కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు

నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను.

అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు

కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది.

ప్రియతమా!నేను నిద్రలో మేల్కొన్నట్టు కలగన్నాను

నేలమీద, తెల్లగా పిండారబోసినట్టున్న వెన్నెల

చేతితో తాకాను; కానీ ఎక్కడో దూరంగా

వదులుగా ఉన్న కిటికీ ఒకటి కిర్రుమని చప్పుడైంది

గాలికి ఊగుతూ… కానీ గాలి వీచిన జాడలేదు,

నాకు భయంవేసి నీ వైపు చూశాను

నీ భరోసాకోసం చెయ్యి జాచేను

కానీ, నువ్వక్కడలేవు! మంచులా చల్లగా

నా చేతిక్రింద వెన్నెల తగిలింది.

ప్రియతమా! నువ్వు నవ్వినా నేను లక్ష్యం చెయ్యను

నేను రోదించినా ఎవరికీ పట్టదు.

కానీ, నువ్వున్నావన్నది ఒక ధైర్యాన్నిస్తుంది.

.

ఎడ్నా విసెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

.

The Dream

.

Love, if I weep it will not matter,

And if you laugh I shall not care;

Foolish am I to think about it,

But it is good to feel you there.

Love, in my sleep I dreamed of waking,

White and awful the moonlight reached

Over the floor, and somewhere, somewhere

There was a shutter loose- it screeched!

Swung in the wind- and no wind blowing-

I was afraid and turned to you,

Put out my hand to you for comfort-

And you were gone! Cold as the dew,

Under my hand the moonlight lay!

Love, if you laugh I shall not care,

But if I weep it will not matter-

Ah, it is good to feel you there.

.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American

Poem Courtesy:

https://love.best-poems.net/08/the_dream.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: