ఆలమందలూ, జీవాలూ ఎప్పుడో ఇల్లు చేరాయి,పసులదొడ్డి
ద్వారాలు మూయబడ్డాయి. స్పష్టమైన ఈ రేయి,
తోటకి దూరంగా పర్వతాలమీదా నదులమీదా
గాలి ఎగరగొట్టినట్టు చంద్రుడు పైకి లేస్తున్నాడు.
ఎత్తైన, నల్లని చీకటి కొండగుహల్లోంచి సెలయేళ్ళు
పలచగా జారుతున్నాయి, కొండ అంచున పచ్చిక మీద మంచు
మెల్లగా పేరుకుంటోంది. లాంతరు వెలుగున నా జుత్తు ఇంకా తెల్లగా
మెరుస్తోంది. పదే పదే అదృష్టాన్ని సూచిస్తూ దీపం ఎగుస్తోంది… ఎందుకో?
.
స్పందించండి