడిచిపెట్టడం లాంటిది, అప్పటివరకూ ఉనికిగలదానికి దయతో చరమగీతం పాడడం. అంతే! మనకి తెలిసినది ఇంతవరకే: మృత్యువు జీవనం కాదు, ఒక క్షీణస్థితి, ప్రాణం చిదిమివెయ్యబడుతుంది, బాల్టీ పగులుతుంది. ఎన్నో గొప్ప వింతలూ, విశేషాలు చూసినవారికి కూడా ముగింపుమాత్రం ఇంకా తెలీదు. మరణంలో విజయుడూ, విజితుడూ ఒక్కటిగా కలిసి పోతారు; పిరికివాడూ, సాహసికుడూ: మిత్రుడూ శత్రువూ, ఒకటే.…
-
పరుగు పందెం … వాస్కో పోపా సెర్బియన్ కవి
కొందరు మనుషులు అవతలివాడిది కాలో, చెయ్యో, ఏది దొరికితే ఒక ముక్క కొరికేస్తారు దాన్ని పళ్ళ మధ్య దొరకబుచ్చుకుని ఎంత వీలయితే అంత జోరుగా అక్కడినుండి ఉడాయించి దాన్ని గోతిలో కప్పెట్టి దాచుతారు. తక్కినవాళ్ళు నాలుగుపక్కలా కమ్ముకుని భూమంతా, వాసనచూడ్డం – తవ్వడం వాసనచూడ్డం – తవ్వడం చేస్తారు. వాళ్ళకి అదృష్టం కలిసొస్తే ఒక చెయ్యో, కాలో దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని కొరికి పరిగెత్తడం వాళ్ళ వంతు. చేతులు దొరికినంత కాలం, కాళ్ళు అందినంతకాలం, చివరికి ఏదో…