కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని. చివరకి వానా, ఎండా, రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి.
వాటిని భరించడం కంటే విడిచిపెట్టడం ఉత్తమం. రేడియోలో ఎవరిదో పియానో వాద్యం వినిపిస్తుంటే మరో కవిత రాస్తున్నాను. గొప్పకవులు రాసింది చాలా తక్కువ చెత్తకవులు మరీ ఎక్కువ రాసేరు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ
స్పందించండి