నువ్వు ఇతరులకి కలిగించిన
బాధను మరిచిపో
ఇతరులు నీకు కలిగించిన
బాధనుకూడా మరిచిపో
సెలయేళ్ళూ, నదులూ ప్రవహిస్తూనే ఉంటాయి
వాటితుంపరలమెరుపులు మెరిసిమాయమౌతాయి
నువ్వు నడుస్తున్న నేల నువ్వు మరిచిపోతావు.
ఒకోసారి ఏ దూరతీరాన్నుండో పాట ఒకటి వినిపిస్తుంది
దానర్థం ఏమిటి, ఎవరుపాడుతున్నారు? అని నిన్నునువ్వు ప్రశ్నించుకుంటావు.
బాలభానుడు, మధ్యాహ్నమయేసరికి నిప్పులుకురుస్తుంటాడు
నీకు మనవలూ మునిమనవలూకూడా పుడతారు.
మళ్ళీ నిన్ను చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు నడిపిస్తారు.
నదులపేర్లు నీకు గుర్తుండిపోతాయి.
ఎంత నిరంతరాయంగా పారుతున్నట్టు కనిపించేవని!
నీ భూములుమాత్రం బంజరులైపోతాయి.
నగరంలోని ఆకాశహర్మ్యాలు ఒకప్పటిలా లేవు.
నువ్వు గుమ్మంముందు మౌనంగా నిలబడి ఉంటావు.
.
చెస్లావ్ మిహోష్
30 June 1911 – 14 August 2004
పోలిష్ కవి.

Photo Courtesy: Wikipedia
స్పందించండి