ప్రతి వస్తువూ ఉన్నచోటనే కట్టుబడినట్టు
పడుండవలసిన స్థితికి విసుగెత్తి,
అసంకల్పితంగా ఆయా వస్తువులు కిర్రుమన్నట్టూ,
కుర్చీలు చేతులు బారజాపుకు వొళ్ళు విరుచుకున్నట్టూ
మేజాలు కాళ్ళనీ, అలమరలు వెన్నునీ విరుచుకుంటున్నాయేమో
ననిపించే సమయాలు కొన్ని ఉంటాయి …
మనుషులుకూడా, పనిచేసేచోటనో, ప్రేమలోనో
అంతరాంతరాల్లో తమ అభిప్రాయాలు
ఖండాలు జరిగినంత ఖచ్చితంగా, నెమ్మదిగా
తామే పోల్చుకోలేనంతగా మారుతున్నపుడు
ఏదో ఒకటి ఒళ్ళు విరుచుకునో, అరిచో, వాటిని
ఒకసారి పునరావలోకనంచేసుకునేట్టు చేస్తుంది.
అశాంతినిండిన ఒకానొక సుప్రభాతవేళ,
తెలిసో తెలియకో ఓరవాకిలిగా విడిచిన తలుపు
సందులోనుండి, అప్రయత్నంగా దూరిన తొలిపొద్దుపొడుపుకి
తిరగాలన్న కాంక్షను అణచుకోలేని ఆ కర్రకాళ్ళే
ఎలాగైతేనేం తమ బద్ధకపుపొరనొకటి వదుల్చుకుని,
అశ్వశాలలోంచి వస్తున్న గుఱ్ఱంలా వేగంగా దౌడుతీస్తాయి.
.
యాహియా లబాబిడి
జననం : 25th Sept 1973
ఈజిప్టు కవి
.
.
Dawning
.
There are hours when everything creaks
when chairs stretch their arms, tables their legs
and closets crack their backs, incautiously
Fed up with the polite fantasy
of having to stay in one place
and stick to their stations
Humans too, at work, or in love
know such aches and growing pains
when inner furnishings defiantly shift
As decisively, and imperceptibly, as a continent
something will stretch, croak or come undone
so that everything else must be reconsidered
One restless dawn, unable to suppress the itch
of wanderlust, with a heavy door left ajar
semi-deliberately, and a new light teasing in
Some piece of immobility will finally quit
suddenly nimble on wooden limbs
as fast as a horse, fleeing the stable.
.
Yahia Lababidi
Born 25th Sept 1973
Egyptian-American Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/yahia_lababidi/poems/23479
స్పందించండి