జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి నా జీవితాన్ని తిరిగి జీవించే అవకాశం వస్తే మరిన్ని తప్పులు చెయ్యడానికి రెండవసారి ప్రయత్నిస్తాను. పరిపూర్ణంగా దోషరహితంగా ఉండడానికి ప్రయత్నించను. ఏ ఒత్తిడీలేకుండా తీరుబాటుగా ఉంటాను, ఇప్పటికంటే సంతృప్తిగా ఉంటాను. నిజానికి అతి తక్కువ విషయాలని ప్రాధాన్యత ఇస్తాను ఇప్పటికంటే తక్కువ పరిశుభ్రంగా ఉంటాను ఎక్కువ తెగువచూపిస్తాను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను ఎక్కువ సూర్యాస్తమయాలు చూస్తాను ఎక్కువ కొండలెక్కుతాను ఎక్కువ నదుల్లో ఈదుతాను ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రదేశాలు చూస్తాను ఎక్కువ ఐస్ క్రీం తిని, తక్కువ ‘నిమ్మరసం జల్లిన గింజలు’ తింటాను, తక్కువ ఊహించుకున్నవీ ఎక్కువ నిజమైన సమస్యలూ ఎదుర్కొంటాను జీవితంలో ప్రతిక్షణాన్నీ వివేకంతో, ఫలవంతమైన జీవితం జీవించిన వాళ్ళలో ఒకడిగా ఉంటాను. నా జీవితంలోనూ ఆనందకరమైన క్షణాలుంటాయనుకోండి. కానీ, రెండోసారి అన్నీ ఆనందక్షణాలే ఉండేలా ప్రయత్నిస్తాను. జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే ఇప్పుడున్న క్షణాన్ని పోగొట్టుకోకు. ఎక్కడికెళ్ళినా తమతోపాటు ఒక థర్మామీటరూ వేడినీళ్ళ సీసా ఒక గొడుగూ, పారాచ్యూటూ లేకుండా వెళ్ళనివారిలో ఒకడిగా బ్రతికేను. మళ్ళీ జీవించే అవకాశం వస్తే తక్కువ సామానుతో ప్రయాణిస్తాను మళ్ళీ జీవించే అవకాశం వస్తే వసణ్తకాలం ప్రారంభం నుండి శిశిర ఋతువు కడదాకా ఉత్తికాళ్ళతో పనిచేస్తాను ఎడ్లబండిమీద ప్రయాణిస్తాను, మళ్ళీ జీవించే అవకాశం వస్తే ఎక్కువ సూర్యోదయాలు చూస్తాను, ఎక్కువమంది పిల్లల్తో ఆడతాను. నాకప్పుడే 85 నిండేయి, నేను అట్టే రోజులు బ్రతకనని తెలుసు. . జార్జి లూయీ బోర్హెస్ (24 August 1899 – 14 June 1986) అర్జెంటీనా కవి. . Instants . If I could live again my life, In the next – I’ll try, – to make more mistakes, I won’t try to be so perfect, I’ll be more relaxed, I’ll be more full – than I am now, In fact, I’ll take fewer things seriously, I’ll be less hygenic, I’ll take more risks, I’ll take more trips, I’ll watch more sunsets, I’ll climb more mountains, I’ll swim more rivers, I’ll go to more places – I’ve never been, I’ll eat more ice creams and less (lime) beans, I’ll have more real problems – and less imaginary ones, I was one of those people who live prudent and prolific lives – each minute of his life, Offcourse that I had moments of joy – but, if I could go back I’ll try to have only good moments, If you don’t know – thats what life is made of, Don’t lose the now! I was one of those who never goes anywhere without a thermometer, without a hot-water bottle, and without an umberella and without a parachute, If I could live again – I will travel light, If I could live again – I’ll try to work bare feet at the beginning of spring till the end of autumn, I’ll ride more carts, I’ll watch more sunrises and play with more children, If I have the life to live – but now I am 85, – and I know that I am dying … . Jorge Luis Borges 24 August 1899 – 14 June 1986 Argentine Poet Poem Courtesy: http://famouspoetsandpoems.com/poets/jorge_luis_borges/poems/2918 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మే 31, 2019
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyArgentine PoetJorge Luis Borges సానెట్ 21- ఏదీ, మరొకసారి, ఇంకొకసారి చెప్పు?… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రికవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.