నెల: మే 2019
-
నే చెప్పలేదూ?… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి
నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని? ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను; అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని దాచ శక్యం కాదు. ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా? ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస. నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది; ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది. ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు, తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే దేముడు…
-
రకరకాల మనసులు…. రిఛర్డ్ చెనో ట్రెంచ్ , ఇంగ్లీషు కవి
. ఆకాశం నిర్మలంగా ఉండి చూడడానికి ప్రకాశవంతంగా ఉన్నా, కొందరు గొణుగుతారు అంతనిర్మలంగా ఉన్న నీలాకాశంలోనూ ఎక్కడో నల్లని మరక కనిపించిందంటూ; కొందరికి వారి చీకటిముసిరినజీవితాలలో భగవంతుని అనుగ్రహం ఒక్కసారి కలిగినా, ఒక్క వెలుగురేక తొంగిచూచినా చాలు, హృదయం కృతజ్ఞతాపూర్వక ప్రేమభావనతో నిండిపోతుంది. రాజప్రాసాదాలలోని హృదయాలు అసంతృప్తితో, అహమికతో అడుగుతుంటాయి జీవితం ఎందుకింత నిస్సారంగా ఉండి ఏ మంచీ ఎందుకు జరగడం లేదని. నిరుపేద గుడిసెలలోని మనసులు ప్రేమ వారిజీవితాలని ఎలా ఆదుకుందో (అసలా ప్రేమకు అలసట…
-
కొవ్వొత్తి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా! అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, ( 22 February 1892 – 19 October 1950) అమెరికను కవయిత్రి . . First Fig . My Candle burns at both ends; It will not last the night; But, ah, my…
-
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. నాలోని యోగీ, భోగీ రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు. సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా ఒకర్నొకరు తిట్టుకుంటూ నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు. రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం. పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను. ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు. ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను. ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి ఓడిపోయేదాన్ని నేనే! . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…