అవ్యయము… జోసెఫ్ బ్రాడ్స్కీ, రష్యను-అమెరికను కవి

ఇది చాలా చిత్రమైన స్మృతి కవిత. దీని శీర్షిక చాలా నచ్చింది నాకు.

మనిషి ఏమిటి మిగిల్చిపోతాడు? లేదా, మనిషి పోయిన తర్వాత ఏమిటి మిగులుతుంది? మనిషి భవిష్యత్తు అదే! వాడి గురించి చనిపోయిన తర్వాత అందరూ ఏమిటి మాటాడుకుంటారో, అంతే మిగిల్చిపోతాడు.వాడి గురించి ఎన్ని మాటాడుకున్నా, ఎన్ని గొప్ప గొప్ప పదాలు వాడినా, ఆ మాటలన్నిటిలోంచి అతిశయోక్తులు కాలక్రమంలో కారిపోతాయి. ఆ మాటలపరదాల వెనుక లేదా మృత్యు పరదా వెనుక ఎంతగొప్పవారున్నా ఒక్కటే. అతను ఎంతకాలం జీవించేడన్నది ప్రశ్నకాదు. ఆ వ్యక్తి ఎటువంటి జీవితం జీవించేడనేదే మిగులుతుంది. అదే అవ్యయము. (అవ్యయము ఒక భాషాభాగం)

.

… అప్పుడు “భవిష్యత్తు” అని పలకగానే

జున్నుముక్కకెన్ని రంధ్రాలున్నాయో అంతకు రెండురెట్లు

కన్నాలున్న భాషకలుగులోంచి ఏనాటివో జ్ఞాపకాల ముక్కలు

నోట కరుచుకుని ఎలుకల్లా మాటలు బయటపడతాయి.

ఇన్నేళ్ళు గడిచిపోయేక, ఆ పొడవాటి తెరలవెనుక

ఆ మూలన ఎవరున్నా, ఏమిదాగున్నా పెద్ద తేడా పడదు.

మీ మనసు దేవదూతల్ని చూసినట్టు “ఓహ్” అని ఆశ్చర్యపోదు.

గాలికి తెరల రాపిడి వినిపిస్తుందంతే!

ఉచితంగా ఇచ్చిన జీవితమనే గుర్రానికి దంతాలెన్నున్నాయో

లెక్కగట్టి వయసు అంచనావేసే పిచ్చిపని ఎవరూ చెయ్యరు.

హఠాత్తుగా ఎదురుపడినప్పుడల్లా జీవితం వెకిలినవ్వు నవ్వుతుంది.

మనిషి మిగిల్చిపోయేది పిసరంత. అతనిగూర్చి మాటాడినంత. అవ్యయమంత.

.

జోసెఫ్ బ్రాడ్స్కీ

24 May 1940 – 28 January 1996

రష్యను-అమెరికను కవి

.

.

Part Of Speech

.

…and when “the future” is uttered, swarms of mice

rush out of the Russian language and gnaw a piece

of ripened memory which is twice

as hole-ridden as real cheese.

After all these years it hardly matters who

or what stands in the corner, hidden by heavy drapes,

and your mind resounds not with a seraphic “doh”,

only their rustle. Life, that no one dares

to appraise, like that gift horse’s mouth,

bares its teeth in a grin at each

encounter. What gets left of a man amounts

to a part. To his spoken part. To a part of speech.

.

Joseph Brodsky

24 May 1940 – 28 January 1996

Russian-American Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/joseph_brodsky/poems/4030

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: